కదలి గర్జించిన సజ్జల సోషల్ మీడియా, ఇంకా చేయాల్సిన ఉత్తమ బాధ్యతలు ముగ్గురిలో మిన్నగా - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ముందుగా సజ్జల గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనము ముందే అనుకున్నాము, మన విజయ సాయి వైవీ సజ్జల ముగ్గురు లో, సజ్జల నే వ్యక్తి గతము గా చాలా మంచి వ్యక్తి అని.

అయితే, మనము మాట్లాడుతుంది, వీరిలో జగనన్నకు బాధ్యత గా ఎక్కువ మంచి ఎవరు చేస్తున్నారు, ఎంత శాతం అన్న విషయం గురించి మాత్రమే సుమా, వ్యక్తి గత మంచి లేదా కేసుల గురించి కాదు. మిగతా పార్టీల నాయకులవి కూడా త్వరలో చూద్దాము.

పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు, తమ అవసరాలకు మొహమాటానికీ నిజాలు మంచి చెప్పక, విలేఖరులు కూడా చెప్పక పోతే, ఇంకెవరు చెపుతారు గుర్తు చేస్తారు బాధ్యతను, తమ పార్టీ నాయకునికి (అలాగే ప్రజలకు) మంచి ఇంకా ఎక్కువ చేయమని? జనం ఎటూ చెప్పరు చెప్పలేరు.

అందుకే గతము లో, నిష్పక్షపాత విలేఖరులను, తమ అంతరాత్మ లాగా, చాలా గౌరవముగా చూసే వారు, అండగా ఉండే వారు, కోపం తెచ్చుకోకుండా. ఎందుకంటే, నిజాయితీగా తప్పులు ఒప్పులు చెపుతారు, ఆశలకు లొంగకుండా.

మరి ఇప్పుడు అలా ఎవరైనా ఉన్నారా? సగం పచ్చ వైపు, సగం బులుగు వైపు, అంతా కుళ్ళు కుట్ర అబద్దాలు మోసం మాయ, అంతే. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు గా, బురద చల్లడమే, గుడ్డ కాల్చి నెత్తిన వేయడమే.

మీకు ముందే మనవి చేసాము, 4 పార్టీలు మన పిల్లలే (1 వ అబ్బాయి బీజేపీ, 2 వ అబ్బాయి తెదేపా, 3 వ అబ్బాయి వైకాపా, 4 గో చిన్నోడు జనసేన, అందరికన్నా పెద్దోడు 0, కాంగ్రెస్ దీర్ఘ విశ్రాంతి లో).

వారి వలన మంచి చెడు గోల తలనొప్పి కూడా పడాల్సింది, మనము మన పిల్లలు స్నేహితులు బంధువులే. కాబట్టి వారిని మార్చుకోవాలి, చిన్న గా మంచి వైపు.

పొగడాలి, అలాగే విమర్శలు కూడా చెయ్యాలి, ఉన్నది ఉన్నట్టు విన్నది విన్నట్టు చెప్పాలి. అందుకే ఆ పార్టీ వారికే నేరుగా పంపితే, వారు వారు ఫార్వార్డ్ చేసుకుని, మన రాత లో తప్పు ఉన్నా, సరి చేయమని అడగితే, మారుస్తాము తప్పకుండా, అది సరైన తప్పు అయితే.

మనకు తెలిస్తే, ఏ పార్టీ నాయకుడైనా, శుభాకాంక్షలు తెలుపుతాము, ఇందులో దాపరికము లేదు. ఇష్టము లేని వారు వెళ్ళి పోతారు, అలాగే నచ్చిన వారు 2 ఏళ్ళు పైగా నూ ఉన్నారు, వారి ప్రైవసీ గోప్యత కాపాడుతున్నాము.

మనము, ఈ వారం కధనం (ఈ link లొ చూడండి), సోషల్ మీడియా లో టాగ్ చేసింది చూసారో, లేక వేరే వారు వారికి పంపారో లేక తనే మొదలుపెట్టారో తెలీదు కానీ, మొత్తానికి, మరలా, వారి ఫేస్బుక్ లో పోస్ట్ ల కదలిక వచ్చింది. అదే, మనకు కావల్సింది కూడా.

చూడండి వారి ఫేస్బుక్ లింక్ లో, FB, గత మార్చ్ 18 తర్వాత, మొదటి ఘాటు పోస్ట్ మన చంద్రన్న మీద నిన్న జూన్ 16 న వచ్చింది. 11 పాయింట్ల తో, మా 2 వ అబ్బాయి చంద్రన్న ను, 3 వ అబ్బాయి జగనన్న తరపున ఏకిపారేసారు. లోన వివరాలు మనకు వద్దు, రాజకీయ నాయకులు, వారు వారు సరదాలు వారే చూసుకుంటారు.

సజ్జల గారు, ఇంకా చేయాల్సినవి -

1. అదే పోస్ట్ లింక్ మరియు ఫోటోలు, వారి ట్విట్టర్ లో కూడా పెట్టడం. లేదా కనీసం కొన్ని పాయింట్లు పెట్టడం. రోజూ కూడా, ఫేస్బుకు ట్విట్టర్ లో ఏదో ఒక జగనన్న పొగడ్త లేదా ప్రతిపక్ష తెగడ్త, ఖచ్చితం గా ఉండాలి.

ఉత్తరాంధ్ర విజయ్ సాయి, రోజుకు 3 కనీసం పెడుతుంటే దుమ్ము దులుపుతూ, మనము ఎందుకు కనీసం 1 కూడా పెట్ట లేము? మనము ఎందుకు కోస్తా రాయలసీమ వైపు నుంచి పోటీ లో తగ్గాలి?

ఇది ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా ఇదే పద్దతి పాటించాలి. ప్రతి పార్టీ, పై పెద్ద నేతల గురించి రాసినప్పుడు, ఇంక ఎమ్మెల్యే ఎంపీ గురించి కూడా రాస్తాము కదా? ఉత్తములు బయటకు రావాలి కదా?

2. మంత్రి వర్యులు కొడాలి నాని మాట్లాడే మాటల్లో నిజమున్నా కూడా, ఆ మాట్లాడే విధానము పద్దతి బాగోలేదు. మా 2 వ అబ్బాయిన పట్టుకుని మరీ ఘోరముగా అవమానిస్తున్నారు. అది కొంచెము, మారాలి. తగిన సూచనలు సలహాలు ట్రైనింగ్ ఇవ్వాలి సుతిమెత్తని విమర్శలకు. వైవీ గారు, పెద్దారెడ్డి ని ఆప గలిగారు.

3. ప్రకాశం కలెక్టర్ మరియు జిల్లా అధికారులతో, సోషల్ మీడియా నడపాలి, మంత్రి బాలినేని తో చెప్పించి. అనంతపురము జిల్లా లో చంద్రుడు గారు, అలా చేసి చూపించారు. ఆ క్రెడిట్ ఆ ఏరియా పెద్ద, మన వైవీకి వస్తుంది, అలాగే మిగత ఇద్దరుకూ రావాలి కదా? మంత్రి బాలినేని కి, ప్రకాశం లో వైసీపీని బలొపేతం చేయడమే ముఖ్య పని అని, తెదేపాను బలోపేతం ఎలా చేయాలో చంద్రన్న చూసుకుంటారు అని అర్ధము అయ్యేలా చెప్పాలి.

4. జనము తెదేపా ను 23 తో పక్కన కూర్చోపెడితే, మరలా వారి నాయకులనే మనము చేర్చుకుని, ఎమ్మెల్యేలు గా ఎమ్మెల్సీ లు గా చేస్తే, మనకు మనమే దొందూ దొందే అంతా ఒకటే అని నిరూపించుకోవడం అవసరమా? బీజేపీ జనసేన ఆరోపణలు అవేగా, తెదేపా వైకాపా ఇద్దరూ స్టిక్కెర్ల దొంగలేను అని. మనము కొంచేము ఎడం పాటించ వద్దా?

5. చంద్రన్న ప్రకటించకముందే, మనము, ఇక పధకాలకు కుటుంబ పేర్లు పెట్టము అని ప్రకటించాలి. కేసీయార్, మొదీ తో మనమూ పోటీ పడాలి నీతి లో.

6. మీ ముగ్గురూ కలసి, 3 ప్రాంతాల మంత్రు ల తో మాట్లాడి, అనంత జిల్లా ఫార్ములా - జిల్లా అధికారుల సోషల్ మీడియాలో, జగనన్న పధకాల అమలు వివరాలు రావాలి రోజూ అని నచ్చ చెప్పి, దాని విలువ తెలపాలి.

జగనన్న నమ్మకాన్ని, మీ ముగ్గురు అన్ని విధాలా నిలపాలి. మీ ముగ్గురికి ధన్యవాదాములు ఎందుకంటే మీ నాయకులు అర్ధము చేసుకుని, ఈ 2 ఏళ్ళ లో, ఒక్కరు కూడా, మమ్మల్ని గట్టిగా తూలనాడలేదు వార్నిగ్ లు ఇవ్వలేదు. ఒకవేళ చదవకపోతే, మాది తప్పు కాదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 17-Jun-2021, Upd Dt : 17-Jun-2021, Category : Politics
Views : 120 ( + More Social Media views ), Id : 1209 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagananna , political , advisors , review , vijaysai , yv , subbareddy , sajjala , vemireddy , social
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content