రోడ్ల దుస్థితి, కౌలు రైతు భరోసా పై జగనన్న కు తలనొప్పి తెస్తున్న పవనన్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1629 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1664 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రం నెత్తిన గుదిబండ పెట్టి, ఆస్తులు బాండ్లు అమ్మి తాకట్టు పెట్టి, మధ్యనిషేదం లాంటి మాటలు మడమలు తిప్పి, బడుగు జీవితాల తాగుడునే తాకట్టు పెట్టి ధనం తెస్తున్న, నవ సందేహాల నవరత్నాలు బటన్ నొక్కి అత్త సొమ్ము అల్లుడిలా పంచడం కాదు, తర్వాత మీరు గద్దె దిగినాక, అన్ని రేట్లు పెరిగి పోయి, జనాలు శ్రీలంక లో పరిస్థితి లా, ముప్ప తిప్పలు పడడం వద్దు! అంటున్నారు పవన్.

రోడ్లు వేయండి సీయం సార్! #GoodMorning CMSir, గుడ్ మార్నింగ్ సీయెం సార్ అంటూ ప్రతి ఊరి లో ఉన్న రోడ్లు దుస్తితిని, ఫోటోలు మరియు వీడియోల ద్వారా షేర్ చేస్తూ, అలాగే వ్యంగ కార్టూన్ ల తో, సోషల్ మీడియా లో ప్రభంజనం / సునామీ స్రుష్టిస్తున్నారు. జగనన్న కు తలనొప్పి పుట్టిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి పై #GoodMorningCMSir హ్యష్ టాగ్ తో, ఈనెల 15 నుండి డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు.

* రేపల్లె నియోజవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. దానిలో ముఖ్యమైన రేపల్లె రూరల్ మండలం ప్రధానరోడ్డు.. దాదాపు 15 తొ 18 పంచాయతీలకి రేపల్లె పట్టణం వెళ్ళడానికి ఇదే ప్రధాన రహదారి..ఈ రోడ్డు ఎప్పుడూ వేశారో కూడా చాలామందికి తేలేదు

* నూజివీడు నియోజకవర్గ రమణక్కపేట౼ వలసపల్లి ప్రధాన రహదారిలో గల చెక్కపల్లి రోడ్డు వద్ద ముసునూరు మండల నిరసన

* పామర్రు నియోజకవర్గంలో, పమిడిముక్కల మండల, చోరగుడి గ్రామం మరియు కృష్ణాపురం ఐలూరు గ్రామంలో వున్న రోడ్లు దుస్తితి

* అమలాపురం బాలయోగి ఘాట్ పక్క రోడ్ సుమారు 200 కుటుంబాలతో పాటు జనుపల్లె గ్రామాన్ని కూడా కలిపే దారిలో వర్షం నీరుకి గుంతలు

* విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో

* సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం అడవిబాపనపల్లి తాండ గ్రామం రోడ్ల దుస్థితి

* పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండల కేంద్రం ప్రధాన కూడలిలో గల రోడ్డు దుస్థితి

* చీరాల దండుబాట రోడ్ లో గుంతలు

ఇంకా ఎన్నో వారి పేజీలో రోడ్ల పరిస్థితి ఫోటోలు వీడియోలు చూడండి.

ఇవన్నీ చంద్రం నాటి పరిస్థితులు, మేము తవ్వామా అని జగనన్న వైపు వారి వాదన. మరి 3 ఏళ్ళు గా మీరు చేసింది ఏమిటి అని చంద్రన్న వైపు అంటారు.

మనకు టీవీ సీరియల్ సినిమాలు ఆన్లైన్ గేం లు ఉంటే చాలు అని మనము అంటాము, అంతేనా? తప్పు ఎవరిది, నాయకులదా? మరి మోహములో ఉన్న ఓటరుదా?

https://www.facebook.com/janasenaparty

*ఇంకోవైపు కౌలు రైతు భరోసా*

జనసేన పార్టీ రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా, ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందుకున్న, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 72 రైతు కుటుంబాలు.

అధికారము లో ఇన్నాళ్ళు ఉంది ఎవరు? ఇప్పుడు ఉంది ఎవరు? వారంతా ఏమయ్యారు? 1 సభ్యుడు కూడా ఉన్నాడో లేడో తెలియని పార్టీ, జాలి దయతో ధనం పంచడం ఏమిటి? ఓడించిన జనము తీసుకోవడము ఏమిటి? మీకేమైనా అర్ధము అయితే చెప్పగలరు?

Pawananna giving Jagananna headache because of condition of roads and security of tenant farmers  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1664 General Articles, 64 Tatvaalu
Dt : 17-Jul-2022, Upd Dt : 17-Jul-2022, Category : Politics
Views : 197 ( + More Social Media views ), Id : 1466 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pawan , jagan , headache , condition , roads , security , tenant , farmers , koulu , raitu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content