పాడిపంటలు - జన్మభూమి బంగారు భూమి, రైతుల చెమట ఫలం తిండి - అమరావతి 3 పంటల మాగాణి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,698; 104 తత్వాలు (Tatvaalu) and views 225,166.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*పాడిపంటలు - మన జన్మభూమి బంగారు భూమి, రైతుల చెమట ఫలం మన తిండి - అమరావతి 3 పంటల మాగాణి*

రైతు దేవుడు అని, నాయకులు సినిమా నటి నటులు నర్తకులు గాయకులు ఆటగాళ్ళు అందరి కన్నా, ఎంతో విలువైన వారు అని ముందు గౌరవం వారికి ఇవ్వాలని, అందరికీ తెలిసినా, చిన్న చూపు చూస్తున్నారు, చివరి ఆకు వేస్తున్నారు.

రైతు లేనిదే అన్నము దొరకదని, పీయెం సీయెం కామన్ మెన్ అయినా, ముద్ద నోటిలోకి వెళ్ళకపోతే, దేనికి పనికిరారు, ఏమీ చేయలేక నిస్సత్తువగా మూలన ఉంటారని, చాలా మందికి ఈనాటికి తెలీదు. అందుకే రైతు లను తక్కువ చేసి చూస్తూ, ఆత్మహత్యల స్తితికి తీసుకు వెళుతున్నారు.

ఎందుకంటే బాగా జరిగినన్ని రోజులు, ధనం పెడితే హోటెల్ నుంచి అన్ని పార్సెల్ వస్తాయి, అని జనం మూర్ఖముగా అనుకుంటున్నారు. కానీ మొన్ననే శ్రీలంకలో రొట్టె ఒకటి, వెయ్యి రూపాయలు అమ్మింది. అంటే, ఇంక బియ్యము కూరగాయల రేట్లు ఎంత ఉంటాయో కదా? కష్టపడి సంపాదించిన సొమ్ముతో, అంత ఖర్చు పెట్టి, ఎన్ని రోజులు తినగలము, ఆ బంగారపు ధర తిండి?

అప్పుడే, ఇన్నాళ్ళు ఉచితాలకు మత్తులో జోగాడిన జనము, కడుపు కాలేసరికి, మత్తు వదలి వాస్తవం గ్రహించి, కాళ్ళకు బుద్ది చెప్పి పరుగులు తీసి, నాయకుల పై తిరగబడి, పార్లమెంట్ మీదకు దాడికి పోతే, లంక నాయకులంతా, భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు.

యుక్రెయిన్ యుద్దం వలన, అన్ని దేశాల గోధుమ ఎగుమతులు దిగుమతులు అన్ని ఆగిపొయాయి. ఎవరికి వారికి భయం, రేపు తిండి దొరకదేమో నని.

నిజమైన రైతు, ఏనాడు 3 పంటల మాగాణీ వదలడు, కోట్లు ఇచ్చినా అమ్మడు. ఆ మాగాణి నేల తన ప్రాణానికి, సమానము గా చూసుకుంటాడు, తర తరాలు కొనసాగిస్తాడు.

మా తాతకు మామూలు పొలము ఉంటేనే, రైలు కట్టకు కొంత పోతుందు అందరికీ, అని బాధపడ్డారు మా చిన్నప్పుడు.

ప్రభుత్వమే, తప్పనిసరి పరిస్తితిలో లాక్కుంటే, కొంత భాగము రైలు కట్టకు బస్ రోడ్ కు ఏమీ చేయలేము, తప్పదు సహకరించాలి, ప్రయాణ సౌకర్యాలు లేకుండా, పంటను అమ్ముకోలేము, మంచి ధరకు. ఆ త్యాగము తప్పదు, దాని వలన మనకు పాపం రాదు. ఎందుకంటే, మనము ఇష్టపూర్వకము గా అమ్మలేదు, ఆ పాపం మన నెత్తిన వేసుకోలేదు.

కానీ ఇప్పుడు రాజధాని పేరు అడ్డము పెట్టుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, కోట్ల రూపాయల ధనము కోసము, కన్న తల్లి లాంటి 3 పంటల మాగాణి భూమిని, రైతులే పాపము మూటగట్టుకుని ఇష్టపూర్వకముగా ఇచ్చారు అని ప్రచారం చేస్తూ, కాంక్రీట్ చేస్తున్నారు. అంటే, మన పంట భూమి, తగ్గిపోతుంది, భవిష్యత్ లో పంట రాబడి తగ్గుతుంది. ఇది తప్పు అని, ఏ ఒక్కరు కూడా నిలదీయలేదు.

రైతులే, ఆ పంట పొలము మీద, మనకు ఓ ప్లాట్ మరింత రొక్కము వస్తుంది అని అమ్ముకోవడం చూసి, ఇతరులు సమర్ధన చూసి, అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. నోటి కాడ తిండి తియ్యాలా, మనము మిద్దెలు మేడలు కట్టుకోవాలి అంటే? రాజధాని 3 పంటల పొలాలపై కట్టాలా? ఎవరి వింత రాక్షస రాజకీయ క్రీడ ఇది? రేపు వారికి పంచభూతాల శిక్ష తప్పదు. రేపు మన మనవళ్ళకు తిండి ఎలా దొరుకుతుంది, అని లోలోన చాలా మంది బాధపడ్డారు.

తప్పుడు జనం, తప్పుడు నాయకులను ఎన్నుకున్నప్పుడు, ముందు చూపు, మంచి చెడు పాపం పుణ్యం, ఉండదు. అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం లో, క్షణిక ఆనందమే ఆలోచనే గొప్పగా ఉంటుంది. ఈ రోజు కోట్లు వస్తుంది అంటే, ఆనందముగా పొలము ఇచ్చాము. రేపు అదే లక్ష పెడితే భోజనము దొరక్కపోతే, ఏమి చేసుకుంటాము, ఆ కోట్లు? వారికి ఇప్పుడు ఎక్కదు.

ఈ భూకామందుల మాటలు విని, మాయలో పడి, చిన్న రైతు కూడా పొలాన్ని ఇచ్చేసారు. దయచేసి ధనవంతుల బలవంతుల క్రీడలో, చిన్న సన్న కారు కౌలు రైతులను బలి చేయవద్దు.

ఇప్పుడు 3 రాజధానుల ఆలోచనలతో, మొత్తము తలకిందులు అయ్యింది. ఆ నష్టపోతున్న చిన్న సన్న కారు రైతుల పాదయాత్రకు మనము మద్దతు ఇవ్వాలి. కానీ వారి వెనక ఉన్న, రాజకీయ నాయకుల కుట్రలను తిప్పి కొట్టాలి. రాజకీయ కేళి వేరు, రైతు గోడు వేరు.

3 ప్రాంతాలు అభివ్రుద్ది చెందాలి. అలాగే 3 పంటల పంట పొలాలు కాంక్రీట్ కాకుండా, అమరావతి రాజధాని గా కావాలి. కానీ వీరు ప్రతి జిల్లాలో కూడా, జిల్లా రాజధాని విషయములో, అదే సూత్రం 3 జిల్లా రాజధానులు అమలు పరచడం లేదు. అంటే, మరలా ఇక్కడ ఇంకొక కుట్ర. వారిదీ కుట్రే, వీరిదీ కుట్రే, మత్తులో ఓటేసిన మనదీ కుట్రే.

ఆంధ్రాకు 3 పంటల పంటపొలాలు కాంక్రీటు కావడానికి, రాజధాని లేకపోవడానికి, పన్నులు పెరగడానికి, ఆవు ఏనాటికి గెలవకపోవడానికి, మొదటి ముద్దాయి బాధ్యత లేని ఓటరు.

గత 20 ఏళ్ళు గా, పాము నక్క పులి ని తప్ప, తాను మనసున్న మనిషిని అని గుర్తు ఎరిగి, ఓటు అంటే తన కన్న కూతురు అని భావించి, ఆవును ఏనాటికీ ఎన్నుకోడు, ఈ పతనాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి నాయకులది అధికారులది రైతులది తప్పు కాదు, కేవలం ఓటరుదే మొదటి తప్పు, అంటే మనదే.

మన జన్మభూమి.. బంగారు భూమి, పాడి పంటలతో.. పసిడి రాశులతో..
కళ కళలాడే జననీ... మన జన్మభూమి, మనజన్మ భూమి..

రైతు లేనిదే.. రాజ్యం లేదని 2
ఎద్దుల గంటలు మ్రోగినప్పుడే
నీలాకాశం నుదుటిన తిలకం
నిండుగా దిద్దుకుంటుంది
రైతు పాదమే.. రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే..హే...హే..ఆ..ఆ..ఆ
రైతు పాదమే.. రామ పాదమని, పిల్లగాలులు పాడినంతనే..
అణువు అణువు అన్నపూర్ణై, ప్రేమతో పులకరిస్తుంది
మమతల మాగాణి... మనజననీ ||మన జన్మభూమి||

నాగలితో నమస్కరించి.. పారలతో ప్రణమిల్లి.. 2
భూమి గుప్పెట పట్టి, గుప్పెడు ధాన్యం చల్లితే
గంగ యమున గోదావరి కృష్ణలై, పాలపొంగులై ప్రవహించి...
కుప్పతెప్పలుగా పురులు పొర్లగా, ప్రాణం పంటగా ప్రసవించే.. జననీ
పచ్చి బాలింతరాలు.. మన జననీ ||మన జన్మభూమి||

నల్లని రాముని.. అల్లరి కృష్టుణి...2 పాదాలతో చల్లబడిన నల్లరేగడి భూమి...
బోసు భగత్ సింగ్, బాపు నెహ్రు త్యాగాలతో, ఊపిరి పీల్చిన భూమి..
అల్లూరి సీతారామరాజు రక్తంతో.., వీర రక్తంతో
తడిచి తరించి.. రత్నగర్భగా, రాళ్ళకెక్కిన జనని.., రతనాలకన్న జననీ
భాష ఏదైనా.. వేషమేదైనా.., భారతీయులు ఒకటేనంటూ
బిడ్డలందరికి ఒకే బావుటా, నీడగ ఇచ్చిన.. జననీ..
విశ్వ నివాళులందిన.. జననీ
మాతకు మాత.. మన భరతమాత ||మన జన్మభూమి||

చిత్రం: పాడిపంటలు (1976), సంగీతం: కె.వి. మహదేవన్, గీతరచయిత: మోదుకూరి జాన్సన్, నేపధ్య గానం: బాలు, క్రిష్ణ విజయనిర్మల
Film: Padipantalu (1976), Music: K.V. Mahadevan, Lyricist: Modukuri Johnson, Background Vocals: Balu, Krishna Vijayanirmala

padipantalu - mana janmabhumi bangaru bhumi, raitula chemata phalam mana tindi, amaravati 3 pantala magani  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,698; 104 తత్వాలు (Tatvaalu) and views 225,166
Dt : 12-Sep-2022, Upd Dt : 12-Sep-2022, Category : Songs
Views : 560 ( + More Social Media views ), Id : 1514 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : padipantalu , janmabhumi , bangarubhumi , raitu , tindi , amaravati , magani , krishna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content