శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ - వివిధ పురాణ గాధలు - అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ల బంధము - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1949 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1984 General Articles and views 1,683,775; 102 తత్వాలు (Tatvaalu) and views 208,236.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*శ్రావణ/ జంధ్యాల పౌర్ణమి, రాఖీ పండుగ - వివిధ పురాణ గాధలు - అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ల బంధము*

హైందవ మతంలో, శ్రావణ మాసానికి విశిష్టత ఉంది. ఈ నెలలో అనేక పండుగలు పర్వదినాలు వస్తాయి. శ్రావణ పౌర్ణమి (జంధ్యాల పూర్ణిమ) ని, రాఖీ పండుగ గా జరుపుకుంటారు. పౌర్ణమి రోజున సోదరీమణులు, తమ సోదరులకు, రాఖీ కట్టి ఆశీర్వాదాలను, పొందుతారు. తమకు రక్ష కట్టిన సోదరిని, జీవితాంతం కాపాడుతానని, సోదరులు వాగ్దానం చేస్తారు. అలాగే అక్కా తమ్ముళ్ల బంధము కూడా.

సోదరి, తమ సోదరుడికి రాఖీ కట్టే ముందు కుంకుమ, చందనం, పెరుగు/ పాలు, స్వీట్లు, స్వచ్ఛమైన నెయ్యి దీపం, దారం లేదా పట్టు లేదా పత్తితో చేసిన రాఖీ తో, పళ్లెం అలంకరించాలి. అనంతరం సోదరుడిని తూర్పు/ ఉత్తరం వైపు ముఖం ఉండేలా కూర్చోబెట్టాలి.

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల - అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు.

సోదరుడికి కుంకుమ పెట్టి, కుడి చేతి మణికట్టుపై, రాఖీ ని కట్టాలి. హారతి ఇస్తారు. అనంతరం సోదరుడికి స్వీట్ తినిపించాలి. తన అన్న తమ్ముళ్లకు, ఉజ్వలమైన భవిషత్తు ఉండాలని, దీర్ఘాయుష్షుతో జీవించాలని సోదరి కోరుకోవాలి.

సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు.

పురాణ గాధలు చూద్దాము - రక్షాబంధనం గురించి బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.

1. శ్రావణ పౌర్ణమి న, పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించిన, ఇంద్రాణి, రక్షను భర్త దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను, ఇంద్రుడి చేతికి కట్టి, రాక్షసులతో యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది.

2. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో, సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు, కృష్ణుడు చూపుడు వేలుకు గాయం అయ్యిందట. అది గమనించిన ద్రౌపది, తన పట్టు చీర కొంగు చింపి, కృష్ణుడి చేతికి, కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని, ద్రౌపది కు హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి, ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా, ఒక కథ ప్రచారంలో ఉంది.

3. ఇక బలి చక్రవర్తి శ్రీమహా విష్ణువును, పాతాళలోకానికి తీసుకువెళ్ళిన సమయంలో, ఆయనను తిరిగి తీసుకు రావటం కోసం, లక్ష్మీ దేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి, రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని, బలిచక్రవర్తి, లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు కథ ఉంది.

4. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు.అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని, తన అన్నలా భావించి, రాఖీ కడుతుంది. తన భర్త అలెగ్జాండర్‌ను చంపవద్దని, పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా, అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.

5. వైఖానస, హయగ్రీవ జయంతులు నేడే - వైఖానస ఆగమనానికి మూలపురుషుడైన, విఖనస మహర్షి జన్మతిథి కూడా, శ్రావణపూర్ణిమ కావడంతో, ఈ రోజును విఖనసాచార్య జయంతిగా, వైఖానసులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు గుర్రపు ఆకారం కలిగిన ముఖంతో హయగ్రీవ అవతారంలో మధుకైటభులనే రాక్షసులతోపాటు హయగ్రీవుడనే రాక్షసుని వధించి, వేదాలను, దేవతలను కాపాడింది కూడా, ఈ శ్రావణ పూర్ణిమ రోజునే.

ప్రస్తుతం అనేకమంది మహిళలు, నిత్యం పారాయణ చేసే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని, శ్రావణ పౌర్ణమి రోజునే, శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారంలో, అగస్త్యమహామునికి బోధించారని బ్రహ్మాండపురాణం పేర్కొంది. ఈ రోజున హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు.

మానవ సంబంధాల మెరుగుదలకు, సమాజంలో ప్రస్తుతం అవసరంగా మారిన మానవ విలువలకు రాఖీ పండుగ అద్దం పడుతుంది. రాఖీ పండుగను, రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్యనే, జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం, ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న, ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి, వారు ఒకరికి ఒకరు అండగా ఉన్నామని చెప్పవచ్చు.

తండ్రిలా మంచి చెడు చెపుతూ మార్గదర్శకముగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడే అన్నయ్య, తల్లి లా ప్రేమ కురిపించే పుట్టింటి క్షేమం కోరే చెల్లెలు దొరకడం చాలా అద్రుష్టం. కాసేపు పోట్లాడుకొని, మరలా క్షణంలో కలిసిపోయే, వీరి మధ్య జీవితాంత ప్రేమ అనుబంధాన్ని, కొన్ని మాటల్లో చెప్పడమంటే కష్టమే.

అయితే అందరూ అలాగే మంచి గా ఉంటారని కాదు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని కూడా, వ్యతిరేకముగా భావనతో ఉంటారు సుమా. పుట్టింటికి చేటు తెచ్చే వారు ఉంటారు.

ఆస్తులు వస్తే, తమకు ఇస్తే, పుట్టిల్లు జై, లేకపోతే నై, అనే వారూ ఉన్నారు. కన్న తల్లి నే చూడని వారు, అన్నలను తమ్ముళ్ళను ఎటూ పట్టించుకోరు. ఇటు తల్లిని చూడక, అటూ అత్తని చూడక, అందరికీ మనస్థాపం కల్గించే, ఉత్తమ అక్కలు/ చెల్లెళ్ళు/ అన్నలు/ తమ్ముళ్ళు కూడా ఉన్నారు. రావణునికి చేటు తెచ్చింది, చెల్లెలు శూర్పణకనే అబద్దాలు తో కదా?

అందుకే ధర్మం నీతి నియమము విలువలు గొప్పవి, బంధము కన్నా అని పెద్దలు చెప్పారు.

మరి అన్నా చెల్లెళ్ళ మధుర గీతాలు కొన్ని, మీరూ మీ అక్కలు/ చెల్లెళ్ళు/ అన్నలు/ తమ్ముళ్ళు కి సొంత గొంతుతో పాడి పంపుకోవడాని, ఈ కింద చూడవచ్చును. తప్పక పాడి సొంత వారికి పంపుతారు కదూ.

1) పుల్ల మావిళ్ళు కోరి పిల్ల వేవిళ్ళకొచ్చే ఒళ్ళో చలివిళ్ళు పెట్టరే
తానా తందాననానా తానా తందాననానా తానా తందాననానా
మల్లె పందిళ్ళు వేసి, తల్లో జాజులు పెట్టి, కొత్త గాజులు వెయ్యరే
తానా తందాననానా తానా తందాననానా తానా తందాననానా

మావయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు, పొద్దు పొడుపు.. (2)
కమ్మ గా. పాడనా., కంటి పాప జోల
కానుకే ఇవ్వనా, చెల్లికి ఉయ్యాల ||మావయ్య అన్న||

అరచేత పెంచాను చెల్లిని, ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా, నా కన్నుల్లో కన్నీళ్ళు చిం.దవా.
అమ్మగా లాలించాడు.., నిన్ను నాన్నగా పాలించాడు..
అన్నగా ప్రేమించాడు.., అన్నీ తానైనాడు..
తన ప్రాణంగా నను పెంచాడు, ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న, ఈ లోకాన లేడు ||మావయ్య అన్న||

*పట్టుచీరగట్టి సారెపెట్టరే దిష్టిచుక్కపెట్టి హారతివ్వరే
అందాలబొమ్మ నీళ్ళాడునమ్మా అక్షింతలేసి దీవించరమ్మా

ఆరేడు మాసాలు నిండగా, ఈ అన్నయ్య కలలన్నీ పండగా
తేవాలి బంగారు ఊయల, కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా.., పాపగా నిను చూడనా..
రేపటి ఆశ తీరగా.. నీ పాపకు జోల పాడనా..
ఇది అరుదైన ఓ అన్న కథ, ఇది మురిపాల ఓ చెల్లి కథ
ఇది చెల్లెలే కాదులే, నను కన్న తల్లి ||మావయ్య అన్న||

Mavayya Anna Pilupu Video Song, Movie: Muddula Mavayya 1989
Bala Krishna, Vijayasanthi - SP Balu, Suseela, Sailaja
మావయ్య అన్న పిలుపు వీడియో సాంగ్, సినిమా: ముద్దుల మావయ్య 1989
బాల కృష్ణ, విజయశాంతి - ఎస్పీ బాలు, సుశీల, శైలజ

2) చందురుని మించు, అంద మొలికించు, ముద్దుపాపాయివే..
నిను కన్న వారింట, కష్టముల నీడ, కరగిపోయేనులే.
కరుణతో జూచి, కనకదుర్గమ్మ, కామితములిచ్చులే..
లోకముల నేలు, వెంకటేశ్వరుడు, నిన్ను దీవించులే..(ఆమె) (అతడు)

అన్న ఒడి జేర్చి, ఆటలాడించు, నాటి కథ పాడనా .. నాటి కథ పాడనా..
కలతలకు లొంగి, కష్టముల క్రుంగు, నేటి కథ పాడనా..కన్నీటి కథ పాడనా
కలతలకు లొంగి, కష్టముల క్రుంగు, కన్నీటి కథ పాడనా...

కంటిలో పాప, ఇంటికే జ్యోతి, చెల్లి నా ప్రాణమే..., చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె, వెతలలో ద్రోసే, మిగిలెనీ శోకమే.., మిగిలెనీ శోకమే
విధియె విడదీసె, వెతలలో ద్రోసే, మిగిలెనీ శోకమే
చందురుని మించు, అంద మొలికించు, ముద్దుపాపాయివే..(అతడు)
నిను కన్న వారింట, కష్టముల నీడ, కరగిపోయేనులే.

మనసులను కలుపు, మధుర బంధాలు, మాసిపోరాదులే..
పెరిగి నీవైన, మామ గారింటి, మనువు నే కోరుమా...
బంధమే నిల్పుమా.., మా బంధమే నిల్పుమా..

కాల మెదురైన, గతులు వేరైన, మమతలే మాయునా..
పెరిగి నీవైన, అత్తగారింట, కోడలిగ చేరుమా..
బంధమే నిల్పుమా.., మా బంధమే నిల్పుమా

దివిలో తారకలు, భువిలో మానవులు, ధూళిలో కలసినా . .
అన్న చెల్లెళ్ళ, జన్మ బంధాలె, నిత్యమై నిల్చులే..

లాలి పాపాయి, హాయి పాపాయి, లాలి పాపాయి, జో జో
లాలి పాపాయి జో జో...

Ghantasala, P Suseela
చిత్రం : Rakta sambandham రక్త సంబంధం (1962), సంగీతం: ఘంటసాల, రచన : అనిసెట్టి సుబ్బారావు, గానం : ఘంటసాల, పి. సుశీల, NTR Savitri

3) విరిసిన సిరిమల్లి.., పెరిగే జాబిల్లి 2
పాలవెల్లిలో పుట్టిన తల్లి, నా చెల్లి 2 ||విరిసిన సిరిమల్లి||

రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని..., అన్నయ్య అన్నా..డు అది తగదని 2
రాయబారమంపింది రా రమ్మని.... 2 పెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని.
నా చెల్లెలే రుక్మిణైతే, రానిస్తానా ఆ గతిని
కాళ్ళు కడిగి తెస్తాను, తాను కోరుకున్న గుణవంతుని ||విరిసిన సిరిమల్లి||

కైక లేని రాముడు, నీ కరమును పట్టాలి...
కాన కెళ్లకే, లవకుశులు, నీ కడుపున పుట్టాలి - 2
రామా రామా అన్న కవలలు, మామా మామా అని పిలవాలి 2
అన్నయ్య కన్నుల, ఆనందాశ్రువులు, అక్షితలవ్వాలి 2 ||విరిసిన సిరిమల్లి||

అన్నే అమ్మగ పెరిగిన చెల్లి..., అన్నెం పున్నెం ఎరుగని తల్లి.. 2
కన్నతల్లి కాంచిన, కలలీ అన్నయ్య, కంటికి రావాలి 2
అవి అన్నీ, పండాలి, నా.. పండుగ కావాలి 2

పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి
విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి 2

చిత్రం : Bangaru chellelu బంగారు చెల్లెలు (1979), సంగీతం : కె.వి. మహదేవన్, గీతరచయిత : ఆచార్య ఆత్రేయ, నేపధ్య గానం : బాలు Sobhan Babu,Sridevi, Jayasudha

4) అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ. అన్నా.. నీ అనురాగం..
పుట్టిన రోజున, మీ దీవేనలే, వెన్నెల కన్నా.. చల్లదనం
ఓ. అన్నా.. నీ అనురాగం..

మల్లెలవంటి, మీ మనసులలో, చెల్లికి చోటుంచాలి
ఎల్లకాలము, ఈ తీరుగనే, చెల్లిని కాపాడాలి..
పుట్టిన రోజున, మీ దీవేనలే, వెన్నెల కన్నా చల్లదనం
ఓ. అన్నా.. నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం, ఓ అన్నా...

అన్నలు మీరే.., నా కన్నులుగా..., నన్నే నడిపించాలి
తల్లీ తండ్రీ.., సర్వము మీరై..., దయతో దీవించాలి
పుట్టిన రోజున, మీ దీవేనలే, వెన్నెల కన్నా చల్లదనం
ఓ. అన్నా.. నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం, ఓ అన్నా...

ఇల్లాలై, నేనెచటికేగినా.., చెల్లిని మదిలో నింపాలి
ఆడపడచుకు., అన్నివేళలా... , తోడూ నీడగా నిలవాలి
పుట్టిన రోజున మీ దీవేనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా..
Annaa Nee Video Song | NTR, Sobhan Babu, Vanisri, Chandrakala Adapaduchu

చిత్రం : ఆడపడుచు (1967), సంగీతం : టి. చలపతి రావు, గీతరచయిత : సి నారాయణ రెడ్డి, నేపధ్య గానం : సుశీల
ఎన్టీఆర్, శోభన్ బాబు, వాణిశ్రీ, చంద్రకళ ఆడపడుచు

5) అన్నయ్య సన్నిధి., అదే నాకు పె.న్నిధి..
కనిపించని దై.వమే, ఆ. కనులలోన ఉన్నది.., అన్నయ్య సన్నిధి..

ఒకే తీగ పువ్వులమై.., ఒకే గూటి దివ్వెలమై.. 2
చీకటిలో వేకువలో.., చిరునవ్వుల రేకులలో..
కన్న కడుపు చల్లగా.., కలసి మెలసి ఉన్నాము.. ||అన్నయ్య సన్నిధి||

కలిమి మనకు కరువై నా.., కాలమెంత ఎదురైన.. 2
ఈ బంధం విడిపోదన్నా., ఎన్నెన్ని యుగాలైనా..
ఆపదలో, ఆనందంలో, నీ నీడగ ఉంటానన్న ||అన్నయ్య సన్నిధి||

Bangaru Gajulu - Annayya Sannidhi ; Starring ANR, Vijaya Nirmala, Bharati
బంగారు గాజులు, అక్కినేని, విజయ నిర్మల, భారతి నటించారు

6) ఆ దేవుడెలా ఉంటాడని, ఎవరైనా అడిగితే ..
మా అన్నలా.. ఉంటాడని, అం.టా.ను నేను

అనురాగమెలా ఉంటుందని, ఎవరైనా అడిగితే..
మా చెల్లిలా.. ఉంటుందని, చెబుతా.ను నేనూ

చెల్లెలున్న ఈ ఇల్లే., సిరిమల్లె. తోట
మా అమ్మలు చిరునవ్వే., ముత్యా.ల మూట - 2
అన్నయ్య హృదయమే అందాల మేడ
చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ
కన్నతల్లి తీపి కలల రూపాలం మనము 2
కోవెలలో వెలిగించిన, దీపాలం మనము ||ఆ దేవుడెలా ఉంటాడని||

అల్లారు ముద్దుగా., నను పెంచినా.వు
అమ్మనూ నాన్ననూ, మరపించినావు 2
ఇల్లాలివై నీవు, విలసిల్లవమ్మా
పిల్లాపాపలతోటి, చల్లగా వుండవమ్మా
పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా 2
అన్నయ్య దీవనే శ్రీరామరక్ష

అనురాగమెలా ఉంటుందని ఎవరైనా అడిగితే
మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేనూ

ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైన అడిగితే
మా అన్నలా ఉంటాడని అంటాను నేనూ

దొరబాబు పాటలు ANR, Manjula and Chandrakala - dorababu

Writer(s): J V Raghavulu, Dasarathi

7) అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే, బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే.. ||అందాల పసిపాప||

ఆ చల్లని జాబిలి వెలుగు .. ఆ చక్కని చుక్కల తళుకు.. 2
నీ మనుగడలో, నిండాలమ్మా .. 2 నా కలలన్ని పండాలమ్మా ||అందాల పసిపాప||

మన తల్లే దైవముగా.., కలకాలం కాపాడునులే.. 2
తోడై నీడై, లాలించునులే .. 2 మనకే. లోటు రానీయదులే ||అందాల పసిపాప||

ల ల లాలి ..ల ల లాలి
ల ల లాలి ..ల ల లాలి

Chittichellelu Movie | Andala Pasipapa | NTR

Shravan Purnami, Rakhi festival - Various legends - Anna chellelu brother sister bond raksha bandhan

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1984 General Articles and views 1,683,775; 102 తత్వాలు (Tatvaalu) and views 208,236
Dt : 10-Aug-2022, Upd Dt : 10-Aug-2022, Category : Songs
Views : 747 ( + More Social Media views ), Id : 1490 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : shravan , sravan , purnami , rakhi , festival , various , legends , purana , anna , chellelu , brother , sister , bond , raksha , bandhan , Muddula , Mavayya , Rakta , sambandham , Bangaru , Adapaduchu , Gajulu , dorababu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content