Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కరోనా కొంతమంది కి, జ్ఞానోదయం కలిగించింది. మరికొంత మందికి, ఇప్పుడు కూడా మార్పు లేదు, బహుశా రాదు.
ఎంతోమంది కి పాత జ్ఞాపకాలను, సాంప్రదాయాలను గుర్తు చేసింది. అందులో ఒకటి తల్లి దండ్రులు కు, కనీసం కాళ్ళు కడిగి, మన నెత్తిన ఆ నీళ్ళు చల్లుకోవడం. ఎక్కువ సమయం పట్టదు, నిమిషం నుంచి 10 నిమిషాల సమయం, మనకున్న సాంప్రదాయం సంస్కారం ను బట్టి.
భూమి పై కళ్ళు తెరిచాక, మొదటి సారి మనం చూసేది, తల్లి దండ్రులు నే. మన అన్ని బాగోగులు చూసింది వారే. అందుకే మాతృ, పితృ దేవో భవా అన్నారు. ఈరోజు దాదాపుగా ఎవరూ చేయడం లేదు, నామోషి, లెక్క లేని తనం. ఆ కన్నాక, చూడక పోతారా, అని ధీమా. గతంలో ఇంటికి బయట తెలిసిన పెద్దలు లేదా చుట్టాలు మామయ్య, అత్త, నాయనమ్మ లాంటి పెద్దలు వచ్చినా కూడా, కాళ్ళ కు నమస్కారం చేపించేవారు. తల వంచితే అహంకారము తగ్గుతుంది కూడా, తన మన తెలుస్తుంది.
అట్లాగని అసలు చేయడం లేదే వంగి దండాలు, కాళ్ళ కు నమస్కారం అంటే, అవసరం అవకాశాన్ని బట్టి, నట నమస్కారం చేస్తున్నారు, బయట వాళ్ళ కు. ఉదాహరణకు ఆఫీసు లో మేనేజర్ కు, నాయకులు కు, షాపు యజమాని కి, పై అధికారులు కు, వంగి వంగి దండాలు పెడుతున్నారు. కానీ అన్ని ఇచ్చిన, సొంత తల్లి దండ్రులు కు మాత్రం, నమస్కారం చేయరు.
ఎవరికి చేయాలి?
* తల్లి దండ్రులు మరియు వారు తల్లి దండ్రులు ఉంటే వారికి, లేదా ఆ వయసు పెద్దలు, అంటే అత్త మామలు, లేదా ఇతరులు, మీ క్షేమం కోరేవారికి
* కనీసం మన పిల్లల కు, తమ తల్లి లేదా తండ్రికి పాద పూజ చేయమని నేర్పవచ్చును
* ఎవరూ లేకపోతే, కనీసం జీవిత భాగస్వామి కి లేదా తెలిసిన మంచి వారికి. 8 గంటల ఉద్యోగం కన్నా, 16 గంటల ఇంట్లో బాధ్యత మోసే వారు, మిన్న. మనసు ను బట్టి పెద్దరికం. అయ్యప్పస్వామి చిన్న వాడైనా, అభిషేకం చేయడం లేదా? దసరాకు, కుమారి పూజ చేస్తాము, తెలుసు కదా.
ఎలా చేయాలి?
కాళ్ళు పట్టే అంత ఒక చిన్న పళ్ళెము, చెంబు నీళ్ళు, దొరికిన విధంగా పూలు ఆకులు.
కనీసం అమ్మని లేదా నాన్న ని లేదా ఇద్దరు ను కూర్చోబెట్టి, మీ వలన ఇంత వాళ్ళము అయ్యాము, అని గతం గుర్తు చేసి, వారి కాళ్ళు పళ్ళెంలో పెట్టి, భక్తి శ్రధ్ధలతో, ఒక చేత్తో నీళ్ళు పోస్తూ, ఒక చేత్తో నాలుగు వైపులా కడుగుతూ, మీకు ఏదైనా దైవ మంత్రాలు శ్లోకాలు వస్తే అవి చదవ వచ్చు.
పాదాలపై, ఆకులు పూలు వేస్తూ, పూజించవచ్చు. దేవుని విగ్రహం కు, చేసే విధానాలు అన్ని చేయవచ్చు. అక్షింతలు, పసుపు, పాలు, మీ ఓపిక ను బట్టి. ఎందుకంటే మలిన మనసు తో, రాయి కి పోస్తే, ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ, కనపడే దేవుళ్ళు తల్లి దండ్రులు ను పూజిస్తే, ఆ దేవ దేవుడు కూడా, సంతోష పడతారు. ఎందుకంటే తల్లి దండ్రులు, దేవుని తరపున, మన ప్రతి నిధులు కాబట్టి.
కనీసం ప్రయత్నం చేద్దాం, వీలైన దోవలో. వీలైతే మాకు పాదాల ఫోటో పంపితే, పదిమంది కి తెలియజేస్తాం. ఎందుకంటే కొంతమంది, కళాత్మకత కూడా జోడిస్తారు కదా దానికి. ధన్యవాదాలు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,896; 104 తత్వాలు (Tatvaalu) and views 224,922 Dt : 27-Apr-2020, Upd Dt : 27-Apr-2020, Category : General
Views : 1604
( + More Social Media views ), Id : 516 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
mom dad pada puja ,
parents ,
elders ,
life partner ,
well wishers ,
pada puja worship ,
challenge Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments