Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఎన్నారై క్రిష్ణ తన మిత్రుడితో, తన ఊరు గురించి, చెపుతున్నాడు ఇలా. -
మా ఊళ్ళో 3 మీటర్లు కు కరెంట్ డబ్బులు కడుతున్నా, ఇళ్ళు ఖాళీ గా ఉన్నా కూడా. మూడు నెలల కు, చుట్టూ గడ్డి తీపిస్తున్నా. అడిగి న వారికి పావలా అర్ధో ఊరకే ఇస్తున్న. సెల్ ఫోన్ లు ఉంచాలి, మన భారత కంపనీకి డబ్బు కట్టాలి.
కరెంటు బాగు చేసే వారికి, లైన్ మెన్ కు, మోటర్ బాగు చేసే వారికి అంతో ఇంతో ఇవ్వాలి. ఇళ్ళు కు స్విచ్లు బోర్డులు, బాగున్నా మార్పించా. ఇంటి మరమ్మత్తులు చేయించా, అవన్ని ఇప్పుడు అవసరము లేదు. మనకు మార్పు జరుగుతుంది, వాళ్ళకు గౌరవమైన సంపాదన లభిస్తుంది కదా, చేయి చాచకుండా.
ఖాళీగా ఉన్న ఇంటికి, కెమెరా లు అవసరమా? ఇంటర్నెట్ అవసరమా? కరెంటు ఎందుకు? దొంగలు వచ్చి ఇల్లు ను తీసుకుని పోయినా, స్ధలం ఉంటుంది కదా? డబ్బులు లేదా మిగతావి ఇంట్లో పెడతామా?
మరి ఎందుకు ఇంత అనవసరపు ఖర్చు? అది ఖర్చు కాదు, మన ఊరికి కృతజ్ఞతతో, పిసినారి తనం లేకుండా , కనీసం పావలా తిరిగి ఇవ్వడం. కెమెరా లు నేను సొంతముగా పెట్టుకోగలను, కానీ మన ఊరు వ్యక్తి కి ఇచ్చాము. ఇంటర్నెట్ ఖర్చు, మన ఊరు కే. వారు ఇంకో ఇద్దరు చిన్నవాళ్ళకు ఉద్యోగం ఇస్తారు. మన ఇంట్లో ఉన్నవాళ్ళకు రక్షణ ఉంటుంది కూడా. మన భారత బాంకుల కే మన విదేశీ డబ్బులు, మన మేనేజర్ టార్గెట్ కు.
మా ఊళ్ళో అక్క, ఇంటి గేటు దాకా నడిస్తే, కాళ్ళు కందుతాయి, భూమి కుంగిపొతుందేమో అనుకునేది. అలాంటిది, ఫోన్ లో రెండేళ్ళ నచ్చ చెప్పిన తర్వాత మార్పు, రోజూ దగ్గర లోని గుడికి 2 పూటలా వెళ్ళి వస్తుంది. అక్కడ, డాక్టర్ చెప్పారు, చాలా బాగా నడుస్తుంది, గట్టి ప్రయత్నము చేసి మార్చారు. ఎవరి మాట తొందరగా వినరు అని.
మొన్న ట్రిప్ లో 3 వారాలలో 2 లక్షల ఖర్చు. ఎవరికోసం? మన ఊరి కోసం, మన జనం కోసం. ఖాళీ ఇంటికి స్లాబ్ కావాలా? రంగులు కావాలా? సిమెంటు పని కావాలా? చుట్టాలు మా డబ్బులు మాకు ఇప్పుడు ఇవ్వలేము అంటే, ఇద్దరు మిత్రులు చేబదులు ఇచ్చారు ఆ 2 లక్షలు.
రంగులు అతను అడిగాడు, సార్ మాకు మీరు తెలుసు, ఎవరూ ఉండరు కదా, ఎందుకు వేయిస్తున్నారు రంగులు ఇప్పుడు అని. ఇంత ఖర్చు వృధా కదా అన్నాడు. అబ్బాయి, అందరు అలా అనుకుంటే ఎలా, నా నోట్లో కి నాలుగు ముద్దలు వెళితే చాలా? మన ఊరు జనం నలుగురు నోళ్ళల్లో, నాలుగు ముద్దలు పోవద్దా అన్నా.
అంతే, తనకు ఇక్కడ పరిస్తితులు తెలుసు, కన్నీళ్ళు తో దండం పెట్టాడు. వాళ్ళ కు టీలు అందించా, తేనె పెట్టా, బ్రెడ్ ముక్కలు ఇచ్చా, వాళ్ళ కుటుంబ బాధలు విన్నా, వాళ్ళ తో కూర్చొని నవ్వుకున్నా. రెక్కలు ఆడితే డొక్కాడని, మట్టి మోసే కూలి తల్లుల, కడుపు కోత ,గుండె బాధ విన్నా.
మరి మన ఊరు జనం తిప్పి ఏమి చేస్తున్నారు? ఇంట్లో కి చెత్త వేస్తున్నారు, వేసే వాళ్ళను చూస్తూ ఉన్నారు. బండ్లు తెచ్చి పెడుతున్నారు. ఐదుగురు పెద్ద మనుషులు, ఎదురు ఉండి కూడా బండి పెట్టవద్దని చెప్పరు. ఆకతాయిలు లేదా తీవ్రవాదులు బండి పెట్టి వెళ్లి , మన ఊరు జనం కు నష్టం చేసినా, వీరికి ఇబ్బంది లేదు. ఆ నష్టం వారి కుటుంబం కి కలిగితే తట్టుకుంటారా?
మరి మీరు, మీ ఊరు వాళ్ళ బాధలు కనీసం విన్నారా, వింటారా? ధనం ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం వినండి, మన రాతి గుండెల్లో ఇంకిపోయిన నీరు ఉబుకుతుందేమో. తల్లి దండ్రులు నే చూడం , ఊరు జనం , అవసరం లేని జనం తో మాటలు ఎందుకు అంటారా? సరే కాల చక్రం మన దగ్గరకు వస్తుంది కదా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,324,080; 104 తత్వాలు (Tatvaalu) and views 252,338 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments