Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఏదండీ వీళ్లు మటన్ తింటే మటాష్ అంటారు. మన కుటుంబం కోసం, మనం తినే మాంసం మానుకోవాలా? మందు , పొగ, మత్తు కు కూడా ఇదే వ్యాసం వర్తిస్తుంది. మన నాలుక రుచి, చంపుకోవాలా? హస్పటల్ చుట్టూ తిరిగి, డబ్బు వెదజల్లవద్దా?
అసలుదైనా, నకిలీదైనా మేము తగ్గం. కోయనిదైనా, కోసిందైనా వదలం. మా రాక్షస జాతి , ఆయువు పట్టు అది. మేము ఉన్నదే, వారానికి 3 సార్లు, అది తినడానికే.
ఒక్క లివర్ ఆపరేషన్ లేదా ఒక్క పొట్ట జీర్ణ కోశం ఆపరేషన్, కనీసం ఓ లక్ష ఖర్చు లేనిదే, మా స్టేటస్ కు బాగుంటుందా. జనం లో పరువు తగ్గదా?
మా కుటుంబం, మా చుట్టాలు, మన ఊరూ లేదా రాజధాని హాస్పిటల్ చుట్టూ తిరగద్దా పడిగాపులు కాయొద్దా? బతికి ఉన్నప్పుడే చూడొద్దా ఇవి అన్ని మరియు చుట్టాల రాక? ఆరోగ్య శ్రీ వాడొద్దా? 108 వాడుకోవద్దా? ఇంక ఆ పధకాలు నడుస్తున్నయో లేదో చూసేదెవరు? అవి నేను వాడకపోతే, గతం లో బాబు, ఇప్పుడు జగన్ బాధపడరా? స్కాన్ లు, మందులు, సూదులు , ఇంజక్షన్ లు . . . ఎవరికోసం ఇవన్ని? మన కోసం కాదా?
నేను లేకపోతెనేమి, కల్యాణశ్రీ ఉంది కూతురికి, ఫీజ్ తిప్పి ఇవ్వు ఉంది కొడుక్కి, వితంతు పించను ఉంది భార్యకు, అమ్మకు. ఏ కష్టమొచ్చినా, మన జగనన్న చంద్రన్న ఉన్నారు.
రేయ్ చిన్నా, బజారు వెళ్లి, బతికి ఉన్న మేక గొర్రె కోడి చేప కానీ, కోసిన ముక్కలు కానీ, ఏసీ లో పెట్టినది గానీ, కెలాల్ చేసినది కానీ, కల్తీ అయినా వారం ముందు ది అయినా, పర్లేదు. వాసనొస్తే మసాలా కలుపు హోటల్ లా. పిన్ని వండే సరికి లేటు అవుతుందేమో, చికెన్ బిర్యాని, మటను పులుసు బజారు షాప్ లో తీసుకొని రా.
అమెరికాలో కూడా మన వాళ్ళు తగ్గడం లేదు అంటా, ఎన్ని రోజులు ఫ్రిజ్ లో ఉన్నదైనా, మసాలా కలిపి లాగిస్తారు అంటా. రోగమొస్తే, ఇన్సూరెన్స్ ఉంటుందంటా. ఇక్కడ వారే గదా, ఎలా మరుస్తారు ఎంత చదివినా.
మనల్ని నమ్ముకున్న, మాంసం చేప కొట్టు సిబ్బంది ఓనర్, హస్పిటల్ సిబ్బంది డాక్టర్ ఓనర్, మందుల షాప్ సిబ్బంది ఓనర్ కి, అన్యాయం చేస్తానా? నే ఒక్కడు పోయినా లేక నా ఒక్క కుటుంబం రోడ్డున పడ్డా పర్లేదు, కానీ మిగతా అన్ని కుటుంబాలను నేను కాపాడాలి. అది నా కర్తవ్యం.
మా నాన్న చూసాడు ఇలాంటి వార్తలు, నేను, నా మనవడు కూడా చూస్తాము. వీడియోలో మీరూ చూడండి, ఎప్పుడూ వినేవేగదా.
అబ్బా , ఆశ , దోశ, వడ, మేం మానము గాక మానము, అన్నాడు గోపి రఘు తో.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,832; 104 తత్వాలు (Tatvaalu) and views 221,630 Dt : 25-Sep-2019, Upd Dt : 25-Sep-2019, Category : General
Views : 1372
( + More Social Media views ), Id : 172 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
food adulteration ,
meat ,
fish Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments