Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఏవండీ ఇన్ని విషయాలు పుంఖాను పుంఖాలు గా రాసి పంపుతున్నారు కదా, 300 పేజీలు పుస్తకం లాగా అని కూడా అన్నారు. చాలా సమయం వృధా కాదా, ఇబ్బంది ఉండదా? ఇది మాధవ సేవ కింద వస్తుందా?
కధా రచయిత, జనం ను మెప్పించడానికి లేదా ధనం సంపాదించడానికి, ఆలోచన చేసి గంటలు గంటలు రాయాలి సరిచేయాలి. మనము ఎవరిని మెప్పించాలి, కేవలం భగవంతుని మాత్రమే. అన్నం పెట్టినా, లాగినా ఆయనదే బాధ్యత.
అది కూడా భగవంతుని సేవ అనుకుందాము. ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఇస్తాడు దేవుడు, అవసరమైన వారిని కలుపుతారు, మరలా విడదీస్తారు.
నా గురువు లు కొందరు, అనంతపురం మరియు విజయవాడ వారు, నాకు కారు నేర్పారు ధైర్యం చేసి, ఊళ్ళో మరియు హై వే మీద ఆనాడు, ఇక్కడ విదేశంలో. మావూరు రైస్ మిల్లు ఓనరు గారు, ఎలా అయినా వాళ్ళ అబ్బాయిని నన్ను ఇక్కడకు పంపాలని మాటలతో ఒప్పించి ప్రయత్నించారు. ప్రయత్న భంగము అయినా, గట్టి పునాది మదిలో వేసారు, మొదటి మెట్టు కట్టారు. అలాంటి మహానుభావులు ఎందరో, వాళ్ళంతా దేవుని ప్రతి రూపాలే, దేవుని బిడ్డలే.
మరి అంత సహాయము మనము వారికి తిరిగి చేయగలమా? మన తాహతు ధైర్యం సరిపోతుందా? మరి నేను అది చేయగలనా? బహుశా నా వలన కాదు.
ఇంకొకరికి చేద్దాము అని ప్రయత్నించినా, వారు మన మాటను తలకు ఎక్కించుకుంటారా? కనీసము వింటారా?
మరి మనం ఆ మంచి వారికిచ్చే తిరుగు బహుమతి? మోహం మాయలో పడకుండా ఆపగలగడం, మనకు చెప్పి వారు పనులు చేస్తే. అమ్మ విదేశములో ఉన్న దానికి, కారులో తిరిగి న దానికి, పుణ్యం లో వారికీ భాగం ఆటోమాటిక్ గా వారికి అందుతుంది. అవి ఎప్పుడు ఉపయోగపడతాయి వారికి? వారి కష్ట కాలంలో.
ఒక ఐదు, పది నిమిషాలు తలనొప్పి లాగా, మదిలో మాటల ప్రవాహం తన్నుకు వచ్చేస్తుంది. అందుకే అందులో కొన్ని ముక్కలు, తప్పులు కూడా ఉంటాయి. ఒకసారి రాశాక , పంపేందుకు 5 నిమిషాలు.
వెనకటి ఒక పెద్దాయన చెప్పారు, రాసేది భాగవతమట రాపించేది మాధవుడు అట అని. వాటి వలన పాపం పుణ్యం రెండూ నాకు వద్దు. అవి ఎవరికి చేరాలో వారికి చేరతాయి, ఏ బిడ్డలు కు అందించాలో, ఏ బిడ్డలు ను మేలుకొలపాలో, ఆయనే మేలుకొలుపు తారు.
చదవని వారు ఎటూ చదవరు, పక్కన పడేస్తారు. కొంతమంది సంవత్సరము ముందే పారిపోయారు.
మనమంతా దేవుని బిడ్డలము అయినప్పుడు, తోటి వారికి చేసేది అరగంట పని, భగవంతుని సేవ అవుతుంది కాని, వృధాగా ఎందుకు అవుతుంది? ఆ గురువు ల లో నన్ను తిట్టి, వెబ్సైట్ లో(బయట వారికి అందాలి కదా) వాటిని సరి చేసేవారు, మరి కొందరు.
ఇదే కాక విడిగా గంటలు గంటలు, ఫోన్ లో ఇతరుల సమస్యలు వినడము, దానికి పరిష్కారము, టెన్షన్ ను తగ్గించి, అవసరమైతే తిట్టి సరిచేయడము, మనశ్శాంతిని కలిగించడము ఏళ్ళు గా జరుగుతూనే ఉంది. అంతా ఈశ్వరార్పణం.
మానవ సేవయే మాధవ సేవ, మనకు చేతనైంది చెయ్యాలి గదా, స్వార్ధము లేకుండా. మనము మన చుట్టూ ఉండే ఎవరూ, మోహములో మాయలో ఉండకూడదు అని పడే తపన ఆర్తి, భగవంతుని సేవ కిందకు రాదా?
మనం సినిమా కు వెళితే, సొల్లు కబుర్లు, ఇంట్లో తగవులు తో పోల్చుకుంటే, ఇది పెద్ద వృధా కాదేమో. అయితే, ఆయనే వేరే పని అప్ప చెప్పి, దృష్టి మరలుస్తారు. కర్త కర్మ క్రియ ఆయనే. మనము సున్నా మాత్రమే.
కొంత కళ్ళకు ఇబ్బంది ఉంటుంది, మరి ఫోన్ చూడటము సినిమా చూడటము మానడము లేదు కదా మనము.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1808 General Articles and views 1,399,310; 94 తత్వాలు (Tatvaalu) and views 185,047 Dt : 26-Jan-2020, Upd Dt : 26-Jan-2020, Category : General
Views : 867
( + More Social Media views ), Id : 293 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
writing article ,
helping good people Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments