APLatestNews.com top Banner

Social Media links
ప్రతి జీవికి తల్లిదండ్రులే మొదటి గురువులు - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

మాత్రు దేవో భవ పిత్రు దేవో భవ. ప్రతి జీవికి తల్లిదండ్రులే మొదటి గురువులు.

తల్లి తండ్రి మీద దయ లేని పుత్రుడు(పుత్రిక), పుట్టనేమి వాడు(ఆమె) గిట్ట నేమి
పుట్ట లోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభి రామ వినుర వేమా

శివుడు వినాయక స్వామి కి విఘ్న రాజు పదవి కి పెట్టిన పరీక్షలో ఎలా గెలిచాడో మీకు తెలుసు కదా? తల్లిదండ్రుల చుట్టూ తిరిగి, భూమి చుట్టూ తిరిగిన పుణ్యం సంపాదించి గెలిచాడు భక్తితో కుమార స్వామి మీద.

కాని ఈ రోజుల్లో వాళ్ళకు దూరంగా ఉంటూ, డబ్బులు పంపిస్తూనో, ఆశ్రమం లో పెట్టో చేతులు దులుపు కుంటున్నాము. అలాంటి వాళ్ళు ఎన్ని పూజలు, పునస్కారాలు, యాగాలు, తీర్ద యాత్రలు చేసినా చేసినా ఫలితం శూన్యం. రేపు వాళ్ళు కుడా అనాదరణకు గురి అవుతారు. ఇది సత్యం, అనుభవము మీద మీకు తెలుస్తుంది.

కనీసము వాళ్ళని రోజూ అన్నా పలకరించాలి, ఓదార్చాలి. 5 ఏళ్ళ వయసులో నిన్ను వదిలెస్తే నీకు ఎంత బాధ వుంటుందో, వాళ్ళకు అంతే బాధ ఉంటుంది. దయ చూపు, క్రుతజ్ఞత చూపించు, విసుక్కో వద్దు, పసి పిల్లల్లా చూసుకో.

ఇందులో తల్లి తండ్రి తప్పు లేదా? తమకు లేదా బిడ్డలకు ఆస్తి సంపదించటము లో ఉన్న ద్యాస వాళ్ళను సక్రమము గా, సంస్కార వంతముగా, సమాజానికి ఉపయోగపడేటట్లు పెంచటము లో చూపిస్తున్నామా? కనీసము వాళ్ళు తల్లి తండ్రిని గౌరవిస్తున్నారా? వాళ్ళ మాట వింటున్నారా?
వాళ్ళకే ఉపయోగపడని వారు, సమాజానికి ఎలా ఉపయోగపడతారు?

చరిత్ర లో పెద్దల ఆస్తితో బాగుపడ్డ పిల్లలు ఎంత మంది ఉన్నారు? 20 శాతం ఉన్నారా? ఎక్కువ మంది, వ్యసనాలకు లోను అయ్యో, చెడు తిరుగుళ్ళకు అలవాటు అయ్యో, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లేకో, ఆస్తిని నాశనము చేసి, వాళ్ళ బతుకులను పాడు చేసుకోవటం లేదా? పిల్లలకు నేర్పాల్సిన మంచి చెడు బేధం, పెద్దలను గౌరవించటం, సంస్కారము, కష్టాలను ఎదుర్కోవటము, నీతి, నిజాయితి, మాట మీద నిలబడటము, ప్రార్ధన, జాలి, దయ, క్రుతజ్ఞత, ధ్యానం, కష్టపడి వళ్ళు వంచి పని చెయ్యడము, ఏకాగ్రత నేర్పుతున్నమా?

రామాయణ, మహా భారతం లో ని నీతిని, నిజాయితిని, మంచిని వంటపట్టిస్తున్నామా? కుట్రలు, మోసాలను ఎలా ఎదుర్కొవాలో నేర్పిస్తున్నమా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 584 General Articles, 46 Tatvaalu
Dt : 05-Sep-2017, Upd Dt : 08-Aug-2019, Category : Devotional
Views : 1926 ( + More Social Media views ), Id : 10 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags :
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు