రఘురామ పై దాడిన ఖండించిన పవన్. వంగవీటి హత్య ఖండిస్తారా? ఎంటీయార్ కన్నా జగన్ బెటరా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,160; 104 తత్వాలు (Tatvaalu) and views 225,894.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఎంపీ రఘురామ పై దాడిన ఖండించిన పవన్. ఎమ్మెల్యే వంగవీటి హత్య ఖండిస్తారా? గత సీయెం ఎంటీయార్ కన్నా నేటి సీయెం జగన్ బెటరా?*

మొన్న జరిగిన ఒక సమావేశము లో, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొన్ని కీలక వాఖ్యలు చేసారు, సానుభుతి చూపించారు, తన సప్పోర్ట్ తెలిపారు రఘురామకు,

1) రఘురామ పై సిఐడి పోలీసులు చేసిన దాడిని ఖండించారు.

2) మన్యయోధుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు ఆహ్వానం ఉన్నప్పటికీ, సొంత నియోజకవర్గానికి చెందిన ఎంపీ ని రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా, హాజరుకాలేదు అన్నారు.

దానికి ప్రతిగా, మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ క్రుతజ్ఞతలు తెలిపారు తన సోషల్ మీడియా లో, ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఈ లింక్ లో పవన్ మాటలను, రఘురామ క్రుతజ్ఞతలను మీరు చూడవచ్చు - https://fb.watch/elKjmhb7d7/

ఎంపీకి జరిగిన ఇబ్బందిని అవమానాన్ని, బాధను ఎవరమూ కాదనలేము, తప్పకుండా సానుభూతి చూపించాలి. అలా ఎవరికీ జరగకూడదు. అది జరగడం దురద్రుష్టము, అలా జగనన్నకు లేదా ఇతరులకు జరిగినా, అది బాధే.

జగనన్న వైపు ఇలా మరలా జరగకుండా చూడాలి. అహంకారముతో అధికారం ఉపయోగించి అణిచివేసిన గత నాయకుల చివరి రోజుల భవిష్యత్ మనము చూసాము, మనకు ఎందుకు ఆ తలనొప్పి పాప భారం జగనన్నా?

ప్రజాస్వామ్యము లో, విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే ఉండాలి. భౌతిక దాడులు కేసులు మొదలు పెడితే, చివరకు ఎవరూ మిగలరు.

మీ పై జరిగిన దాడిని మీకే కాదు, రాజులు అందరిపై జరిగిన దాడిగా చూడాలి అని పవన్ అన్నారు. ఆ మాట ఎంత వరకు కరెక్టో మరి తెలియదు. ఒక సామాన్యుడికి ఇబ్బంది జరిగితే, మరి ఇలాగే ఆ కులము మొత్తానికి ప్రకటిస్తారా? అలా ప్రకటిస్తూ పోతే, ఇక కులరహిత సమాజం ఉంటుందా? ద్వేషాలు తగ్గుతాయా? ఇలాంటి పదాలు జాగ్రత్త గా వాడాలి సుమా.

ఎంపీ రఘురామ, కేవలం తనకు పడని తనను ఇబ్బంది పెట్టిన జగన్ కు మాత్రమే, వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు. తెదేపా చంద్రన్న కు ఆయన ఏ మాత్రం వ్యతిరేకము కాదు. గత తెదేపా పాలనను ఆయన అసలు విమర్శించరు.

చంద్రన్న పాలనలో ఆంధ్రాలో, కరోనా తట్టుకునే ఒక్క ఆసుపత్రి లేదు ఇన్నాళుగా అని గాని, హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నారు ప్రతిపక్ష నాయకుడు అని గాని, 3 పంటల పంట పొలాలు మాగాణిని కాంక్రీటు ఎందుకు అని గాని మాట్లాడరు. ఆంధ్రాకు రైలులో రాబోయె ముందు, తెదేపా వారి మనుషులతో ఫోటో కూడా, మొన్న అందరితో పంచుకున్నారు.

అంటే ధర్మానికి పూర్తిగా 100 శాతం అనుకూలం కాదు, తన స్వార్ధం అలాగే పక్షపాతానికి కూడా చోటు ఇస్తున్నారు.

సరే ఇక్కడ ఇంకోక గమ్మత్తు అయిన విషయము ఏమిటి అంటే, పవన్ మరియు రఘురామా ఇద్దరూ కలసి, ఎంటీయార్ కన్నా జగన్ బెటరు అని మాత్రం, పబ్లిక్ గా ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. అది అభినందిస్తున్నారు జగనన్న అభిమానులు. ఎందుకంటే ఎంటీయార్ పాలనలోనే, ప్రజాభిమానం ఉన్న ప్రత్యర్ధి ఎమ్మెల్యేను అసలు బతకనీయలేదు కాబట్టి.

ఇక్కడ రఘురామ కాలికి భౌతిక దాడినే మనము ఖండిస్తే, మరి ఏనాడో 26 డిసెంబర్ 1988 తెల్లవారుజామున దొంగచాటుగా పిరికిపందల్లా, మోహన రంగా శిబిరంపై, దాడి చేసి హత్య చేశారు. అంటే 30 ఏళ్ళ క్రితమే, నచ్చని వారిని కేవలము దెబ్బలు తో కాకుండా, అసలు భూమి పై లేకుండా చేసారు.

మరి రఘురామా గారు కూడా, దానిని ఖండిస్తారా తన సోషల్ మీడియాలో, తెదేపా ఎంటీయార్ పాలనలో, ఎప్పుడో మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్ధులను, నా కన్నా ఘోరముగా, దొంగ చాటుగా దెబ్బ తీయడం మొదలు అయ్యిందని. అప్పుడు పవనన్నకు సమానము గా, రఘురామా నిజాయితీగా, కాపులకు అండగా క్రుతజ్ఞతలు తో మాట్లాడినట్లే, అని కాపు, రాజుల మరియు మంచి అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.

జగనన్న తరుపున ఇబ్బంది తో పొలిస్తే, వంగవీటి పై దారుణం ఇంకా చాలా పెద్దదని, అందరూ ముక్త కంఠముతో ఖండిస్తారా? ఇప్పుడు సీయెం ఎంటీయార్ కన్నా సీయెం జగనన్న మంచివారు అని మనము ఒప్పుకోవాలి కదా?

అప్పట్లోనే ఎన్టీఆర్ కు ఎదురుగా నిలబడి కృష్ణ సినిమా చేశారంటే, ఆనాటి వాస్తవాలను మీరు ఈ సాహసమే నా ఊపిరి అన్న సినిమా బిట్ లో చూడవచ్చు. నిజంగా రియల్ డేరింగ్ డాషింగ్ హీరో కృష్ణ. వంగవీటి మోహనరంగా హత్యకు కారకులు ఎంటీయార్ చంద్రబాబు కోడెల దేవినేని నెహ్రూ అని ఆనాటి గుసగుసలు. దాసరి తీసిన పిచ్చోడి చేతిలో రాయి సినిమాకూడా మంచి ఉదాహరణ.

Pawan condemned attack on Raghurama. condemn murder MLA Vangaveeti Is Jagan better NTR  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,160; 104 తత్వాలు (Tatvaalu) and views 225,894
Dt : 18-Jul-2022, Upd Dt : 18-Jul-2022, Category : Politics
Views : 499 ( + More Social Media views ), Id : 1468 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pawan , attack , raghurama , condemn , mla , vangaveeti , murder , jagan , ntr , chandra , krishna , sahasam , dasari , pichchodu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content