మనిషి ప్రయాణం బయట కాదు, లోపలకి. యాత్ర బయట కాదు వ్రుధా ఖర్చు సమయం, అంతరంగిక యాత్ర - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,854,786; 104 తత్వాలు (Tatvaalu) and views 441,148.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Person journey is not outward, but inward. Yatra is not external time money waste, internal yatra - Brother Bhramalacharya, Vadina (Brother Wife) Bhramalacharini*

*మనిషి ప్రయాణం బయట కాదు, లోపలకి. యాత్ర బయట కాదు వ్రుధా ఖర్చు సమయం, అంతరంగిక యాత్ర - అన్న భ్రమలాచార్య, వదిన బ్రమలాచారిణి*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarg Ashtavyasan, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

[If you are educated, please read inside the link. For those who are less educated, these words are sent here in full. We say that, from the rickshaw puller to the millionaire, they are getting these messages from years.

మీరు చదువుకున్న వారైతే, దయచేసి లింక్ లోపల చదువుతారు. చదువు తక్కువ వారి కోసం, ఈ మాటలు పూర్తిగా ఇక్కడ పంపడం. చెప్పాము కదా, రిక్షా వాలా నుంచి కోటీశ్వరుడు దాకా ఈ సందేశాలు అందుకుంటున్నారు ఏళ్ళుగా అని.]

Everyone who wants to know themselves, every devotee, every disciple, should write about their strength of mental control, doing sadhanas like this. For money job, we are posting certifications on Linkedin or social media with joy. Why can't we have a list of motivations/ sadhana for mental practice health and peace of mind?

అసలు తమను తాము తెలుసుకోవాలి అనుకునే, ప్రతి ఒక్కరు ప్రతి భక్తుడు ప్రతి శిష్యుడు, తమ మానసిక నియంత్రణ బలం గురించి రాయాలి, ఇలాగే సాధనలు చేస్తూ. ధనం ఉద్యోగం కోసం, సర్టిఫికేట్లు లింక్డిన్ లేదా సోషల్ మీడియా లో పెట్టేందుకు ఉన్న ఉత్సాహం, మానసిక సాధన ఆరోగ్యం మనశ్శాంతి కోసం, సాధనల లిస్ట్ ఎందుకు పెట్టలేము?

Person journey is not out in the world, but inward into the depths of the mind, knowing himself and correcting his weaknesses. Yatra is not outside, but with time money waste, leaving partner/ children or accompanied. Yatra should be done alone into the inner layers.

మనిషి ప్రయాణం ప్రపంచములో బయటకు కాదు, మనసు లోతుల్లోకి లోపలకి జరగాలి, తనను తాను తెలుసుకుంటూ, తన బలహీనతలు సరిచేసుకుంటూ. యాత్ర అనేది బయట కాదు, వ్రుధా ఖర్చుతో సమయం తో, భాగస్వామి/ పిల్లలను వదలి లేదా తోడుతో. అంతరంగిక పొరల్లోకి యాత్ర ఒంటరిగా చేయాలి.

A man cannot achieve anything spiritually even if he moves around the world. First one must conquer himself, leave Arishadvarga Ashtavyasana. That is, if one travels within oneself, without moving from one's home/ village, one can gain knowledge.. Aham Brahmasmi..

ప్రపంచమంతా తిరిగినా మనిషి, ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. ముందు తనను తాను జయించాలి, అరిషడ్వర్గ అష్టవ్యసనం ను వీడి. అంటే, తన లోనికి తాను ప్రయాణం చేస్తే, ఉన్న ఇంట్లో/ ఊళ్ళో నుంచి కదలకుండా, జ్ఞానాన్ని పొందవచ్చు.. అహం బ్రహ్మాస్మి..

మోహ వ్యామోహాల చుట్టూ పరుగులు తీసే 75 శాతం మంది లాగే, ఇన్ని రోజుల మా జీవితం పై నిర్లక్ష్యము బద్దకము బ్రమలు వీడి, చదివాను తమ్ముడు. శనివారం సాధనలు లిస్ట్ అంకెలతో సహా చదివాను. మరలా నా ఆలోచనా అర్ధం లో లోపం ఉందేమో అని, వదిన కు కూడా అర్థం చెప్పాను. సరిగ్గా ఇద్దరు కూ అర్థం అయిందీ లేనిది తెలిసింది, ప్రతి పదం. పిల్లలకు చెప్పాము. అన్ని కుటుంబాలు ఇలాగే చెయ్యాలి, రేపు కష్టాలు కన్నీరు ఆసుపత్రులు తగ్గించుకోవాలి అంటే.

వామ్మో సంక్షిప్తముగా ఎంత సాధన, ఎంత నియమాలు, అందరూ చేయగలిగినవి ఉన్నాయి అందులో. ఇవి పిల్లలు నేర్చుకుంటే, పెద్దలకు బుద్ది ఉండి నేర్చుకుని నేర్పితే, ఇంక బడిలో కాలేజీలో జీవితములో, వారిని చెడువైపు నడిపించగలమా? గుణం లేని, తెలియని కార్యాలకు పనులకు ఇంక వెళ్ళగలమా?

మానసిక బలహీనత, ఎలా ఉచితముగా పోగొట్టుకోవచ్చో, ఎవరికి వారు, చాలా తేలికగా చూపించావు. అందరమూ ఇవి చేయవచ్చు, కానీ చేయము అహంకారము నిర్లక్ష్యము బద్దకము లెక్కలేని తనముతో.

ఎందుకంటే, మాలో చాలా మంది సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామలకు ఇంట్లో ఉంచుకుని సేవ చేయని, దరిద్రులమే. ఇంక మా నటన పూజల సంగతి చెప్పు. దేవుని గుణాలు మా రోజూ ఆచరణలో ఒకటీ ఉండదు. రేపు రోగం వచ్చి మంచం ఎక్కితే, భాగస్వామి పిల్లలు గౌరవముగా చూస్తారని, వీపు మీద కూడా చెయ్యి వేసి చెప్పలేని సన్నాసులు ఎందరో మనలో. సిగ్గు తెచ్చుకుని, తమ తప్పు ఒప్పుకోరు, సరి చేసుకోరు.

దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉదాహరణ ఇచ్చావు. ఎవరికీ రాని ఆలోచన, ఎవరూ కాదనలేని సాక్ష్యం, నీకే వచ్చింది ఈ పేర్ల దండతో - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి అంటావు అదేమంటే. ఇంతకన్నా ఏమి కావాలి మాకు బుద్ది రావడానికి, ప్రతి ఇంట్లో ఉన్న సొంత మనుషుల ద్రోహమే కదా.

7 రోజుల/ వారాల/ నెలల వ్రతాలు విన్నాము, ఎంతో మంది మొక్కుబడిగా, నోటికి మంత్రాలు రాకపోయినా, ఎంపీత్రీ తో లేదా ధనము తీసుకుని చదివే పూజారితో మమ అనిపించారు. అదేమంటే, గుణ కర్మల గురించి అడగని చెప్పని, గురువుల చుట్టూ, గుడుల చుట్టూ, మూర్ఖముగా తిరుగుతాము.

అసలు ఇదేమిటి వరుసగా, 79+ ఏళ్ళ అమ్మతో కలిపి చేయిపట్టుకుని, 10 ఏళ్ళు * 12 నెలలు * 4 వారాల వ్రతం = 480 వారాలు వ్రతం * 9 ప్రదక్షిణలు = 4320 ప్రదక్షిణలు, ప్రతి శనివారం శివయ్య శనయ్యకు నేతి దీపం వ్రతం. పోనీ ఊరక వెళ్ళి రావడం అయినా, ఒకరైనా ఉన్నారా మాలో? అదే సినిమాకు, హోటల్ కు, బారుకు, చిన్న ఇంటికి, షాపింగ్ కు మాత్రం ఎన్నో సార్లు.

ఇంక 10 ఏళ్ళ సజీవ గురువు సేవ మా వలన కాదు, రోజు 1 మైలు నడక చేతపట్టుకుని నడపటం 10 ఏళ్ళు అంటే, అంత సంస్కారం మా పెద్దలు నేర్పలేదు, వారికీ తెలీదు. పెద్దలు అంటే, భస్మాసురులకు ఆస్తులు ఇచ్చే తమను నాశనం చేసుకునే మూర్కులే గాని, గుణాలు ఇచ్చే దేవతలు కూడా అని, ఇప్పుడే తెలిసింది.

ఇక శాఖాహారం, చాప నిద్ర, అబ్బో చాలా పెద్ద లిస్ట్ ఉంది. మేకప్ అలంకారాలు ఆభరణాలు లేకుండా, ఇంట్లో ఒకరి నొకరు అసలు చూసుకోలేము, దడుచుకుంటాము. ఆయుర్వేదం మా వలన కాదు, మానసిక బలహీనులము అని అర్ధం అయ్యింది ఈ లిస్ట్ మొత్తం చూసి. గుండు చేసుకుందాము అంటే, పనికి మాలిన ఆలోచనలతో, ఎప్పుడో బట్టనెత్తి అయిపోయింది పూర్తిగా.

పోనీ ప్రదక్షిణలు తేలిక కదా అని, మంచం చుట్టూ ఓ 50 ప్రదక్షిణలు తిరిగాను, కరమాల చేతి వేళ్ళ తో లెక్క గడుతూ, మన వలన కాదు అని అర్థం అయింది. 2 సార్లు కాలు తట్టుకుని పడబోయాను. అంకె లెక్క తప్పింది. నోటితో నారాయణ స్మరణ చేస్తూ, చేతి వేళ్లు ఎలా లెక్క వేస్తున్నావు? అసలు అంత చలిలో, పాదాలు వంకరలు పోతూ ఉంటే, ఎలా నడిచావు ఇవి లెక్కపెడుతూ, 240+ వారాలు 108 ప్రదక్షిణలు? వామ్మో, సినిమాలో తపస్సు చేస్తుంటే, గడ్డాలు మీసాలుతో చెదలు పట్టిన పుట్టలు ఆనాడు చూసాము. ఇప్పుడు ఇంత కఠిన సాధన, ఇన్ని వారాలు, బొబ్బలు కాసిన పాదాలతో.

సేమ్ నీ లాగనే, మా అబ్బాయి అమ్మయి ని, తమ గుణాలు, త్యాగాలు, కఠిన సాధన, మానసిక నియంత్రణ బలం గురించి వరుసగా రాయమన్నాను. మానవత్వం ఉన్న మనుషులుగా, దేవుని పూజ చేసే భక్తులుగా, నేను వదిన కూడా అలాగే రాసి నీకు త్వరలో చూపుతాం.

అసలు తమను తాము తెలుసుకోవాలి అనుకునే, ప్రతి ఒక్కరు ప్రతి భక్తుడు ప్రతి శిష్యుడు, తమ మానసిక నియంత్రణ బలం గురించి రాయాలి, ఇలాగే సాధనలు చేస్తూ. ధనం ఉద్యోగం కోసం, సర్టిఫికేట్లు లింక్డిన్ లేదా సోషల్ మీడియా లో పెట్టేందుకు ఉన్న ఉత్సాహం, మానసిక సాధన ఆరోగ్యం మనశ్శాంతి కోసం, సాధనల లిస్ట్ ఎందుకు పెట్టలేము?

వదినను అడిగాను, మీ అమ్మ ను మీ అమ్మ డబ్బులు తో బాగా చూస్తున్నావు ఇంట్లో బెట్టి, ఇలా ఎప్పుడైనా చేయి పట్టుకుని నడిపించావా? రేపు నాకు రోగం వచ్చినాక సేవ చేస్తావు కానీ, రాకముందే జాగ్రత్తలు తీసుకోవు, అంతేనా? మన ఇంట్లో కూడా, కోడెలయ్య లాగా రోగం వచ్చిన తర్వాత మందా అని అడిగాను. అంటే, ఏటీయెం మిషన్ బతుకు నాది. మిషన్ పని చేస్తే డబ్బులు, చెడిపోతే పాత సామాను కొట్టు కు.

మీరు చేస్తున్నవి మంచి అనుకున్నప్పుడు, మల్లెపూలు వాసన సమానం లాగా, అందరి అమ్మల తో అలాగే ఉండాలి కదా? మా తమ్ముడు వాళ్ళ, ముదుసలి అమ్మ ను బాగున్నావా అని, 5 ఏళ్లుగా ఎన్నిసార్లు అడిగావు, అని అడిగాను. మా తమ్ముడు, పలకరించే అందరి క్షేమాలు అడుగుతాడు, చిన్న పెద్ద ముదుసలి తేడా లేకుండా. అది భగవద్గీత లో చెప్పిన, స్తిరత్వం సమానత్వం.

ఎంత మందికి 8 గంటలు కష్టపడి వీడియో, ఫోటోలు తీసి ఇచ్చాడు - 850 దాకా ఉన్నాయి. అసలు ఏ పనిలో మనము పోటీ పెట్టుకోగలము? మనము 2000 కధనాలు తెలుగు బాషలో రాయగలమా, ఇంత మందికి రోజూ పంపగలమా, కష్టాలులో పడవద్దని? 500 పాటలు పాడగలమా? ఇది కదా జగమంత కుటుంబం, ఇది కదా మానసిక బలం, ఇది కదా నిత్య దైవ సాంగత్య ఫలం, ఇది కాదా మాయా ప్రపంచానికి సాక్షిగా ఉండటం మాయలో తాను మునగకుండా?

అసలు ఉద్యోగం లేక, జనం ఏడుస్తుంటే, ప్రభుత్వ ఉద్యోగం వదలడం ఏమిటి, రేపు తెలియని అమ్మకోసం? 20 ఏళ్ళ సంపాదన కరిగించడమేమిటి అమ్మకోసం? పెళ్ళి అయిన వాడు కూడా, ఇంకో ఇల్లు పెడుతుంటే, అన్ని అందుబాటులో ఉండి, ఈ పంచేంద్రియాల నియంత్రణ ఏమిటి? విందు లేదు, చిందు లేదు, పొందు లేదు, నా బొంద లేదు, ఒక్కడిని చూపించు ఇలా? పురుషులతో సమానం అని అరిచే, ఒక మహిళను ఈ సాధనలతో సేవలతో చూపించు? అసలు ఇంకో మతములో ఇవన్నీ సాధ్యమా, చూపించు?

మనం మారకుండా, గుణ కర్మలు అందరికీ చెప్పకుండా, దేవుళ్ళ గురువు ల పూజలు అనవసరం. చిత్తశుద్ధి లేని పూజ/ యాత్ర/ సేవ/ వ్యర్థం. ధర్మ అర్ధ కామ మోక్ష చింతన లేని పాపిష్టి ధన సేవలు బూడిదలో పోసిన పన్నీరే. మనలో దేవుని మేల్కొలపాలి కఠిన సాధనతో. ఇట్లు సత్వ గుణం వైపు మనస్పూర్తిగా ప్రయాణం చేసే, మీ అన్న/ తమ్ముడు/ మామ/ బాబాయి/ బావ, భ్రమలాచార్య, మీ వదిన/ మరదలు/ అత్త/ పిన్ని/ అక్క బ్రమలాచారిణి.

బంధాలు ఏవైనా, బ్రమలు మోహాలు బలహీనత భావాలు పతనాలు కష్టాలు కన్నీరు శిక్షణ ద్రోహం మోసం వదిలివేయడం నిర్దయ నిర్లక్ష్యం అహంకారం ఒకటే. మాలాంటి మోహ వ్యామోహ బ్రమలాచార్యులు బ్రమలాచారిణులు ఎందరో. అందరికీ పంపు, మేలుకొలుపుగా, ఆ తర్వాత వారి మానసిక బలహీనత ను బట్టి మన ఊరి రామ్మన్న, రాజన్న లిస్ట్ లో చేరతారు లేదా పిల్లల/ శిష్యుల దగ్గర దేవతలు గా సేవించబడతారు. అందరికీ కనువిప్పు కావాలి, పిల్లలకు మానసిక బలం నియంత్రణ నేర్పాలి. అందరూ ఉండి, ఒంటరి ముదుసలి తనం, అనారోగ్యం, పంచభూతాల శిక్షణ తప్పించుకోవాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,854,786; 104 తత్వాలు (Tatvaalu) and views 441,148
Dt : 09-Jul-2024, Upd Dt : 09-Jul-2024, Category : General
Views : 566 ( + More Social Media views ), Id : 2135 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Person , journey , outward , inward , Yatra , external , time , money , waste , internal , Brother , Bhramalacharya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content