నియోజకవర్గం బయట, జీతాలు సౌకర్యాలు కోత కోసి, సగం రోజులు లేని వారిని, అనర్హులుగా - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1559 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1594 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

లక్షల జీతం, సౌకర్యాలు, వేల ఫించన్లు నిస్సిగ్గుగా, ఆత్మాభిమానం వంశ ప్రతిష్ట లేకుండా తీసుకుంటూ, స్ధానికం గా ఉండని వారికి, ఇచ్చే ధనం ను తగ్గించాలి, వారు ఉన్న రోజులు బట్టి లెక్క గట్టి.

చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎంపీ, ఒంగోలు ఎంపీ, అలాగే నరసాపురం ఎంపీ, ఇంకా మీకు తెలుసు ఎంత మంది ఇతర ఎమ్మెల్యే, ఎంపీలు అలాగే దూరంగా ఉంటున్నారో, వారి వారి వ్యక్తిగత పనులు అవసరాలు వ్యాపారాల ను బట్టి.

మంత్రులు, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, ఉంటే నియోజకవర్గం లేదంటే ఆంధ్రా రాజధాని లో ఉండాలి. ఇంక ఎక్కడ ఉన్నా, జీతం సౌకర్యాలు కట్. కోట్లు ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకు ధనం తగ్గినా ఇబ్బంది లేదు కానీ ఆ ప్రచారం బయటకు వస్తే పరువు పోతుంది అని స్థానికముగా ఉంటారు.

చంద్రన్న, లోకేష్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పర్యటన ఉంటే తప్ప, ఇతర వ్యక్తిగతంగా రాష్ట్రం బయట మరియు నియోజకవర్గం బయట ఉంటే, వారి జీతాలు సౌకర్యాలు మరియు ఫించన్లు లో కోత కోసి, ప్రభుత్వ సహాయ నిధికి జమ చేయాలి.

అలాగే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, ఎన్నిరోజులు స్ధానికం గా ఉన్నారో లెక్క గట్టి, సగం కూడా లేని వారిని, అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఆత్మాభిమానం సొంతంగా ఉన్న వారు, ప్రజలకు దూరంగా ఉండాలి.

ప్రతి సంవత్సరం కూడా, స్ధానిక ప్రజలకు, తమ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు ఎన్ని రోజులు, స్ధానికం గా అందుబాటులో ఉన్నారో, గణాంకాలు తమ ఫేస్బుక్ పేజీలు లో తెలుపాలి.

ఇలాంటి కొన్ని చర్యలు చేపట్టి, నాయకులు కు, జనం మరియు ప్రభుత్వం పిచ్చి వారు కాదని నిరూపించాలి. ప్రజాస్వామ్యం ని కాపాడాలి.

జగనన్న అమాయకుడు కాదు, ప్రజా పక్షపాతి ప్రజల కోసం, ఎంత కఠినమైన నిర్ణయం అయినా తీసుకుంటారు అని దేశం మొత్తం ఎలుగెత్తి చాటాలి.

ఎంపీలు స్ధానికం గా ఉండని విషయం, పార్లమెంటు లో మిగతా ఎంపీలు బీజేపీ నాయకులు ఎలుగెత్తి చాటాలి. ఏ పార్టీ కి ఆ పార్టీ, తగిన చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1594 General Articles, 54 Tatvaalu
Dt : 29-Jan-2021, Upd Dt : 29-Jan-2021, Category : Politics
Views : 470 ( + More Social Media views ), Id : 947 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : outside constituency , mla , mp , half year , cut , salaries , facilities , pension , disqualify , ap , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content