మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1913 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1948 General Articles and views 1,571,995; 97 తత్వాలు (Tatvaalu) and views 198,431.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.2 min read time.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని - గాయం సినిమా పాట - ఒకసారి వింటూ, మనల్ని మనం ప్రశ్నించుకుందాం, తడారి బండబారి న హృదయాన్ని, ఓ సారి పలకరిద్దాం, తట్టిలేపే ప్రయత్నము చేద్దాం.
ఈ పాట వింటూ ఉంటే, శాస్త్రి గారు మనల్నే ప్రశ్నించినట్లు గా ఉంటుంది. ఎందుకురా బాబు, అన్ని కధనాలు రాస్తావు అని, ఎవరు మారతారు.
ఏదో తృప్తి, భాష మీద పట్టు అయినా వస్తుంది, మన ఊరుకోసం, అభివ్రుద్ది కోసం, రాసే శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు, సమాజ మంచి కోసమే వాడాలి. మనం కూడా నీతిగా ఉంటాము కదా?
సొంత కన్నబిడ్డలను నిర్దయగా దూరంగా ఉంచి అనాధలుగా పెంచుతూ, తమను కన్న ముదుసలి తల్లి దండ్రలను కూడా అనాధలుగా దూరంగా ఉంచుతూ, నిర్ధాక్షిణ్యంగా విడి చేసే స్వార్థ పరులు, తమ సొంత వారి కోసమే మారరు కదా, రామా? ఇక సమాజం మంచి, గురించి మారతారా?
మహమ్మారి కరోనా గురు జీవి నే లెక్క చేయకుండా షికార్లు, పెళ్ళిళ్ళు, సినిమాలు, మందు షాపు కు పోయే వారు, మెత్తటి కలం మాటకు కరుగుతారా? కరోనా కంటే పెద్ద వి వస్తే కూడా, మేం మారం అంటున్నారు, నిత్య స్వార్థ దీక్షలో.
** 2 ఏళ్ళు గా, మనము కూడా మన జనము ఆలోచన మారాలి అని, ఎంతో ప్రయత్నము చేస్తూ 1000 కధనాలు రాసినా, జనము లో మార్పు చలనము లేదు, బహుశా రాదు.
అయితే మనకు రచనా శక్తి పెరిగింది, మంచి అలవాట్లు పెంచుకుంటూ, ఆచరణలో పాటిస్తూ, రాయగలుగుతున్నాము. కనీసం మన లో మార్పు ఉంది, మనము తప్పు చేసినా, ఇవి చదివిన వారు అడుగుతారు అని భయము తో అయినా, ఇంకా ఎక్కువ నిబద్దతగా ఉంటాము.
పెంపకములో లేనిది, కొత్త గా రాదు, ఎదురు దెబ్బలు తగలినిదే అంటారు పెద్దలు. ఎదురు దెబ్బలు తగిలినా, కుక్క తోక మరలా వంకర, అంటారు జ్ఞానులు.
ఆ మాట వినండి, మనల్ని ప్రశ్నించినట్టే ఉంటుంది, మనకు మనసు ఎటూ బండ బారి పోయి ఉంటుంది కాబట్టి, పెద్ద నొప్పి తెలీదు.
రామ బాణం ఆర్పిందా రావణ కాష్టం, క్రిష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం, అంటూ సిరివెన్నెల గారు రాసిన ఈ మాటల తూటాలు, ఇంకో 100 ఏళ్ళు అయినా, నిత్య సమాజ కడుగుడికి ఉపయోగం, చూడండి అర్ధాన్ని పరమార్ధాన్ని.
** నిన్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణం రాజు గారు, ఈ పాట స్వయముగా పాడి వినిపించారు. గుంటూరు విజయవాడ ల లో, ప్రజల కు తగ్గిన చైతన్యము గురించి కావొచ్చు, బహుశా.
అన్న ఎంటీయార్ ని మోసము చేసి, పార్టీ ని లాగినప్పుడు కూడా, ఇలాంటి పాటే పాడి ఉంటారు అన్న అభిమానులు, జనములో చైతన్యం కోసం.
400 రోజుల పైగా అమరావతి ఉద్యమం సాగుతున్నా కూడా, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ గెలిచి, తెదేపా ఓడింది అన్న విషయములో కావొచ్చు, ఈ గీతము ఆలపించారు.
రేపు వైసీపీ వోడితే, ఇదే పాట పాడుతారు కదా మరలా?
ఇది 2 జిల్లాలకే అవసరము లేదు, తెలుగు వారు అందరూ ఆలోచించాలి, మారాలి. ప్రతి ఒకరూ కూడా, నేను తప్ప, మిగతా వారు మారాలి అనుకోవడము జరుగుతుంది, మనకున్న బద్దకము నిర్లక్ష్యముతో.
** మీరూ ప్రయత్నము చేస్తారు వినిపిస్తారు కదూ, ఈ గాయం పాట - నిగ్గదీసి అడుగు. మాధుర్యం అవసరము లేదు, సాత్వికత తో మనసు కదిలిందా లేదా అన్నదే ముఖ్యం.
ఇంట్లో మూసుకుపోయిన గొంతు, కనీసం మిత్రుల కోసమైనా, బయట లేవని గొంతు, కనీసం ఇంట్లో బాగు కోసమైనా తెరువు మిత్రమా. దేవుడు క్షమించడు, ఇచ్చిన గొంతును ఏదో ఒక మంచి కోసం వాడకపోతే.
అందరూ నాయకులు కూడా, ప్రయత్నము చేయాలి. నాయకులు గా మీరు పాడితే, మీ అనుచరులూ పాడతారు సోషల్ మీడియాలో నింపుతారు. వైసీపీ నాయకులు పాడితే, ప్రతిపక్షాలకు. అలాగే ప్రతిపక్షం పాడితే, వైసీపీ కి అర్ధం వస్తుంది కదా.
సమాజం కోసము కాకపోయినా, ఇంట్లో సొంత కుటుంబం పిల్లల మంచి కోసమైనా, మన గొంత లెగుస్తుందా అన్న దానికి కూడా, ఈ పాట పరీక్ష మిత్రమా.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ||నిగ్గదీసి||
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ ||నిగ్గదీసి||
** సమాజం అంటే కొన్ని కుటుంబాల కలయిక. మన కుటుంబము లో లేని నీతి నియమం నిబద్దత సంస్కారం, మన చుట్టూ ఉన్న సమాజములో ఎందుకు ఉంటుంది? చుట్టూ అడవి తగల బడుతుంటే, మన ఇల్లు మాత్రం కాలదా? సమాజం చెడిపోతే, మన పిల్లలు చెడిపోరా?
బయట సమాజాన్ని ప్రశ్నించే ప్రతి వ్యక్తి, ముందు తనకు తన కుటుంబానికి, మాట కట్టుబాటు నీతి నియమాలు ఉన్నాయా? తన కుటుంబాన్ని సంస్కార వంతముగా పెంచుతున్నారా? అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు బానిసలమా? అని ప్రశ్నించుకోవాలి.
సాక్ష్యం గా, సోషల్ మీడియాలో తన మరియు తన కుటుంబ మానవత్వం, దైవత్వం, త్యాగం, నిస్వార్ధ సేవ, సంస్కారం గురించి కనీసం గత 3 ఏళ్ళు గా పోస్టులు చూపగలరా? కనీసం మనకు ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవడం రాదు, ఇతరులను అడిగి కూడా పెట్టుకోలేము, రీడ్ రిసీప్ట్ తీసేసి చాటుగా దొంగలుగా ఇతరులవి చూస్తాము, దాక్కుంటాము.
మన స్నేహితులకు బంధువులకు చెపడానికి, సొంత మాటలు పనులు బొమ్మలు స్టేటస్ లో ఉండవు. సంస్కారం లేని, కన్న తల్లి తండ్రి పెంపకం గురించి, గొప్పలు చెప్పుకోలేని, మన పిల్లలు, సినిమా రాజకీయ హీరోలు హీరోయిన్ల నాయకుల ఆటగాళ్ళ పాటగాళ్ళ డాన్సుల వారి ఫోటోలు పెట్టుకుని ఆనందపడుతున్నారు, అది మన పెంపకం. సోషల్ మీడియాలో తెలుగు రాయడమే రాదు మనకి. దీనికి ధనం హోదా పదవి తో సంబంధము లేదు, మధ్యతరగతి బీదవారైనా, నెట్ ఫోన్ ఉంటే చాలు కదా.
తను, ముందుగా తన ముదుసలి తల్లి దండ్రులను, ఇంట్లో పెట్టుకుని, ఇతర సోదర సోదరీ మణులకన్నా, మెరుగైన సదుపాయాలు ఇస్తున్నారా, ప్రేమగా చూస్తున్నారా, చేయిపట్టి నడిపిస్తున్నారా? పిల్లలకు సంస్కారం నేర్పిస్తుంటే, మా పిల్లల దగ్గర మాత్రమే, మా శేష జీవితము అంటే ముదుసలి తనము గడుపుతాము, లేకపోతే ఈ జన్మ జీవితం కూడా వ్రుధా అయ్యింది, దేవుడు వచ్చే జన్మలో ఈ సౌకర్యాలు ఆస్తులు కూడా ఇవ్వరు, అని పశ్చాత్తాపం తో చెప్పే ధైర్యం ఎంత మందికి ఉంది? అది లేని వారి కోసం ఈ పేరడీ మాటల పాట.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జన్మని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు బుద్ది, నేర్వదు శుద్ది
దేవుడు దిగిరానీ, ఎవ్వరు ఏమైపోనీ
మారదు స్వార్ధం నేర్వదు శాంతం
గాలివాటు గమనానికి, నీతిబాట ఎక్కదు
గొర్రెదాటు మనసుకి, జ్ఞానబోధ పట్టదు
ఏ కుటుంబం నేర్చుకుంది, పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది, చిచ్చుల మార్గం
నీతి బాణ మార్పిందా, కుటుంబ కాష్టం
కృష్ణ గీత ఆపిందా, మానసిక కురుక్షేత్రం ||నిగ్గదీసి||
పాత మిద్దె ఇళ్ళు, పాల రాతి పాలస్లైనా
ఆటవిక నీతి మారిందా, ఎన్ని వంశ తరాలైనా
వేట అదే, వేటు అదే, నాటి కథే, అంతా
తన సంతానం, ముదుసలి కి అండొస్తే, వింతా
బలవంతులె బ్రతకాలనే, సూక్తి మరవకుండ
శతాబ్దాలు జరగలేద, ఈ మానవ పతన కాండ ||నిగ్గదీసి||
Gaayam, 1993 Telugu language political thriller film, based on the 1980s Vijayawada Gang Warfare. Directed by Ram Gopal Varma, and story co-written by himself and Mani Ratnam, it stars Jagapathi Babu, Revathi, Urmila Matondkar.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,571,995; 97 తత్వాలు (Tatvaalu) and views 198,431
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad. ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం. మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు. మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు