మిగతా లోకం తీరు కూడా
చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి.
2234 కధనాలు.
ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2269 General Articles and views 2,600,323; 104 తత్వాలు (Tatvaalu) and views 277,567.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.2 min read time.
మొదటగా పండుగ సందర్భంగా, ఈ ఫోన్ లేదా సోషల్ మీడియా మెసేజ్ లో లేదా ఇతర పద్దతిలో, శుభాకాంక్షలు తెలిపి సొంత ఇంటి పూజ ఫోటోలు, పిల్లల లేదా తమ గొంతు శ్లోకాలు పంపిన వినిపించిన, హైందవ ఆచరణ (చేతల) గురువు లకు, నమస్సుమాంజలి.
నమస్కారానికి ప్రతినమస్కారము కూడా చేయాలని, ఎంతో సంస్కారము పెద్దల దీవెన ఉంటేనే, ఈ భౌతిక మాయా ప్రపంచములో, అనిపిస్తుంది. లేకపోతే ప్రాపంచిక మాయలో చేతులు కదలవు. గొంతు, చేతులు కదలని నిర్భాగ్యులను చూడండి ఎంత కష్టమో, క్రుతజ్ఞతలు తో దేవుని మానవుని సేవ మరవకండి.
మా బంధువులు పూరింట్లో ఉన్నా, వారింటికి వెళితే, వారు మంచం మీద పడుకుని ఉంటే, వారి పాదాల దగ్గర నమస్కరించి కూర్చుంటా, నేల మీద కూర్చుని వారు పెట్టిన పచ్చడి తింటా ఆనందముగా. అది మా తల్లి దండ్రులు, నేర్పిన సంస్కారం. హోదా ప్రదేశము స్థానము ధనము కాదు, మనిషి గుణము మాత్రమే చూడు గౌరవించు, అని పెద్దలు ఋషులు చెప్పారు.
శివతాండవ స్తోత్రం వినండి, మీరూ అనండి. దైవ పాటలు పాటలు ఆచరణలో చేస్తూ పంపుతుంది, మీరు పొగడాలనో తెగడాలనో కాదు, సుమా 7 ఏళ్ళు గా దానికి, వచ్చింది పోయింది ఏమీ లేదు ఉండదు ఉండకూడదు. పూర్ణము అంతా శూన్యము.
ప్రతిసారి శనివారం మెసేజ్ లో చెప్పాను ఇప్పుడు మరలా చెపుతున్నా, మీ కన్నా పెద్ద పాపాత్ముడను, సందేహం అనుమానం ఇసుమంత కూడా లేదు. మన మాటలతో చేష్టలతో, రోజూ ఎన్నో ప్రాణులను కూడా చంపుతున్నాం, ఇబ్బందులు పెడుతున్నాము. చీమలు దోమలు, మంత్రాల అరుపులకు కనపడని సూక్ష్మ జీవులు, ఎన్నో మరణిస్తున్నాయి. పురుగులు చేతితో కొట్టి చంపుతున్నాము. పాపం పాపమే, ఏదైనా.
భూమాత గుండెల్లో గునపాలు దించి, హాయిగా పంట పండించి తింటూ, అలాగే ఇళ్ళు కట్టుకుని ఉన్నాము. సొంత తల్లి దండ్రులు కే, నరకం చూపిస్తున్నాము. మన పాలు వేరే అమ్మ బిడ్డకు ఇవ్వము, కానీ ఆవుల బర్రెల పాలు, తన బిడ్డకు లేకుండా, జాలి దయ లేకుండా హాయిగా తాగుతూ ఉన్నాము, మనం పాపాత్ములం కాదా? ఇక వీటికన్న పైన చేసే పాపాలు, వారి బిడ్డలకు మరియు వీరి పునర్జన్మకు శాపాలు అవుతాయి. అందుకే పూజ, సంస్కారము, పెద్దల పాద సేవ, మిత సౌకర్యాలతో, మన పుణ్యం పెంచాలి.
కాబట్టే నాకు 7 ఏళ్ల తల్లి పాద సేవ, 20 ఏళ్ల నేల నిద్ర మరియు శాఖాహారం. మీలాంటి పుణ్యాత్ములను, రోజూ తలచే భాగ్యం దక్కింది. అయినా కూడా నా పాప రాశి తగ్గుతుంది, అన్న నమ్మకం ఇసుమంత లేదు.
మరి ఎందుకు పంపుతున్నాను? పుణ్య స్వార్ధం ఉంది. ఓకవేళ మీరు కూడా హైందవ, ఆచరణ (చేతల) లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరులు అయితే, మీరు లేదా మీ ఉత్తమ సంస్కార పెంపకంలో పెరిగిన పిల్లలు, రాసిన మాటలు చెప్పిన శ్లోకాలు, మా లాంటి అజ్ఞాన శిష్యులకు చూపిస్తే వినిపిస్తే, తరించి ఆనందించి, మనసులో నే మీ ఉత్తమ చేతల హైందవ సంస్కారం కు, తలవంచి కన్నీటి నమస్కారం చేసి, ఇంకొంత పాపాన్ని తగ్గించుకునేందుకు, సత్సంకల్పంతో మాత్రమే పంపుతున్నాను, 7 ఏళ్లుగా.
అలాంటి వారు కొందరు కనపడ్డారు, ఇంకా కనపడతారు, కరోనా తో నో ఇంకో దానితోనే, మన ప్రాణం పోయే లోపు. దేవుడికి కూడా విన్నవించా, ఒకటి కొంటే ఇంకోటి ఉచిత ఆఫర్ కూడా ప్రాధేయపడుతున్నా, అమ్మతో పాటే పైకి, నన్నే చెయ్యి పట్టి నడిపే భాగ్యం, ఇవ్వమని.
మరి ఆ టక్కరి భగవంతుడు నల్లనయ్య ఈ పాపాత్ముడి మాటలు, మన్నిస్తాడో తరింప చేస్తాడో లేదో తెలీదు. మాకున్న అర్ధ రూపాయి, ప్రభుత్వం (అంటే ప్రజలు) తీసుకున్నా చాలు, ఎన్నో సార్లు మీతో అన్నాను. కన్న భూమికి, అంతకన్నా ఏమి చేయగలము నేడు. మీరే సాక్ష్యం. సర్వే జనా సుఖినోభవంతు.
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము