Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం
* నిజంగా, మన మనసు ను, మనం అర్థం చేసుకుంటే, ఒంటరిగా ఉన్నా, సంతోషంగా నే ఉంటాము. అర్థం కానప్పుడు, ఎందరిలో ఉన్నా , ఒంటరిగా నే బాధ పడతాము.
* ఒకట కాకరకాయ, రెండు వెల్లుల్లి రెబ్బలు, అంగుళం అల్లం ముక్కల పచ్చి రసం, ఇమ్యూనిటీ కి ఉచిత మొదటి మెట్టు.
* మంచి మనసులు, మంచి మనుషులు, నాయకులు, అధికారులు, వెనుక బడి నిర్లక్ష్యంగా వదిలివేసిన, మా ప్రాంతానికి కొన్ని అయినా, మీ శక్తి మేరకు, దయచేసి కొత్త పనులు తీసుకురాండి. ఇప్పుడు దాకా అన్ని పార్టీలు, నాయకులు భ్రమలలో ఉంచారు వారు బాగుపడ్డారు, జనం కూడా మోహం లో ఉన్నారు, ఓట్లు అప్పుడు చాలనుకున్నారు.
30 ఏళ్లుగా, గుంటూరు ప్రభుత్వ లేదా ప్రవేటు ఆసుపత్రికి, వెళ్ళేలోపు ఎన్నో ప్రాణాలు గాలిలో కలసిపోయాయి, ఇంకా వరుస లో ఉన్నాయి. ప్రతిపక్షాలును మా ప్రాంతంలో, భూతద్దంలో వెతకాలి. స్ధానిక జనం కు పనికి వచ్చే, ధర్నాలు ఉండవు.
మీ ప్రాంతంలో కూడా, ఇలాంటి మీ అభివృద్ధి పనులు ను , కనీసం ప్రచారం లోకి తీసుకుని రండి, పెద్దలు కు చేర్చండి.
1. చీరాల జిల్లా, 2. చీరాల పార్లమెంటు స్ధానం , 3. ఫిషింగ్ హార్బర్, 4. చేనేత పార్కు, 5. స్మార్ట్ సిటీ, 6. స్మార్ట్ బీచ్,7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, నేటి కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.
బాపట్ల ఎమ్మెల్యే, ఉప సభాపతి, శ్రీ కోన రఘుపతి గారు, బాపట్ల, జమ్ములపాలెం మరియు మూలపాలెం గ్రామాల పరిధిలోని, ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేటాయించిన భూమిని, ప్రభుత్వ వైద్యాధికారులకు అప్పగింత 23 న జరిగింది. ఇంకా ఇలాంటి మంచి పనులు జరగాలి, దేవుడు ఆయనకు తగినంత శక్తి ఇవ్వాలి.
బాపట్ల చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా, అభివ్రుద్ది అంటే ఏమిటో, కోన గారి నుంచి నేర్చుకోవాలి. మంచి ఎవరికి జరిగినా, మెచ్చుకోవాలి, పొగడాలి, అదృష్టవంతులు బాపట్ల ప్రజలు.
గుర్తు ఉందా, మనము చీరాలకు, జగనన్న తలచుకుంటే సాధ్యపడితే డిప్యుటేషన్ మీద, బాపట్ల ఎమ్మెల్యే గారిని, చీరాలకు కూడా, ఒకటి లేదా 2 సంవత్సరాలు తీసుకు వస్తే, ఎలా జనము లో కలసి తిరగాలి స్ధానికంగా ఉండి, ఎలా మాట్లాడాలి , ఎలా అభివ్రుద్ది పనులు తేవాలి అని, మన ప్రస్తుత మరియు మాజీ చీరాల నాయకులకు, చూపించి పని చేసి వెళతారు, అని గతంలో ఒక ఆర్టికల్ లో కోరాము.
విడిగా ఇలా ఒక్కొక్కటి తీసుకు రాలేనప్పుడు, కనీసము చీరాల జిల్లా కోసమైనా కష్టపడితే, అన్ని అవే వస్తాయి, జిల్లా పరిధిలో. ఏమిటో క్షీరపురి, చిన బొంబాయి, చీరాల మరియు చుట్టుపక్కల మండలాల దుస్థితి. ఆదుకునే మంచి నాయకులు ను, అలా కోరుకునే మంచి మనసులను ఇవ్వు రామా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,088; 104 తత్వాలు (Tatvaalu) and views 224,935 Dt : 24-Sep-2020, Upd Dt : 24-Sep-2020, Category : General
Views : 743
( + More Social Media views ), Id : 724 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
chirala ,
development works ,
bapatla ,
govt ,
medical college ,
kona ,
karanam ,
amanchi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments