APLatestNews.com top Banner

Social Media links
కష్టాలు ఎదుర్కొంటానికి, మేము వాళ్ళ అమ్మ ఇచ్చే శిక్షణ ఇది అని శివకేశవుల జవాబు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

అమ్మో, అబ్బో వో వో, గజ గజ లాడే చలి. బండలు చల్లగా, వెన్నులో వణుకు. చాలా కష్టం అయినా, శివయ్య ఉన్నారు, కాబట్టి మనకు ఇష్టం.

శివ శివా నేనంత కష్టం ఇవ్వలేదు అని శనయ్యా. ఊరోకవయ్యా మాకు తెలీదా, రాబోయే వాడి కష్టాలు ఎదుర్కొంటానికి, మేము వాళ్ళ అమ్మ కలసి ఇచ్చే శిక్షణ ఇది అని శివకేశవుల జవాబు.

ఓం నమో నారాయణా అంటూ, ఆ చలి వణుకు లో పాదాలు తడబాటు తో నడుస్తూ ఉంటే, నాభి లోని నరాలు కదులుతున్నాయి. ఒక ప్రదక్షిణ కు 5 సార్లు నారాయణ అంటే, 108 సార్లు కు 540 సార్లు, దైవ నామస్మరణ గంట సేపూ నడుస్తూ ఉంటే ఆయన నడిపిస్తున్నట్టే.

మరి చేతులు కరమాల గా లెక్క పెడుతుంటే మనసులో, ప్రతి ప్రదక్షిణ కు చేతి వేళ్ళ ముద్ర మారుతుంది. చేతి వేళ్ళతో చేసే ముద్ర ల వలన లాభాలు, మీరు విడిగా చదివి తెలుసుకోవాలి మరి.

ఇది కదా, మనసు ను అష్ట దిగ్బంధనం చేయడం అంటే. మన మనసు నే అల్లాడించడం అంటే. చాలా మందికి మనసు అదుపు చేయడం కష్టం, కానీ దానికి ఇది కూడా ఒక మార్గం.

ఈ రోజు చిత్రం ఏమిటి అంటే, వణికే చలి దెబ్బకు, అమ్మ గుడి లోన సాక్స్ కోటుతో కూర్చొని, జపమాల తో లెక్క బెడుతుంది. గంట సమయము మరియు ఇద్దరి లెక్క కలవాలి. అమ్మ గుడిలో ఉంది కాబట్టి, ఆమె చుట్టూ కూడా 108 తిరిగినట్టే కదా. అదీ అదృష్టం అంటే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 615 General Articles, 46 Tatvaalu
Dt : 30-Nov-2019, Upd Dt : 30-Nov-2019, Category : General
Views : 145 ( + More Social Media views ), Id : 236 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : 108 pradakshina
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content