కరోనా సూక్ష్మ జీవి దెబ్బకి నమ్మలేని, జీవిత కాలంలో ఊహించలేని, కొన్ని గొప్ప సంఘటనలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2186 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2221 General Articles and views 2,493,511; 104 తత్వాలు (Tatvaalu) and views 267,404.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

1. సంపూర్ణ మద్య నిషేధం అమలు దిశగా చర్యలు

2. దిక్కుమాలిన తలనొప్పి (తెలుగు) సీరియల్స్ ఆగిపోవడం

3. పెద్ద నగరాల్లో లేదా హైవే మీద ట్రాఫిక్ సమస్య నుండి ఊరట

4. వాహనాల రద్దీ లేకపోవడం తో రోడ్లపై తగ్గిన ఆక్సిడెంట్ లు, మరణాలు

5. కాలుష్య రహిత రోడ్లు, పట్టణాలు,నగరాలు

6. తల్లి దండ్రులు శ్రద్ధగా, పిల్లల చదువు సంధ్య లు గమనించడం, వాళ్లతో ఆడుకోవటం

7. మగవాళ్ళు పిల్లలు ఇంటి మరియు వంట పనుల్లో మహిళలకు సాయం చేయడం

8. డబ్బులు, నగలు, షాపింగ్, ఇతర అనవసర వస్తువుల మీద మక్కువ తగ్గడం, అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడం

9. డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడం

10. బయట అడ్డమైన తిరుగుళ్లు లేకపోవడం, అవసరం లేని చెత్త తినకపోవడం

11. వ్యక్తిగత శుభ్రత మీద, పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం

12. గాడి తప్పిన మానవాళి ని సరి చేసేందుకు ప్రకృతి నేరుగా చర్యలు చేపట్టడం, అవి ఫలితాలను ఇవ్వడము

13. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని మనుషులు గుర్తించడం

14. సనాతన భారతీయ సాంప్రదాయ పద్ధతులు గుర్తు తెచ్చుకుని పాటించడం.

15. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, మొదటిసారిగా పక్కవారికి రోగాలు రాకూడదు, అని మనస్ఫూర్తిగా కోరుకోవడం, ఎందుకంటే తర్వాత మనకూ వస్తాయి కాబట్టి

16. డబ్బు ఎంత ఉన్నా విధి వక్రీకరిస్తే, మన పని మనమే చేసుకోవాలి, అని గుర్తెరిగి కలసి మెలసి అంతా పని చేసుకోవడం

17. అనూహ్యంగా క్రైం రేట్ తగ్గడం, హత్యలు, అత్యాచారాలు, కిడ్నప్ లు, భూ మాఫియా, డ్రగ్స్, బెదిరింపులు, తగ్గుముఖం పట్టడం

18. న్యాయం కోసం పోలీసు స్టేషన్ కు వెళ్లే బదులు, అసలు నేరాలు జరిగే అవకాశాలు తగ్గిస్తూ, అడుగడుగునా పోలీస్ చెక్ పోస్టులుండడం

19. గత 10 రోజులుగా చికిత్స లు, మందులు అవసరం లేని చిన్న చిన్న జబ్బులకు, వైద్యం అవసరం లేదని నిరూపించిన మానవ శరీరాలు. అనవసర వైద్య దోపిడీకి చెక్

20. కుల, మత, ఆచారాలు, నమ్మకాలు పక్కనపెట్టి, ప్రజలందరూ సైన్స్ ను నమ్మేలా, మానవ జాతి పునర్నిర్మాణం

పై విషయాలు, లాక్ డౌన్ తర్వాత కూడా అమలయ్యేలా, ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తే మన మరియు రాబోయే జన్మలు సార్ధకమైనట్టే!! ఆరోగ్యం, మనశ్శాంతి, ఐశ్వర్యం, క్రమశిక్షణ, ఒళ్ళు వంచి పని చేయడం, అన్నీ మన సొంతం.

వాట్సప్ నుంచి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2221 General Articles and views 2,493,511; 104 తత్వాలు (Tatvaalu) and views 267,404
Dt : 05-Apr-2020, Upd Dt : 05-Apr-2020, Category : General
Views : 1070 ( + More Social Media views ), Id : 473 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , lock down days , covid 19 , people behaviour
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content