ఒకవైపు ఎవరిమాట వినని బాబాయి, ఇంకోవైపు ఏది చెప్పినా ఎక్కని తమ్ముడు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1487 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1522 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అబ్బాయి, ఇన్ని చెపుతూ ఉన్న, ముదుసలి తల్లి బాధ కు, అత్త మనసు కరిగి, బాబాయి, నా మాట వినడం లేదు అని, ఎందుకు చెప్పడం లేదంటావు?

అత్త లేదా చిన్న ముత్యం లక్షణాలు దాదాపుగా ఒకటే. వారికి కావాలసింది ఉంటే, ఇంటికి వచ్చి మరీ కూర్చుని, తలనొప్పి పుట్టించి పట్టుపట్టి, చేపించుకుని పక్కకు వెళతారు. అవసరం లేదు అంటే, ఇక వారి గురించి అనవసరం, అని పట్టించుకోరు, అవతలివారు ఏమన్నా అవనీ వారికి అనవసరం.

తమ సొంత వడ్డీ డబ్బో దానికి తగ్గ స్ధలమో దక్కి ఉంటుంది, ఇంక నాకు అనవసరం, మిగతా వారి ఏడుపు, అని కూడా అనుకోవచ్చు కదా.

రేపు భవిష్యత్తు లో మనమూ, ఇలాంటి ఏదో పరిస్థితి లో ఉంటాము, దేవుడు మంచి వారూ కరుణ చూపు మనవైపు ఉండాలి, అని భవిష్యత్ ఆలోచన చేయరు.

నా లాంటి వాళ్ళ మంచి మాటలు అంటే అసలు ఒళ్ళు మంట, అందుకే ఆమడ దూరం. తమ భవిష్యత్ కు అవి చాలా ఉపయోగం అని, పాప భారం తగ్గడానికి, అని ఇప్పుడు అనిపించదు.

ఈ రోజు నాకు బాగుంది, భవిష్యత్ లో నాకేం ఇబ్బంది ఉండదు అనుకుంటారు. మన చుట్టూ ఇళ్ళలో, ఎన్ని కష్టాలు చూస్తు ఉన్నా.

అయితే మంచి లక్షణం ఏమిటి అంటే, ఏదున్నా మొఖాన నేరుగా చెపుతారు, దులుపుతారు. ఇలా బాబాయి లా, వెనుక నుంచి గోతులు తవ్వరు, తడి గుడ్డ తో గొంతు కోయరు. వారు ప్రయత్నించినా, మనకు చెపుతారు.

చూడండి, బాబాయి అందరిని ఎదురు గా బిడ్డ బిడ్డ అంటూనే, పక్క బిడ్డ ల దగ్గర కూడు లాక్కుని, తన బిడ్డ ల కు పెడతారు, అలాంటి తప్పడు పనులు చేయరు.

మా నాయనమ్మ చివరి దశలో కూడా ఏ కూతుళ్లు, దగ్గర ఉంచి చూడలేదు, ముఖ్యంగా అత్త. అందుకే అత్తకు ముదుసలి వారి బాధ తెలీదు.

అత్త కు శ్రీ రామ రక్ష, మామయ్యే. దైవ రక్షణ కూడా అత్తకు, అందుతుంది మామయ్య వలనే. మామయ్య, నా ఎదురు గా ఎప్పుడూ, నన్ను ఒక్క మాట కూడా అనలేదు, బహుశా అనరు. మేమిద్దరమూ చాలా బాగా, మాట్లాడుకునే వాళ్ళం. మామయ్య ను వారు బాగా చూసుకున్నంత కాలం, మామయ్య ఉన్నంత వరకు, అత్త కు తిరుగు లేదు.

మా ముత్యాలు అంతే కదా ఇప్పుడు. ఆ కష్టం ఏమిటో ముందు రోజుల లో, వారి పిల్లలే వివరముగా నేర్పుతారు.

నాయనమ్మ ను అంతా, పిన్ని మాత్రమే, దగ్గర ఉండి సేవ చేసింది. మంచి ని , మంచే అనాలి. మోసం తో, మన ధనం తిన్నారు, అని లేని అబద్దం చెప్పకూడదు.

ఆనాడు నానమ్మను మద్రాస్ హస్పటల్ కు తీసుకుని పోయి, అన్ని రోజులు పక్కన ఉండి, వెనక్కి తెచ్చిన దీ పిన్నే, ధైర్యంగా ఒక మగ మనిషి లా.

అందుకే పిన్ని అంటే అభిమానం. ఆ రోజే చెప్పాను, నాయనమ్మ వారసురాలివి నువ్వే, పుట్టిన కూతుళ్ళ కన్నా.

నాయనమ్మ లా అందరినీ ఆదరించే, పెద్ద బాధ్యత కూడా నీదే, దాని వలన దైవ రక్షణ ఉంటుంది, నీకే మంచిది అని. ఇది గుర్తు ఉన్నంత వరకూ, నాయనమ్మే నీకు రక్షణ, దేవుని అండ కూడా అని చెప్పాను. ఆస్తులు పెరిగాయి, మనసులు చిన్న బోయాయి.

కానీ ఇప్పుడు ఈ కొద్ది సంవత్సరాలుగా, ధన వ్యామోహం లో పిన్ని, అన్ని మరచి పోయి, తన భవిష్యత్ రాత, తనే మార్చుకుంటూ ఉంది. ఈ వైభవం ఈ మనశ్శాంతి, బాబాయి తర్వాత కష్టం. బాబాయి ని, తమ్ముడు ని మార్చే, బాధ్యత తప్పించుకుంటుంది.

వారిలో మార్పు లేకపోతే, ఇబ్బందులు పడేది తనే చివరకు. ఒకవైపు ఎవరిమాట వినని బాబాయి, ఇంకోవైపు ఏది చెప్పినా ఎక్కని తమ్ముడు. ఎవరి ధనం అయినా మనశ్శాంతి ఇవ్వదు. కృష్ణా, నువ్వే దిక్కు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1522 General Articles, 51 Tatvaalu
Dt : 20-Feb-2020, Upd Dt : 20-Feb-2020, Category : General
Views : 579 ( + More Social Media views ), Id : 354 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle , babai , interest , aunty , grand mother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content