Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. *పదవుల మత్తు, నాయకుల చిత్తు, ప్రజలకు సత్తు*
*తమ స్వార్ధం కు ఉపకారం, ఊరు బాగుకు అపకారం, ఎన్నుకున్న ప్రజలకు పాపహారం.*
పదవీ అధికార లేదా వ్యాపార మత్తులో, కష్టాలకు నష్టాలకు భయపడి, ఒక్కోసారి, ఏమి చేస్తున్నారో, వయస్సు అనుభవం ఉన్న నాయకులకు కూడా తెలీదు, తమ వారసులకు నష్టం చేస్తూ, చరిత్రలో మచ్చ గా మిగులుతారు. మీ జిల్లాలో కూడా, ఇలాగే ఉంటారు సుమా.
రాజకీయ కామాతురాణామ్ న భయం న లజ్జ, అంటే పదవీ వ్యామోహం కలిగితే ఆత్మాభిమానం మంచితనం అడుగంటుతుంది. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, అహంకారముతో ఎలా దుర్వినియోగం మోహములో చేస్తున్నారో చూడండి.
అందరూ కలసి నిర్లక్ష్యం గా, చీరాల జిల్లా అవకాశాన్ని, జిల్లా కేంద్రం ను కూడా, కాలదన్నారు. మరి జిల్లా శాఖలు అన్నా తెస్తారా? తెలీదు. బాపట్ల జిల్లా, చీరాల రెవెన్యూ డివిజన్ ఎలాగూ వస్తాయి, కష్టపడకుండానే.
జిల్లా కేంద్రం తీసుకురానందుకు, హిందుపూర్ లో ఎమ్మెల్యే హీరో బాలక్రిష్ణ ను, రాజీనామా చేయమని అడుగుతున్నారు. సినిమా ధ్యాస తప్ప, నియోజకవర్గం మీద ఆసక్తి లేదు, ఊళ్ళో ఉండరు, వ్రుధా గా పదవి ఎందుకు అని.
మరి చీరాలలో, ఎమ్మెల్యే కరణం మరియు వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఆమంచి రాజీనామా బాధ్యతతో, తమ పరువు నిల్పుకుని నిబద్దత చాటడానికి?
ఒకసారి, అద్దంకి, బాపట్ల, మరియు చీరాల ప్రస్తుత మరియు మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి చూద్దాము.
1) తెదేపా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, 2019 నుంచి దైర్యముగా నిజాయితీ గా చంద్రన్న తో నిలబడి, గోడ దూకకుండా, వ్యాపార నష్టాలను ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు. ఆత్మాభిమానం చంపుకుని, తలవంచి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. కొత్త జిల్లాల వలన, తన ప్రజలకు ఉన్న కష్టాన్ని పబ్లిక్ గా చెప్పుకున్నారు.
రేపు తన అనుకూల ప్రభుత్వం వస్తే, ఆ నష్టాలు పూడ్చుకుంటారు. మరి చంద్రన్న అప్పుడు విలువ ఇస్తారో, పక్కన పెడతారో తెలీదు. గతములో వైసీపీ నుంచి తెదేపాకు దూకారంట మరి, 2014 లో. అందరమూ తప్పులు చేస్తాము, కానీ మరలా చేయకూడదు. వయస్సు పెరిగేకొద్ది, ఆలోచన కూడా పెరగాలి కదా, అదే తప్పు మరలా చేయలేదు.
2) బాపట్ల ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి, ఎప్పటికప్పుడు, తన నియోజకవర్గానికి ఏమేమి వస్తున్నాయో, మెడికల్ కాలేజీ, కోర్ట్ బెంచ్ లాంటివి, స్పష్టముగా సమాచారం ఇస్తున్నారు.
ఊళ్ళో అందుబాటులో ఉన్నారు. జిల్లా ఏర్పడే ముందు, అందరితో వ్యక్తిగతము గా మర్యాదకు కలసి ఒప్పించారు.
బాపట్ల జిల్లా ఎమ్మెల్యేలు అందరూ, కోనా ను చూసి నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. మంత్రి పదవి జిల్లాకు ఇస్తారేమో చూడాలి.
3) కానీ అదే ధైర్యం క్రుతజ్ఞత విశ్వసనీయత, అద్దంకి జనాలు నిరాదరిస్తే, చీరాల జనాలు ఆదిరిస్తే ఎమ్మెల్యేగా గెలిచిన, కరణం బలరాం కి లేకుండా పోయింది. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, మోహం లో, పాడు చేసుకుంటున్నారు. జనాలను పిచ్చి వారిని చేసి గేళి చేస్తూ, ఆత్మాభిమానం విలువలు వదిలి, తలవంచి గోడ దూకారు, కనీసం ఊళ్ళో కూడా ఉండలేదు, తమ పబ్బం గడుపుకుంటున్నారు.
పోనీ వ్రతం చెడ్డా ఫలితం ఉంటే, పొగుడుదామని చూస్తుంటే, ఫిషింగ్ హార్బర్ లేదు, చీరాల జిల్లా లేదు, ఓ 10 జిల్లా శాఖలు కూడా లేవు, స్మార్ట్ బీచ్ సిటీ, చేనేత పార్క్ లేదు, పెద్దగా చెప్పుకోవాల్సింది కొత్త గా ఏదీ లేదు.
మరి ఆయన ఎందుకు దూకారు, కేవలం వ్యాపారం, భయం, అధికార దాహం కోసమా? తర్వాత మరలా లాభం రాదా? తెలిసి చేస్తున్నారా తెలీక చేస్తున్నారా, వారసుడు కు చేస్తున్న ద్రోహం కూడా, కరణం కు అర్ధం కావడం లేదా?
చంద్రన్న ను వేలెత్తి చూపారు, ఆయన ఇచ్చిన భిక్ష ఎమ్మెల్యే పదవి తోనే కదా, గోడ దూకింది? రోషం ఉంటే, గతం బాధ ఉంటే, తెదేపా పై ఎలా నిలబడ్డారు? పోనీ, జగనన్న పై ప్రేమ ఉంటే, రాజీనామా చేసి ఎందుకు మరలా నీతి గా గెలవలేదు? పొనీ, పెళ్ళి వారితో, కాపురం వీరితో అయినా, కనీసం, బతిమాలి, మంత్రి బాలినేని వాసన్నను, ఊళ్ళో నా పరువు తీయొద్దు, ఏదో ఒక పెద్దది ఇచ్చి, పని మొదలు పెట్టండి అన్నారా?
పోనీ వైకాపా తో అక్రమ బంధం వదలి, తెదేపా వైపు నుంచి, చీరాల అభివ్రుద్ది కి ధర్నాలు పొరాటాలు చేసి, ఫలానవి కావాలన్నారా, ప్రజల తరపున? పోనీ, ఊళ్ళో 3 ఏళ్ళు గా ఉన్నారా? కరోనా సమయంలో చీరాలలో అండ గా ఉన్నారా? ఏదీ లేదు.
మరి దేనికోసం, ఈ తాపత్రయం ఈ పెద్ద వయస్సులో, వారసుడు వెంకటేష్ కు అవమానం మిగిలిస్తూ, భవిష్యత్ కాలరాస్తూ? ఇప్పుడు అయినా, వైకాపా నుంచి గట్టి అభివ్రుద్ది తీసుకు రండి.
లేదా, చెంపలు వేసుకుని, తెదేపా వైపు పోరాటాలు చెయ్యండి. అభివ్రుద్ది తో వెంకటేష్ కు ఒక మంచి గుర్తింపు తెచ్చే అవకాశం ఇవ్వండి. తప్పు సరిచేసుకోండి, మన భవిష్యత్ తరాలు క్షమించవు. తప్పులకు మూల్యం చెల్లించుకోవాలి.
4) చీరాలకు అన్యాయం జరుగుతుంటే, కేవలం ఉపయోగం లేని పట్టణ వైసీపీ సారధి పదవితో, నోరుముసుకుని కూర్చున్న, మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్, తన బలాన్ని మరచిపోయారు, తన అసమర్ధత భయాన్ని చూపెట్టారు. తాకట్టు పెట్టారు, అదే వ్యాపారాల కోసమా, జైలు కు పోవాలని భయమా? జగనన్న ఇదే భయముతో సొనియమ్మ దగ్గర కూర్చుని ఉంటే, ఈ రోజు సీయెం అయ్యేవారా?
లోకేష్ ను తెచ్చి, కొత్తపేట స్కూల్ తెచ్చి, ప్రవేటు విద్యాసంస్థలను, అణిచిన ధైర్యం ఏది? సొంత పార్టీ పెట్టి, గెలిచిన పరాక్రమం ఏమైంది? చేతగాని వానిలా, గమ్మున అదికారపక్షము లో ఓ మూలన నక్కి ఉండే కన్నా, రాజీనామా చేసి, చీరాల అభివ్రుద్ది కోసమై, ధర్నాలు నిరాహారదీక్షతో పాటుపడితే, ఊళ్ళో తిరిగితే, ప్రజలు గుర్తించి, స్వతంత్ర అభ్యర్ధిగా అయినా మరలా గెలిపిస్తారు కదా?
ఇలా భయముతో మూతి ముడుచుకుని కూర్చుంటే, లేదా మున్సిపాలాలిటీ లో వార్డు కౌన్సిలర్ల తగాదాలతో సంత్రుప్తి చెందితే, మనకు పతనం ప్రారంభము అయినట్లే కదా?
ఎమ్మెల్సీ సునీత, అసలు అభివ్రుద్ది మాటే వద్దు, ఎమ్మెల్సీ పదవి ముద్దు, అంతే, మరలా ప్రభుత్వాలు మారిందాకా, సైలెంట్, చీరాల కూ ఏమీ వద్దు, నా పదవి నాకు చాలు.
5) స్థానిక బీజేపీ, జనసేనా నాయకులు ఏటూ నిద్ర లేవరు. వారిని, వారి పార్టీలే గుర్తించరు, వారికి బాధ కూడా లేదు. ఆఖరికి వారి స్థానిక నాయకుల ధర్నా ఫోటోలు కూడా, వారి స్థానిక బీజేపీ జనసేనా సోషల్ మీడియాలో పెట్టరు. ఆ లింక్ లు జనానికి చూపరు. వారికి అసలు విలువే లేదు పార్టీలో, ఉంటే, వారి సోషల్ మీడియాలో వారి ఫొటో ఉందా? ఇన్ని రోజులు గమ్ముగా ఉంటారా? వారు వీధుల్లో ఎవరికీ తెలీదు, వారూ కనపడరు, దిష్టి తగులుతుంది అని.
స్థానిక తెదేపా ను, కరణం కోసం భూస్థాపితం చేసారు. నాయకులను కట్టలు కట్టలు గా అవలీలగా తయార్చేసే చంద్రన్న కూడా, ఇక్కడ తయారు చేయలేక ఓటమి అంగీకరించి, సంతోషముగా మూసేసారు, చతికిల పడ్డారు. వారికి కనీసం 30 మంది మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కూడా అభ్యర్ధులు గా దొరకలేదు. చీరాల అభివ్రుద్ది, ఎమ్మెల్యే చెతగాని తనం గురించి మాట్లాడలేని, ఉత్తుత్తి డమ్మీ స్థానిక అధ్యక్షుడితో, కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
కాబట్టి, వీరు ఎవరు, పట్టణ అభివ్రుద్ది కై పాటుపడరు, కేవలము ఉత్సవ విగ్రహాలు. ఇలా ప్రతి పార్టీ నాయకులు, స్వార్ధములో కూరుకు పోయి లేదా ఇంకొకరికి అమ్ముడుబోయి లేదా తమ పార్టీలోనే విలువ లేకుండా ఫోటోలు కూడా పెట్టుకోలేని స్థితిలో, ఊరికి నష్టం చేస్తుంటే, ప్రజల మైన మనము, టీవీ సీరియల్స్ సినిమాలతో, బిజీ గా ఉన్నాము.
తలా పాపం పిడికెడు అంటే ఇదేనేమో. చేసుకున్న వారికి, చేసుకున్నంత.
Same Neglect as Addanki, Chirala Karanam - Amanchi silence fear? Further development?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,325,934; 104 తత్వాలు (Tatvaalu) and views 252,442 Dt : 05-Apr-2022, Upd Dt : 05-Apr-2022, Category : Politics
Views : 686
( + More Social Media views ), Id : 1329 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
bapatla ,
kona ,
ycp ,
amanchi ,
chirala ,
tdp ,
yadam ,
dummy ,
karanam ,
bjp ,
janasena ,
potula ,
kona ,
gottipati Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments