ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి - అధికారక వెబ్సైట్ వార్తలు లో మార్పులు రావాలి సమగ్ర సమాచారముతో - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,596; 104 తత్వాలు (Tatvaalu) and views 225,923.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గౌరవనీయులు ప్రకాశం కలెక్టర్ Sri Pola Bhaskar.,I.A.S. గారికి నమస్కారములు,

మన ప్రకాశం జిల్లా అధికారక వెబ్సైట్ లో, కొన్ని వార్తలు పెట్టడం చూసాము, ధన్యవాదాలు. ఇది మీడియా మిత్రులు కు చాలా ఉపయోగము. ఈ లింక్ లో చూడవచ్చును.

కానీ వాటిలో ఇంకా మంచి మార్పులు రావాలి సమగ్ర సమాచారముతో, ప్రజలు మరియు ఇతర జిల్లా అధికారులు అపార్ధం చేసుకోకుండా ఉండటానికి. జిల్లా ఐ & పీఆర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పాయింట్లు ఇంకా బాగా చేయడానికి, ఉదాహరణకు ఇస్తున్నాము.

1. ఈ వార్తా సమాచారం, వారానికి షుమారు గా ఒకటి (చిత్రము 2) పెడుతున్నారు. ప్రజలకు, మీరు రోజూ ఎన్నో కార్యక్రమాలలో, ఎందరో అధికారులతో పాల్గొంటారు, అని తెలుసు. అన్ని రోజూ వివరాలు పెట్టలేక పోయినా, కనీసం రోజు కు మూడు నాలుగు వేరు వేరు కార్యక్రమాల, వివరాలు ఫోటోలు వీడియో లు పెడుతున్న బాగుంటుంది.

2. కేవలం హెడ్డింగ్ లైన్ పెట్టి, నాలుగు ఫోటోలు పెట్టేస్తున్నారు తేలికగా, ఇతర వివరాలు ఏమీ లేకుండా. మిగతా జిల్లా స్ధాయి అధికారులు కూడా గౌరవం ఇచ్చి, ఆ కార్యక్రమం గురించి నాలుగు మాటలు మరియు పాల్గొన్న అధికారులు పేర్లు ( చిత్రము 3 ) కూడా పేర్కొంటే, అందరికీ బాగుంటుంది. విలేఖరుల కు కూడా చాలా ఉపయోగం.

3. ఈ వార్తలు పెట్టిన అధికారులే, వెంటనే జిల్లా ప్రభుత్వ సోషల్ మీడియాలలో కూడా, అదే సమాచారం పెడుతున్న బాగుంటుంది. ఎందుకంటే, ప్రజలు అన్ని వార్తలు ను ఒకే చోట ఫేస్బుక్ ట్విట్టర్ లో చూస్తారు ఈ కాలములో, మన జిల్లా ప్రభుత్వ సోషల్ మీడియా ను ఫాలో అయి/ లైక్ చేసి.

మన విలేఖరులు లాగా, అన్ని ప్రభుత్వ వెబ్సైట్ ల కు, ఒక్కొక్క దానికి వెళ్లి చూడటానికి ఇష్టపడరు. అందుకే ముఖ్యమంత్రి జగన్ గారు, జిల్లా ఎస్పీ కౌశల్ గారు, ఇతర కలెక్టర్ గారు లు కూడా, తప్పనిసరిగా సోషల్ మీడియా ను వాడి, ప్రజలకు తేలిక గా ఒకేచోట సమాచారం అంతా, సవినయంగా సగౌరవంగా సమర్పిస్తున్నారు.

త్వరలోనే, మీరు మా కలెక్టర్ గా ఉన్న ఈ ఆనంద సమయంలో నే, మీ అసాధారణ అచంచల కృషి సమిష్టి నాయకత్వం లోనే, మన జిల్లా సమగ్ర సమాచారం కూడా, ప్రకాశం వెబ్సైట్ లో మరియు అలాగే సోషల్ మీడియాలో కూడా ఉంటుంది అని, ఇతర జిల్లా సమాచార వ్యవస్థ ల తో పోటీ పడగలమని నిరూపిస్తాము అని, మన జిల్లా ప్రజలు మరియు విలేఖరులు ఆశగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అలాగే మన జిల్లా ఏడీ ఐ & పీఆర్, కె నారాయణ రెడ్డి గారు కూడా, ఈ విషయములో సహాయ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ప్రెస్ రిలీజ్ లు కూడా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాము.

మన జిల్లా ను ముందుకు నడిపించడంలో, ముందు ఉన్న మీకు మరియు ఇతర జిల్లా అధికారులు కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ

మన జిల్లా ప్రజలు మరియు విలేఖరుల తరుపున విన్నపము  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.


Photo/ Video/ Text Credit : Prakasam Collector website
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,596; 104 తత్వాలు (Tatvaalu) and views 225,923
Dt : 18-May-2020, Upd Dt : 18-May-2020, Category : Request
Views : 2989 ( + More Social Media views ), Id : 550 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : prakasam district collector , official website , social media , update with info , Pola Bhaskar , K Narayana Reddy , Assistant Director I PR
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content