పెద్ద వయసు వారికి, వ్యాయామం, ప్రాణాయామం, కళ్ళ కింద చారలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2134 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2169 General Articles and views 2,200,425; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

వాట్సాప్ స్టేటస్ లో, రోజూ మారే, మంచి వ్యక్తిత్వ మాటలు చదవకుండా వదలవద్దు. సాధన నిరంతరం లేనిదే శని రాహు కేతువల మాయ ను, అరిషడ్ వర్గాల ను జయించడం తేలిక కాదు సుమా, యోగులకైనా పెద్దలకైనా. సరే ఈ రోజు కధనం గురించి ఇప్పుడు.

60 దాటిన తర్వాత, వ్యక్తిగత శ్రమ ఓపిక బలం ను బట్టి, కాళ్ళు లో బలం తగ్గి, పాదాల వెనక అరిగి, తూలడం మొదలు అవుతుంది. ఇది అందరికీ ఒకే విధంగా ఉండదు, వారి అలవాట్లు పరిస్థితి ని బట్టి, 70 80 ల లో రావచ్చును.

90 లలో కూడా దర్జాగా తిరిగేవారు ఉన్నారు, చిన్నప్పటి నుంచి, ఉదయం 5 కి లెగిచి, ఒళ్ళు దాచుకోకుండా, శారీరక శ్రమ చేసేవారు కి, శారీరక బలం బాగానే ఉంటుంది.

బయట నడిచేటప్పుడు, బూట్లు వేసుకుంటే, కొంత సపోర్ట్ వస్తుంది. రోజూ పార్కు దగ్గరకు మైలు నడక, చేయి పట్టుకుని చేస్తున్నారు అని మీకు తెలుసు, చలికాలంలో కొన్ని రోజులు సాధ్యం కాదు. శనివారం, 9 నవగ్రహ ప్రదక్షిణలు కూడా. వద్దు అని మొత్తుకున్నా కూడా, బయట రోజూ చిమ్మి, అప్పుడప్పుడు కళ్ళాపి ముగ్గులు బట్టలు, మీకు తెలుసు, ఇదంతా శారీరక శ్రమనే కదా.

మరి ఇంట్లో కూడా, కాళ్ళ కు సపోర్టు బూటు, ఏమన్నా ఉంటుందో చూడాలి. అందుకనే కొన్ని ఎక్సర్ సైజులు చేయడం మొదలు పెట్టవచ్చు తేలికవి. ఇవి పెద్దల ఓపిక బలం సహకారం బట్టి, మాత్రమే చేయాలి. ఉదయం మంచిది, సాయంత్రం కూడా వీలైతే. అనుమానం ఉంటే, డాక్టరు ని సంప్రదించండి ముందు.

ఇది మామూలు వారికి కూడా, బాగానే ఉంటుంది తేలికగా చేయ దలచిన. మంచం మీద రోగిలా, చివరలో పడి ఉండే కన్నా, వీలైనన్ని రోజులు ఆరోగ్యం గా తిరుగుదాం, మన పెద్దలు ను ఆరోగ్యం గా తిప్పుదాం, పిల్లల కు ఇప్పుడే నేర్పుదాం.

* కళ్ళ కింద నలుపు చారలు వస్తే, ముందుగానే, పసుపు పాలు లేదా పెరుగు నిమ్మ రసం కలిపి, కళ్లు కింద రాసిన ఉదయం సాయంత్రం, నలుపు తగ్గవచ్చు. చిట్కాలు ఎన్నో.

1. గోడ లేదా ఎత్తైన గట్టి బల్ల పట్టుకుని చేతులు తో పట్టుకుని జాగ్రత్తగా, కాలి వేళ్ళ మీద నిలబడటం వీలైనంత వరకు, నెప్పి రానంత వరకు. మరలా పూర్తి పాదం నేలకు. కాలి వేళ్ళు, పాదం పై బరువు పెరిగి, గట్టి పడుతుంది. బల్లమీద కి వాలవద్దు , వాలితే బరువు బల్ల లేదా గోడ మీద పడుతుంది కదా. అలా ఓ పది సార్లు, పైన ఓపిక.

2. పైలాగ నే , గోడ పట్టుకుని, ఒక కాలు వీలయినంత పైకి మడిచి, రెండో కాలిపైనే నిలబడాలి, వీలైనంత వరకు.

మరలా దించి, రెండో కాలు అలాగే పైకి మడిచి, ఒకటో కాలు పై నిలబడాలి. అలా ఓ పది సార్లు.

3. కూర్చుని, తల అటు ఇటు తిప్పడం, ఓ పది సార్లు. తల నరాలు గట్టిపడి, తల ఊపుడు రాకపోవచ్చు లేదా తగ్గవచ్చు.

4. కూర్చుని ప్రాణాయామం చేయవచ్చు. ఒక ముక్కు తో గాలి పీల్చి, కుదిరితే వీలయినంత ఆపి , రెండో ముక్కుతో వదలడం. అలా పది సార్లు.

అందుకే పాటలు పద్యాలు నేర్చుకోవాలి, గడగడా ఆపకుండా పాడాలి చెప్పాలి, మాధుర్యం లేకపోతే ఇబ్బంది లేదు. మనకు తెలీకుండానే ప్రాణాయామం వస్తుంది ఇందులో. ఊపిరి తిత్తులకు ఆరోగ్యం.

5. కాళ్ళు దగ్గర గా బెట్టి నిలుచుని, నడుము ఇటు అటు తిప్పడం ఓ పదిసార్లు.

6. కాళ్ళు దగ్గరగా బెట్టి నిలచుని , వంగి పాదాలు పట్టుకోవడం. మరలా లెగవడం వంగడం, వెన్నుపూస నిటారుగా ఉండి , వంగకుండా ఉంటుంది.

మీకు తెలిసిన వి రాసి పంపగలరు ఇంకా చాలా తేలికవి ఉంటాయి మరి. అమ్మ కూడా ఇవి చేస్తున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2169 General Articles and views 2,200,425; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914
Dt : 01-Feb-2021, Upd Dt : 01-Feb-2021, Category : General
Views : 813 ( + More Social Media views ), Id : 950 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : older people , parents , mom , wall , table , exercise , pranayama , stripes , eyes
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content