నాడు అందరూ ఒట్టి చేతులతో నే, నేడు ఇంట్లో వాళ్ళు కూడా, అంతిమ యాత్రకు లేరు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,329; 104 తత్వాలు (Tatvaalu) and views 225,143.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన చుట్టూ పెద్దలు అందరూ మనల్ని వీడి వెళుతున్నారు. అందరికీ, దైవ సన్నిధి లభించాలని, ఆత్మశాంతి కలగలాని, వారి వారి పుణ్యం ను బట్టి, అని దేవుని ప్రార్ధన చేద్దాం.

దీని నుంచి, నేర్చుకోవాలి గుణపాఠాలు కూడా. నాటి నుంచి కూడా, అందరూ ఒట్టి చేతులతో నే వెళుతున్నారు. కానీ ఇప్పుడు కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా, తోడుగా రావడం లేదు, మన అంతిమ కార్యక్రమం కు. అదీ మనం సాధించిన విశేష ప్రగతి, మన తాతల కన్నా ముత్తాతల కన్నా, అన్ని బంధాలును, మంచి చెడు వదలి, నేడు.

ఈ కరోనా గురువు గారితో, మనకున్న నిర్లక్ష్యం తో, బాధ్యతారాహిత్యం తో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు. వచ్చే వారం, మెసేజ్ పంపగలనా? తెలీదు. కనీసం, ఉన్న 4 రోజులు అయినా, మనశ్శాంతి, దైవ నామస్మరణ తో, గడుపుదాం. చివరి క్షణంలో, దైవం గుర్తు వస్తుంది, అలవాటు ఉంటే నే సుమా. లేదంటే మన పాపాలే గుర్తు కు వస్తాయి, సినిమా సంఘటన లాగా మన కళ్ళ ముందు, పునర్జన్మ లో ఎటూ అనుభవించాలి తప్పదు, తప్పించుకోలేము.

తెలుగు గురువు లను వదలి, పరాయి రాష్ట్ర గురువు ల, వెంట పడుతున్నాము, మూర్ఖత్వం తో. చూడండి, మన బ్రహ్మం గారు, చెప్పిన గీతాసారాశం కింద పాట మాటలలో. ఆనాడే ఎంత అర్థం ఎంత వాస్తవం చెప్పారు. పాట కూడా వినండి.

ఎక్కడ అయినా బ్రహ్మంగారిని, తలచుకుంటున్నామా? దేశ విదేశాల్లో మందిరాలు కడుతున్నామా? అబ్బే, వ్యాపారం కు పనికి వచ్చే, కొత్త గురువు ల మందిరాలు కడతాం, పెచారం చేస్తాం, వంగి దండాలు పెడతాం. కనీసం కొత్త వారి మాటలు అయినా, పాటిస్తూ ఉన్నామా? నేల మీద పడుకోము, బంగారు ఉంగరం లేని వేళ్ళు ఉండవు, అంతేనా? పాట మాటలు చూడండి.

'ఎందుకుర నీకింత బాధా, జీవా, వినుకోర కడసారి బోధా,
తలచినా మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చే ఆ పరమాత్మ నే వదలేసి,
ఎంతిచ్చి పోయినా ఇంతేనా అని ఏడ్చు, నీ వాళ్ళ నమ్ముకుని నిగ్గుతా వెందుకు,
ఉసురు కాస్తా పోతే, విసరి నేలకు కొట్టి, నిముషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు,
ఎందుకురా నీ కింత భాధా. '

గతంలో బతుకుంటే బలుసాకు, తిందాము అనేవారు. నేడు, ఎంతో ఎదిగి, మనసు తరిగి నీచులమైన్, నీతి నియమాలను విడిచి,

ఉన్న నాలుగు రోజులు అయినా, ఆన్లైన్లో గేంస్ ఆడుతూ, సినిమాలు చూస్తూ, పది మంది ధనం లాక్కోని, వాళ్ళ ఉసురు పోసుకుని, చికెన్ మటన్ తింటూ సురపానం సేవిస్తూ, చివరకు ఉన్నదంతా ఎవరికో వదలి, అనాధలుగా పోదాం అంటున్నారు.

మరి మనం ఎదుగుతున్నామా? లేక పతనం అవుతున్నామా , మిత్రమా? ఒక్క సారి వీపు మీద చెయ్యి వేసుకుని ఆలోచన చెయ్యి. పాట వినండి.

Sri Madvirat Veerabrahmendra Swamy Charitra movie song, NTR, Balakrishna, 1984.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,329; 104 తత్వాలు (Tatvaalu) and views 225,143
Dt : 31-Aug-2020, Upd Dt : 31-Aug-2020, Category : General
Views : 767 ( + More Social Media views ), Id : 669 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : old days , elders , empty hands , today , own people , final journey
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content