ఒరే పిచ్చి పిరికి సన్నాసీ, పెంచినూరు, తల్లి తండ్రి మరవకురా - మనవూరి పాండవులు, క్రిష్ణం రాజు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,205,090; 104 తత్వాలు (Tatvaalu) and views 244,182.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఒరే పిచ్చి పిరికి సన్నాసీ, పెంచినూరు, తల్లి తండ్రి మరవకురా - మనవూరి పాండవులు, క్రిష్ణం రాజు*

మనము ఇక్కడి దాకా రావడానికి, ఇంత ఎత్తు ఎదగడానికి, ఉత్తమ చదువులు, ఉత్తమ ఉద్యోగాలు చేస్తూ, సౌకర్యవంతముగా ఉండటానికి, తమ రక్తం చెమట సమయం అన్ని ఇచ్చిన, ఆ తల్లి దండ్రులకు, తిరిగి అవే ఉత్తమ సౌకర్యాలు ఇవ్వడానికి, నేటి విశ్వాసం లేని మ్రుగాలకు, మనసు అంగీకరించడం లేదు.

ఏరు దాటాక, తెప్ప తగలేయడం అంటే, ఇదే, మనలో 70 శాతం, ఇలాగే ఉంటారు. అవసరానికి అమ్మా, అవసరం తీరాక పోవమ్మా అంటారు. మనకు స్పష్టముగా ఆ నడత తెలుస్తుంది, కానీ మోహం లో ఉన్నవారికి, చివర మాత్రమే తెలుస్తుంది.

పోనీ, 20 ఏళ్ళ సేవను మరచిన వారు, భాగస్వామి పిల్లల విషయములో నిబద్దతగా ఉంటారా? రోగం వచ్చి, కాలు చెయ్యి పడి మంచం ఎక్కితే గానీ లేదా ఎదిగిన పిల్లల సంస్కారం బయట పడితే గానీ, నిజ స్వరూపాలు బయటపడవు, కదా? అందరూ పెద్ద నటులే.

రాము, సోము మంచి స్నేహితులు ఏళ్ళుగా, మనసు విప్పి మాట్లాడుకుంటారు. సోమును, సౌమ్య అని చదువుకుంటే, మహిళా జవాబు అలాగే ఉంటుంది.

కరోనా కు ముందు, అమ్మను తెచ్చి నేను దగ్గర పెట్టుకుంటాను అని సోము చెప్పాడు. కరోనా సమయములో, మరలా మాట మార్చి, కరోనా తగ్గిన తర్వాత అమ్మ ను తెస్తాను అన్నాడు.

తర్వాత స్నేహితులు గా వారి మాటలను గమనించండి.

రాము - ఏరా సోము, అమ్మను తెస్తాను అన్నావు, ఏమైంది, అమ్మ సంగతి? ఏమైనా ఇబ్బందా? ఆరోగ్యము ఎలా ఉంది?

సోము జవాబు - అమ్మకేమి బ్రహ్మాండం. ఊళ్ళో మంచి ఇల్లు కొన్నాను. 2 పని మనుషులు. బంధువులు వారిని తోడు పెట్టాను. అన్ని సౌకర్యాలు కల్పించాను. వారికి కావల్సిన సపోర్ట్ ఇస్తున్నా. నువ్వు కావాలంటే వారితో నే మాట్లాడి, నిజం తెలుసుకో. నా స్నేహితుడివే కదా, భయం లేదు.

రాము - అరే, ప్రశ్న ఒకటి, జవాబు ఒకటి, అమ్మ ని ఎందుకు తేలేదు అని కదా, అడిగింది.

సోము - అమ్మ రావడం గురించి, తను అబద్దాలు చెప్పడం గురించి దాటవేత. అమ్మ కు అక్కడ బాగానే ఉంది. నీకు ఎన్ని సార్లు చెప్పినా, నన్ను అనుమానిస్తావు. ఒక్క దూరము తప్ప, అన్ని ఆమెకు అందుతున్నాయి కదా అన్నాడు. అమె కోసం ఏమైనా చేస్తాను, వెనుకాడే పరిస్తితి లేదు అన్నాడు.

రాము - అందరి మాట అదే, తెలుగు రాయలేం. అమ్మ అయ్య ను, దగ్గర పెట్టుకొని ఉత్తమ సేవ చేయలేం. పిల్లలకు సంస్కారం నేర్పలేము. ధన సంపాదనలో ఇద్దరికీ క్షణం తీరికలేదు, అప్పులతో మనశ్శాంతి లేదు. ధనం విసిరి, దూరం గా ఉంచి, సపోర్ట్ చేస్తాం అని.

సపోర్ట్ అని రాయడం కు సిగ్గు లేదు. నేను బయట వారికి కూడా సపోర్ట్ చేస్తున్నా. కన్నతల్లి దండ్రులు కు, ఇతరుల కు సపోర్ట్ అన్న పదం ఒకటే అంటే, మన బతుకులు కృతజ్ఞతలు, ఇవేనా?

నువ్వు కోవిడ్ తర్వాత వస్తుంది, అని అబద్ధాలు చెప్పడం పూర్తి అయింది. కనీసం ముదుసలి అత్తా మామలు కు, దగ్గర ఉంచి, మంచి సౌకర్యాలు ఇస్తాం అని గట్టిగా చెప్పు. మీ బావమరుదులు కన్నా, నీ పరిస్తితి చాలా బెటర్ కదా?

సోము - అంటే, ఇంకా నువ్వు నన్ను నమ్మడం లేదా? అత్త గురించి దాటవేసే ప్రయత్నం.

రాము - నిజమైన స్నేహితులే, తల్లి దండ్రుల గురించి మాట్లాడుకునేది. సరే, దూరం తప్ప, అన్ని ఉన్నాయి అన్నావు కదా? మరి భాగస్వామి, పిల్లలను కూడా అమ్మతో నే ఉంచి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని ఒప్పించ గలవా?

మీ భాగస్వామి మరియు పిల్లలు ను కూడా, అక్కడ నే ఉంచి చూసిన, నువ్వు అన్ని పెట్టినట్లే కదా? అమ్మ ను దూరంగా ఉంచడం, పిల్లలు గా నీ బాధ్యత కరెక్టే అంటే, భాగస్వామి గా అదే పని చేయడం కరెక్టే అను మరి. వీరికి సౌకర్యాలు దగ్గర గా, వారికి ముష్టి ఏమిటి దూరంగా, అదే తేడా చూపడం. భగవద్గీత చెప్పిన సమత్వం ఏది?

సోము - ఇంతే ఎప్పుడు, నన్ను ఎప్పుడు అర్ధం చేసుకుంటావో.

రాము - అమ్మను చూసే, నీ బంధువులకు తొబుట్టువులకు అన్నదమ్ములకు, ఆస్తి ఇవ్వడం, వంద సహాయాలు చెయ్యి అది వేరే విషయం. దానిని దీని తో కలపకు. మీ అమ్మ కు, నీ ఇంట్లో ముద్ద పెడతావా, నీ చేతిలో లేదా. అంత వరకే చెప్పు. ఇది వేరు విషయం. ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పు వంకర లేకుండా- 1.అమ్మ ను తెస్తున్నారా? లేదా? 2. అత్త మామ ను తెస్తున్నారా? లేదా? ఎప్పుడు, ఎందుకు తేలేరు, ఇబ్బంది ఏమిటి?

అంతవరకే జవాబు చెప్పు, వాదన వివరణ వద్దు
1. నవంబరు లో తెచ్చి, జీవితాంతం మాతో ఉంచుతాము
2. చచ్చి నా, తెచ్చి పక్కన పెట్టను, ఇద్దరు నూ, అమ్మో వారిని భరించలేము, తప్పుడు బుద్దులు అని స్పష్టము గా చెప్పు.
3. ధనం వీసా ఇల్లు ఇతర సమస్యలు, నీ నాటకాలే గానీ, నిజం కాదు. కావాలని, వారిని వదిలేస్తున్నావు.

సోము - కావాలంటే, మీ చెల్లెలు (మా ఆవిడను) అడుగు. నేను ఎంత బాగా చూస్తున్నానో చెపుతుంది.

రాము - దయచేసి ఆత్మ ద్రోహం చేసుకోకు, దేవుడు మనకు ఇచ్చిన సౌకర్యాలు గేళి చేయకు. పంచభూతాల శిక్ష భరించలేము. నువ్వు మీ అమ్మ కు, భాగస్వామి కి తేడా చూపుతూ, కన్నతల్లి ని హీనంగా దూరముగా ఆదరిస్తున్నావు.

మధ్యలో, మాలాంటి బయట వారి మాటలకు, సంబంధం లేదు. నీ నిర్ణయం నిర్లక్ష్యం నీదే. మధ్యలో మేమెవరం.

సమ దూరం సేవ బాధ్యత చేతలలో చూపించు. అనవసర మాటలు ఎందుకు. ఆమె పాపం లెక్క వేరు, నీది వేరు. ఆత్మ శుద్ధి, ఫలితాలు ఎవరివి వారివే.

నీ లాగా డొంక తిరుగుడు అబద్ధాలు చెప్పదు సాగతీయదు, చెల్లెమ్మ, నిజం వెంటనే ఒప్పుకుంటుంది, 2 నాల్కల మనిషి కాదు. ఇప్పటికే 5 సంవత్సరాలుగా తెలుసు మాటలు మనస్తత్వం.

ఒక మనసు నీతి నియమం లేని గేదె ను, ధనం ఆస్తి ఉద్యోగం అందం వీసా తో, కొనుక్కుని వచ్చాక, నడి బజారులో అమ్మిన నీతి మాలిన వారి గురించి, బాధ బాధ్యత ప్రేమ కనికరం అవసరమా? ఆ సంగతి గేదె ను అమ్మిన వారికి తెలుసు. అంతే కాకుండా, వారి కపట బుద్దులూ తెలుసు. ముదుసలి వారికి చేసే ఓపిక కూడా మాకు లేదు. మా వారి వైపు తేవడం లేదు. కావాలంటే, ఎంతైనా సహాయం చేస్తాము, 2 వైపులా.

అలాగే మా పుట్టింటి వైపు వారిని కూడా తీసుకురాము, మాకు ఎక్కువ సౌకర్యాలు ఉన్నా. కాబట్టి 11 పాపాలు మాకు ఉన్నాయి, ఫలితాలు అనుభవిస్తాము. అని స్పష్టంగా చెబుతోంది. కపటం రెండు నాల్కల ధోరణి ఉండదు. మా ఇద్దరి ఆలోచనలు ఒకటే, మంచి చెడు లో, దాచము.

ఇలా ఉందండి, నూటికి 70 మంది జవాబులు, ఇందులో కొంతమంది, అసలు నువ్వు ఎవరు అడగటానికి, మమ్మల్ని పెంచిన తప్పుడు వారికి, సంస్కారం క్రుతజ్ఞతలు విశ్వసనీయత నేర్పని వారికి, మేము బుద్ది చెప్పవద్దా అని గట్టిగా, నిలదీస్తున్నారు.

కాస్త జాలి చూపండి, దగ్గర పెట్టుకోండి అని చెప్పడం తప్ప, మనము ఏమి చేయగలం. కాల చక్రం గిర్రున తిరిగి మనదగ్గరికే వస్తుంది, అని మరువద్దు మిత్రమా. మన పిల్లలు మన క్రుతజ్ఞతలే నేర్చుకుని, మన పై చూపిస్తారు.

రెండు ప్రశ్నలకు తేడా తెలుసుకోవాలి

1. అమ్మ/ అయ్యను బాగా చూస్తున్నావా, సహాయం చేస్తున్నావా - అందరి జవాబు లు అన్నీ దీని చుట్టూ నే, రుజులులతో. నీతి గల వారి ప్రశ్న ఇది కాదు.

2. అమ్మ/ నాన్న మరియు అత్త/ మామ, మన పిల్లలు తో పాటు గా మనతో ఉంటూ, మన చేయి పట్టుకొని రోజూ నడిచే భాగ్యం ఎందుకు లేదు. ఇన్నాళ్ళు గా. వారు చేసిన పాపం ఏమిటి? - సరైన నీతి కృతజ్ఞతలు గల సమాధానం ఒకటీ లేదు.

చిత్రం: మనవూరి పాండవులు (1978), గీతం: కె.వి.మహదేవన్, సాహిత్యం: ఆరుద్ర, గానం: యస్.పి.బాలు

పేరడీ Parody
ఒరేయ్, ఒరేయ్, పిచ్చి సన్నాసీ
ఒరేయ్, పిరికి సన్నాసీ
ఇలా చూడు, ఇలా చూడు, ఇటు కేసి 2
పెంచినూరు, తల్లి తండ్రి, ఒరేయ్ ఒరేయ్ మరవకురా
నమ్ముకున్న, సొంత వాళ్ళ, వెన్నులోన పొడవకురా
ఒరేయ్ పిచ్చి సన్నాసీ

ఆలి మీద భయముతో, అమ్మను వదులుకుంటారా..
ఆస్తులు పెరిగాయని, గతం మరచిపోతారా... మొత్తము 2 సార్లు
వ్యామోహం నీ తెలివిని చంపుతుందిరా 2
క్రుతజ్ఞత నీ బలాన్ని పెంచుతుందిరా..
ఒరేయ్ కుర్ర సన్నాసీ, చూసుకో ఒక్క సారి నీకేసీ

ఈ భాష, ఈ అమ్మ, ఈ నేల నీదిరా . . .
ఊరిలోన, ప్రతి ఒకరూ, నీ సుట్టం, నేస్తం రా . . 2
పెంచి పోషించిన్నోళ్ళను, అన్యాయం చేయకురా 2
అన్యాయం చేసినోడికి, బుద్ది చెప్పరా

మమత తెంచుకున్న, ఓడు మనిషి కాడురా..
మడిషైతే క్రుతజ్ఞతను, మరచి పోడురా.. 2
విశ్వసనీయత, ఉంటేనీకు, చేతలలో, చూపరా
మనిషిగా మారరా, అమ్మ అయ్యను ఇంట్లో పెట్టరా ..
లే రా.., పోయి రా.., పోయి తీసుకు రా.., ఇంట్లో ఉంచి మనుమల తో ఆడే, ఉత్తమ వైద్య సహాయం అందే, దోవ చూపరా.

ఒరేయ్ పిచ్చి సన్నాసీ

Orijinal

ఒరేయ్, ఒరేయ్, పిచ్చి సన్నాసీ
ఒరేయ్, పిరికి సన్నాసీ
ఇలా చూడు, ఇలా చూడు, ఇటు కేసి 2
ఉన్న ఊరు, కన్న తల్లి, ఒరేయ్ ఒరేయ్ మరవకురా
నమ్ముకున్న, సొంత ఊరు, వెన్నులోన పొడవకురా
ఒరేయ్ పిచ్చి సన్నాసీ

మొకం మీద కోపంతో, ముక్కు కోసుకుంటారా..
ఏలు మీద కురుపుందని, కాలు కోసుకుంటారా... మొత్తము 2 సార్లు
ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా 2
ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా..
ఒరేయ్ కుర్ర సన్నాసీ, చూసుకో ఒక్క సారి నీకేసీ

ఈ నీరు, ఈ గాలి, ఈ నేల నీదిరా . . .
ఊరిలోన, ప్రతి ఒకరూ, నీ సుట్టం, నేస్తం రా . . 2
ఆసపెట్టుకున్నోళ్ళను, అన్యాయం చేయకురా 2
అన్యాయం చేసినోడి, ఆటలు కట్టించరా

మమత తెంచుకున్న, ఓడు మనిషి కాడురా..
మడిషైతే దేనికైనా, దడిచి పోడురా.. 2
అయిదు వేళ్ళు, కలిసుంటే, చేతి దెబ్బ, గట్టిదిరా
పిడికిలి బిగించరా, పిడుగులు కురిపించరా ..
రా.., రా రా.., రా రా..

ఒరేయ్ పిచ్చి సన్నాసీ

ore pichchi piriki sannasi penchina uaru talli tandri maruvaku manavuri pandavulu krishnam raju chiranjivi, murali mohan, bhanuchandar, ravu gopalarao  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,205,090; 104 తత్వాలు (Tatvaalu) and views 244,182
Dt : 11-Sep-2022, Upd Dt : 11-Sep-2022, Category : Songs
Views : 550 ( + More Social Media views ), Id : 1511 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ore , pichchi , piriki , sannasi , penchina , uaru , talli , tandri , maruvaku , manavuri , pandavulu , krishnam , raju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content