Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ప్రకాశం జిల్లా స్ధాయి అధికారులు బాధ్యతారాహిత్యం / నిర్లక్ష్యం గురించి, గత మే నెలలో నే మనం ఆర్టికల్ రూపంలో చూశాము. మరలా ఆర్టికల్ వివరాలు చూడండి, ఎన్ని శాఖల గురించి ఎంత వివరణ ఉందో తప్పులు సరిచేయడానికి.
Link ఆ తర్వాత అయినా, జిల్లా స్ధాయి అధికారులు ఎవరు అయినా, సోషల్ మీడియా అప్డేట్స్ ఇస్తూ ఉంటే, దయచేసి లింక్ లు పంపగలరు.
అందరు అధికారులను అనలేము, కానీ సోషల్ మీడియాలో, తమ కరోనా పనులు మరియు తమ సిబ్బంది సేవలను త్యాగాలను ను వివరించని, అధికారులుది మాత్రం పూర్తిగా నిర్లక్ష్యమే.
అందుకే చిత్తూరు, కడప జిల్లా ల కలెక్టర్ కార్యాలయం సోషల్ మీడియా లింక్ లు ఫోటో లు పంపాము, కనీసము అవి చూసైనా మొదలు పెడతారు అని. ఆ జిల్లాల అధికారులు చిత్తశుద్ధి తో పనిచేస్తూ, తమ జిల్లా ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారో, వారి ఫేస్బుక్ పేజీ లు చూడండి. అన్ని జిల్లాల్లో అధికారులు బాధ్యత ఒకటిగా ఉండదా?
చిత్రం ఏమిటి అంటే, మన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్డీవో స్ధాయి అధికారులు తమ ఫోన్ వాట్సప్ ఆపేసుకున్నారు, ఒక విలేఖరి మాటలను చదవడం లేదా సరిచేసుకోవడము ఇష్టం లేకనేమో. అది ప్రభుత్వం ప్రజల ధనముతో ఇచ్చిన నంబరు, వారు ఆపవచ్చు నా? తప్పు ఉంటే చెప్పాలి లేదా సరి చేసుకోవాలి. విలేఖరి వాట్సాప్ తీసివేస్తే, ఇంక మామూలు ప్రజలకు వారు జవాబు చెపుతారా?
అన్నం ఉడికిందా అని, మొత్తం అన్నం పట్టుకుని చూడనవసరం లేదు, సోషల్ మీడియా అప్డేట్స్ అంతే. మన ఇంట్లో పిల్ల వాడు తప్పు చేస్తే, ఇరుగు పొరుగు వారు సహజముగా, ఇంటి పెద్దల నే నిందిస్తారు, పెంపకం సరిగ్గా లేదని. జనం అలా అన్నారు అని కోపము తెచ్చుకుని, మా ఇంటి యజమాని గా, ఓ రోజు ఉండు చూడు ఆ ఇబ్బందులు అని అంటామా?
బాధ్యత గల జిల్లా కలెక్టరు గారి కార్యాలయంలో, అంటే జిల్లా కు తండ్రి స్ధానం లో ఉన్న జిల్లా స్ధాయి అధికారులు అందరూ, తాము చేస్తున్న పనులు ను సోషల్ మీడియా లో వివరిస్తూ, తమ ఉద్యోగానికి న్యాయం చేయాలి. ఈ ఒక్క ఉదాహరణ చాలదా అధికారుల నిర్లక్ష్యం కు. పాత సామెత ఏదో ఉంది, చేస్తే గదా చెప్పుకోవడానికి అని, అలా ఉంది పరిస్తితి.
ఈరోజు జిల్లాలో 27 వేలకు పైగా కరోనా ఫలితాలు తారుమారు అయినవి అంటే, ఎన్ని స్ధాయి ల లో నిర్లక్ష్యం ఉంది? ఇక్కడ అధికారులు సంగతి కాదు, దాని ఫలితాలు చూడండి. ఆ పాజిటివ్ ఉన్న జనం, మాకు లేదు లే కరోనా అనుకుని, ఇంకో వందమంది జనం లో కలసి తిరిగిన, ఇక మనకు అందరికీ ఆ కరోనా రాదా? దానిని కట్టడి చేయగలమా ఎప్పటికైనా? పొలీసులకు, డాక్టర్ లకు అధిక శ్రమ అవుతుంది కదా, ఈ అజాగ్రత్తతో?
జిల్లా అధికారులు అందరికీ మనవి విన్నపము, ఇప్పుడు అయినా సోషల్ మీడియా పేజీలు ఓపెన్ చేసి అప్డేట్స్ ఇవ్వగలరు. మీ నాయకత్వం లో, పట్టణ గ్రామ స్ధాయిలో కూడా, ప్రజలకు సోషల్ మీడియా లో, తాము చేస్తున్న పనులు ను వివరించగలరు.
* * *
* కథలు చెప్పే వాళ్ళు కాదు...
* కష్టాలు తీర్చే వాళ్లు కావాలి జిల్లాకి,
* కష్టపడి పని చేసే వాళ్ళు కావాలి ప్రజలకి
* Parchur MLA - ఏలూరి సాంబశివరావు
జిల్లాలో 27 వేలకు పైగా కరోనా పరీక్షల ఫలితాలు తారుమారై గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితులు ఉంటే పిట్టకథలు, సినిమా స్టోరీలు చెప్పుకుంటూ బాధ్యత మరచి వ్యవహరించడం తగదు.
జిల్లాలో ముగ్గురు జాయింట్ కలెక్టర్ క్యాడర్ అధికారులు, 20 మందికి పైగా సమర్థవంతంగా పనిచేసే జిల్లా స్థాయి అధికారులు, వేలాదిమంది క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసే వ్యవస్థలో నుండి ఎవరికి ఈ క్లిష్ట సమయంలో బాధ్యత అప్పగించినా ఇలాంటి పరిస్థితి ఉండదు. ఈ విషయంలో దేశంలోనే ప్రకాశం జిల్లాకు చాలా చెడ్డ పేరు వచ్చింది.
కేవలం సమన్వయం చేసే జిల్లా కలెక్టర్ బాధ్యతారాహిత్యం వలన, జిల్లా ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
జిల్లా కలెక్టర్ గారికి అంత ఉత్సాహంగా ఉండి సినిమాలో చెప్పిన విధంగా బాధ్యతలు అప్పగించాలని మీకు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి తెలియజేయండి. అప్పుడు వారే ఆ బాధ్యతను ఎవరికో ఒకరికి అప్పగిస్తారు.
ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం తదితర పట్టణాలు, వందలకుపైగా గ్రామాలలో లాక్ డౌన్ విధించి ప్రజలను కాపాడటంలో, నియంత్రించటంలో కొన్ని వందల మంది పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు ఒకవైపు అహర్నిశలు శ్రమిస్తుంటే కరోనా పరీక్ష ఫలితాలలో గందరగోళం సృష్టించి వారి కష్టాన్ని బూడిదలో పోశారు.
జరిగిన తప్పును సరి చేసుకుని భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోకపోగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, వేరెవరినో బాధ్యులను చేయడం దురదృష్టకరం.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,562; 104 తత్వాలు (Tatvaalu) and views 225,838 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments