Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. * ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులు, వివిధ పట్టణాలు/ గ్రామాల లోని , వారి స్టేషన్ పరిధిలోని ఇతర శాఖల (రెవిన్యూ,ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ) ప్రాంతీయ అధికారులతో కరోనావైరస్ నివారణ చర్యలపై సమన్వయ మై పూర్తిస్థాయిలో ప్రజా ఆరోగ్య భద్రతకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. (Pic 1)
* కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, లాక్ డౌన్ నిబంధనలు జిల్లా వ్యాప్తంగా ప్రకాశం పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు.
* కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సామాజిక దూరం పాటించాలని ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న ప్రకాశం పోలీసులు
* లాక్‌డౌన్ ఎదుర్కొంటున్న వలస కార్మికుల శ్రేయస్సుకు ప్రాధాన్యత - కార్మికుల వారి స్వగ్రామాలకు పంపేందుకు పోలీసు అధికారులు చర్యలు (Pic 3)
* ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల, అత్యవసర వాహనాలకు మినహా ఏ ఇతర వాహనాలు జిల్లాలోకి రాకుండా చెక్‌పోస్టు వద్ద నిరంతరం వాహన తనిఖీలు (Pic 2)
* చీరాల రెడ్ జోన్ లో రూఫ్ శానిటేషన్ కోసం డ్రోన్ వినియోగం (Pic 4)
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం లోని, రెడ్ జోన్ కంటోన్మెంట్ ఏరియా లో, డ్రోన్ వినియోగం ద్వారా, సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే కార్యక్రమాన్ని, శనివారం ఉదయం చీరాల మండలం, రామకృష్ణాపురం పంచాయతీ కార్యాలయం వద్ద, ప్రభుత్వ అధికారులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చీరాల డిఎస్పి వై. జయ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో వీధుల తో పాటు, హౌస్ రూఫ్ శానిటేషన్ కార్యక్రమాన్ని డ్రోన్ వినియో గించడం ద్వారా, పూర్తిస్థాయిలో వైరస్ నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఎంపీడీవో సాంబశివరావు మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు, రెడ్ జోన్ ఏరియాలో పూర్తిస్థాయిలో, వైరస్ నిర్మూలనకు, అన్ని విధాల చర్యలు, చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీరాల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బేబీ రాణీ, చీరాల ఒకటో పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు, ఈవో ఆర్ డి రమేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Photo/ Video/ Text Credit : Prakasam Police, Chirala Journalist
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,056; 94 తత్వాలు (Tatvaalu) and views 184,764 అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments