APLatestNews.com top Banner

Social Media links
ప్రకాశం జిల్లా రాజధాని ఒంగోలు అభివృద్ధి, కాంగ్రెసు తెదేపా నుంచి నేటి వరకు ఉందా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

వెనుక బడిన జిల్లా కు, రామాయపట్నం పోర్టు వస్తుంది అని ఆనంద పడాలో లేదా ఇంతవరకు కూడా, నిండైన బిందె నీళ్ళు, మెరుగైన వైద్యం లేదని, బాధ పడాలో తెలీదు. జిల్లా కే కాదు, సమస్యలు కు రాజధానే. అభివృద్ధి అంటే, నీళ్ళు, మంచి గాలి, వైద్యం, చదువు, అన్ని ఉండాలి అందరికీ అందాలి, ప్రజలు ఇతర ప్రాంతాలకు పోకుండా.

మరి ఇప్పుడు ఇద్దరు మంత్రులు, నాయకుని బంధువులు, ప్రకాశం మరియు రాజధాని ఒంగోలు సమస్యలు ను, తీరుస్తారని తొలగిస్తారు ఆశిద్దాం. ఇందులో ఇప్పుడు మార్పులు వచ్చి ఉంటే, దయచేసి చెప్పగలరు, వెబ్సైట్ లో సరిచేద్దాం.

1. ఎండాకాలం (మిగతా రోజుల లో 24 గంటలు నీళ్లు ఉన్నాయా?) వచ్చింది అంటే నీటికి కటకట. ఆనాడు 20 ఏళ్ల పై నాడు, ఆనాటి ఎంపీ సీనియర్ మాగుంట గారు, టాంక్ ల తో నీళ్ళు అందించారు, కొన్ని ప్రాంతాలకు అని విన్నాం. మరి నేటికీ టాంకులు అందిస్తూ ఉంటే లేదా రోజూ నీటి లభ్యత లేకపోతే, దానిని అభివృద్ధి అందామా?

ఓ 5 ఏళ్ళు లోపు, ఒకరి తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే, నీళ్ళు ఈ కాసేపు మాత్రమే వస్తాయి, రంబు నిండా నీళ్లు పట్టాలి, కాసేపు ఆగు అన్నారు. మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వం లో 24 గంటల నీటి సరఫరా ఉందేమో తెలీదు, సంవత్సరం గా, ఉంటే చెప్పగలరు.

భూగర్భజలాలు లేకపోయినా, ఇతర సాంప్రదాయ పద్ధతి లో, నిరంతరం సంఖ్యాపరంగా పెరుగుతున్న ప్రజలకు, నీటి కష్టాలు లేకుండా, నాయకులు అధికారులు చేయాలి. అది నిజమైన అభివృద్ధి.

2. ప్రభుత్వ వైద్యం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నమ్మకం అయిన ప్రవేటు వైద్యం కూడా లేదు ఇప్పటికీ, అంటే నమ్ముతారా? ఇప్పటికీ, కాస్త ధనం ఉన్న ప్రజలు, గుంటూరు హైదరాబాద్ కే మెరుగైన నమ్మకం అయిన వైద్యం కు వెళతారు, కదూ?

మొన్న కరోనా గురువు వస్తే, జిల్లా ఎమ్మెల్యేలు దగ్గర నుంచి మంత్రులు దాకా, ఒంగోలు ప్రవేటు వైద్యం పై కూడా నమ్మకం గురి లేక, మరలా ప్రారంభాలు చేసింది వారే, ఛలో హైదరాబాదు అన్న సంగతి గుర్తు ఉందా? ఇదేనా అభివృద్ధి అంటే? మధ్య తరగతి ప్రజలు, అలా దూరం వెళ్లి అంత ఖర్చు తో, వైద్యం పొందగలరా?

ఆఖరికి, రెండో పెద్ద పట్టణం అయిన చీరాల డాక్టర్లు, గత 30 ఏళ్ళు పైగా మరియు నేటికీ కూడా, ఎమర్జెన్సీ కేసులలో గంట దూరంలోపు ఉన్న ఒంగోలు కు వెళ్ళమని చెప్పరు గాక చెప్పరు, 2 గంటల దూరంలో ఉన్న గుంటూరు కు వెళ్ళమని మాత్రమే చెపుతారు. అంటే ఒంగోలు ప్రవేటు వైద్యం పై కూడా, చీరాలలో నమ్మకం ఎవరికీ లేదు.

3. చదువు విషయంలో కూడా ఓపిక ఉన్న వారు నెల్లూర్, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళతారు.

మరి దీనిని బట్టి, ప్రకాశం జిల్లా రాజధాని, అభివృద్ధి చెందినదా? ఇప్పుడు, జగనన్న పాలనలో అయినా, నిజమైన అభివృద్ధిని చూస్తుంది, అని ఆశగా ఎదురు చూస్తున్న ఒంగోలు మరియు ప్రకాశం ప్రజలు.

ఇంకా మీకు తెలిసిన సమస్యలు ఉంటే, తెలియజేయగలరు. మంత్రుల కు, అధికారులు కు, ఎమ్మెల్యేలు కు, ఎంపీలు కు అప్పుడప్పుడూ గుర్తు చేస్తూ ఉంటే, కొంత అయినా మార్పులు అభివ్రుద్ది ఉండవచ్చు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 800 General Articles, 46 Tatvaalu
Dt : 27-Sep-2020, Upd Dt : 27-Sep-2020, Category : General
Views : 83 ( + More Social Media views ), Id : 727 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : prakasam , district , capital , ongole , development , congress , tdp , chirala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content