పిల్లల కు కోట్లు కాదు, సంస్కారం ప్రేమ ఆప్యాయత. అదే మన ముదుసలి తనం లో? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

* మొన్న మహా గాయకులు స్వర్గీయ బాలూ గారి గురించి, నాలాంటి కొడుకు ఉంటే, కాపాడుకునే వాడిని అన్నా కదా. ఎవరినైనా విమర్శ చేసేటప్పుడు, లేదా ఒక మాట అనేటప్పుడు, మన అర్హత మర్యాద కూడా చూసుకోవాలి. అంత జాగ్రత్తగా చూసుకునే, ఓపిక సహనం త్యాగం అవగాహన ఉందా, అనేది ముఖ్యం కూడా.

* వాళ్ళ అబ్బాయి, రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, వారి గురించి మనము మాట్లాడకూడదు.

లోపం ఎక్కడ ఉందో, మీరే మన కధ చదివి పోల్చి అర్థం చేసుకోగలరు. లేకపోతే ఆ గాన గంధర్వుడు, ఇంకా మన మధ్యలో ఉండి , ఆరోగ్యం గా ఎన్నో పాటలు పాడేవారు.

* నాన్న గారు, బిడ్డా బాంకు లో ధనం ఉంటే ఉపయోగం లేదు, స్ధలాలు కొంటే, రేట్లు వస్తాయి. అంతా తెల్ల ధనమే కదా ఇబ్బంది లేదు, భవిష్యత్తు లో లక్షలు వస్తాయి అనేవారు ఎప్పుడూ.

దానికి మన జవాబు, మీకు ఆరోగ్యం బాగాలేదు. రేపు స్థలాల కోసం తిరుగుతూ, ఏదైనా జరగరానిది జరిగితే, దేవుడు నన్ను క్షమించరు, మిమ్మల్ని పోగొట్టుకుని దానికి నేను కారణం అయి, సంపాదించిన ధనం ఎటూ నిలబడదు.

నాకు రాత ఉంటే అదే వస్తుంది, ఇచ్చే వాడు ఉంటే తెచ్చి మరీ ఇస్తారు, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అని బయట వ్యాపకాలు వ్యాపారం ఆలోచన పూర్తిగా మానిపించాను. లేకపోతే ఆ స్ధలాలు ఆనాడు కొని ఉంటే, ఈరోజు ఎంతో ఆస్ధి వచ్చేది?

ఆయన కూడా, నా కుమారుడు ముందు చూపుతో చెప్పాడు, అని గౌరవించి ఇంట్లో నే ఉన్నారు, ప్రశాంతముగా, నా సంపాదన చాలు లే అని గంజో పచ్చడికో.

* ఆ తర్వాత ఆరోగ్యం పూర్తిగా చెడితే, హైదరాబాద్ పెద్ద ప్రవేటు ఆసుపత్రిలో, ఇక తేవద్దు, నెల కన్నా ఎక్కువ బతకరు అని చెప్పారు. ఇంటికి వచ్చాక, తను కూడా ఇక వదిలేయి నన్ను, ఇక అనవసర ఖర్చు వద్దు అన్నారు.

లేదు, ఈరోజు నా ఉన్నత స్ధితి కి, మీరే కారణం. మన స్నేహితులు బంధువులు లో ఎవరికీ లేని భాగ్యం మహాత్తర అవకాశం, నాకు ప్రసాదించారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు అని, మద్రాసు ప్రవేటు ఆసుపత్రికి పంపాము. డాక్టరు తో అంతా చెప్పి, జాగ్రత్తగా నడిపిస్తే, 3 ఏళ్ళు అదనంగా బతికారు.

* అంటే తల్లి దండ్రలు ను, మంచి మనసు తో నిజాయితీగా నచ్చ చెప్పి ఒప్పిస్తే, వారికి మన మీద నమ్మకం ఉంటే, మన మాట వాళ్ళు కూడా, ప్రేమతో వింటారు, ఎక్కువ కాలం జీవిస్తారు కదా.

* అందుకే అనేది పిల్లల కు ఇవ్వాల్సింది కోట్లు కాదు, మంచి మనసు సంస్కారం ప్రేమ అభిమానం ఆప్యాయత. అదే మన ముదుసలి తనం లో, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మంచి తల్లి దండ్రల పెంపకం పిల్లల కు దీవెనలు, మంచి పిల్లల రక్షణ ముదుసలి తల్లి దండ్రులు కు ఊరట, తమ ఇన్నాళ్లు కష్టార్జితం కు.

* అమ్మ చిన్నప్పుడు మనకు సాక్స్ బూట్లు వేసింది. ఇప్పుడు మనమూ ఆ రెండు వేసి, మైలు దూరం రోజూ తిప్పతున్నాము, నా ముద్దు ల కూతురు, అయిన 75 అమ్మను, గత 7 ఏళ్లుగా.

* కూతురికి తల కి నలుపు రంగు వేస్తా, మనకు ముద్దు గా కనపడాలని, తను వద్దు అంటున్నా కూడా. మన తల తెల్లగా మెరిసినా, పట్టించుకోము పర్లేదు.

* మిగతా అన్ని విషయాలలో అమ్మ అంటే గౌరవిస్తా, కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం, చాలా కఠినంగా రాక్షసుడు లాగా ఉంటా. ఆ కఠినత్వమే అమ్మ ను కాపాడింది ఈనాడు వరకూ, 2014 లో ఇక దక్కదు అని పేరొందిన డాక్టర్ చెపితే కూడా.

అందుకనే ముదుసలి తల్లి దండ్రులను చూసుకోవడం ఒక కళ, అందరికీ సాధ్యం కాదు, ఓపిక ఉండదు. అందుకే ధైర్యముగా అన్నది, బాలు గారు మనతో అయితే, ఇంకా ఎక్కువ కాలం ఉండే వారు అని.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 29-Mar-2021, Upd Dt : 29-Mar-2021, Category : General
Views : 233 ( + More Social Media views ), Id : 1059 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : crores , money , children , son , daughter , samskaram , love , affection , old age , parents , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content