ముదుసలి అమ్మ నాన్న సేవ కే, ఇంట్లో దిక్కు లేదు. ఇంకా అత్త మామలు సేవ? పిల్లలను సంస్కారం గా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1958 General Articles and views 1,585,742; 97 తత్వాలు (Tatvaalu) and views 199,493.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

no way for own older parents seva at home, how can older in-laws seva? Children samskar?

ఏవండీ మా ముదుసలి అమ్మ నాన్న సేవ కే, మా ఇంట్లో దిక్కు లేదు. ఇంకా ముదుసలి అత్త మామలు అంటారేమిటి. వారు అంటే, అసలు పడదు, ఒళ్ళు మంట. ఎప్పుడూ గొడవలు, చాడీలు. ఇంక వారిని, ఇంట్లో పెట్టి ఎలా గౌరవముగా చూడాలి, ముదుసలి వయస్సు లో? ఇది ఒక వైపు సమస్య.

రెండో వైపు సమస్య, మా ఇంట్లోవాళ్ళు అంటే భాగస్వామి, ఇల్లు టీవీ కారు ఆస్తి ఆకాశం గ్రహాలు కొందామా లేదా 2 ఉద్యోగాలు చేద్దాము కంపెనీలు నడుపుదాం పార్టీలు చేద్దాం ఇతరుల సేవ చేద్దాం అంటున్నారు. కానీ, సొంత ముదుసలి అమ్మ నాన్న ను దగ్గర ఉంచి సేవ చేద్దాం అని, మా కమ్యూనిటీలో స్నేహితుల్లో బంధువుల్లో, ఒక్క సంస్కార కుటుంబం అనుకోవడం లేదు. వీరు పిల్లలను సంస్కారం గా పెంచగలరా?

There is no way for own older parents seva at home. You are mentioning about older in-laws seva? We don't get along and always issues and quarrels. And how to treat them with respect, put them at home, in old age? This is one side issue.

On the other side of the problem, people means partner in our family say lets buy house TV car property sky planets or lets work 2 jobs run companies have parties serve others, but not a single cultured family in our community thinks, lets keep our old mother and father at home and serve. Can they bring up children in a culture?

జవాబు - మీకు తెలిసిన అభిప్రాయాలు మీరు పంచుకోవచ్చు, తర్వాత కధనమునకు.

ఇదో అతి పెద్ద అంతర్జాతీయ కుటుంబ సమస్య, నిత్యం మండుతూనే ఉంటుంది, దీనికి ఉపశమనము లేదు, ఎందుకంటే, మనకు మానసిక నియంత్రణ లేదు, మానసిక బలహీనులం, అరిషడ్వర్గాల బానిసలం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ, దాదాపు అన్ని ఇళ్ళలో.

మనకు తల్లి దండ్రులు మీద, ఎటూ విశ్వసనీయత క్రుతజ్ఞతలు లేవు. ఇక కన్యాదానం చేసిన వారి మీద, ఎటూ ఉండవు. దానం తీసుకున్నప్పుడు, ఎంత క్రుతజ్ఞతలు మర్యాద ఉండాలి? ఎలాంటి వారిని, ఎలాంటి వారి నుంచి దానం తీసుకుంటున్నాము? ఎలాంటి వారికి, అమ్ముడుబోతున్నాము? ఎందుకు స్రుహ, జ్ఞానం, బుద్ది, ఆలోచన ఉండదు అప్పుడు? వారు అబద్దాలు చెపితే, మన వైపు జ్ఞానం అనుభవం విశ్వసనీయత క్రుతజ్ఞతలు గల వారూ ఒకరూ లేరా? ఉన్నాం, మనము మత్తులో వినలేదా?

ఇంకా విడ్డూరం, ఆ కన్యకే తన తల్లి దండ్రులకు సేవ చేద్దామని లేదు. గతములో కన్యాశుల్కం, ఇప్పుడు కట్నం. పశువును వారు అమ్ముతారు, ఆ పశువుని వీరు కొంటారు. ఇంక ఇద్దరిలో మానవత్వం మంచితనం జాలి దయ గుణం కు చోటు ఎక్కడ? పెళ్ళిళ్ళు దైవ నిర్ణయం అని కూడా అంటారు, మరి భాగస్వామి తో పాటుగా, అందులో అత్త మామ ఉండరా, గుణవంతులకు?

పాపం పెంచే 80 మందిలో మనము కూడా ఉండాలి అని, గర్వముగా పాలుపంచుకుంటూ, వీలైనంత నెయ్యి పోస్తూ, నిత్య అగ్నిహోత్రి రగిలిస్తూ ఉంటారు, ప్రతి ఇంటిలో. దీనికే సమయం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఇంక పిల్లల సంస్కారం గురించి అనుకోవడం అనవసరం.

చిత్రం ఏమిటి అంటే, వారు ఒప్పుకోరు పిల్లల సంస్కార పెంపకం లేదు అని నేడు, కానీ చివర అనాధాశ్రమములో లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్న తర్వాత, తాము చేసింది తప్పు ఒప్పుకోవచ్చు ఏమో లేదా అప్పటికీ ఆత్మద్రోహం చేసుకుంటూ అంతా బాగుంది, మా ఇష్టప్రకారమే ఒంటరిగా ఉన్నాము అని, (తమ కుసంస్కార పెంపకాన్ని దాస్తూ) అబద్దాలు తో మరుజన్మ లో మరింత ఇక్కట్లు.

ఎందుకంటే వీరు పశ్చాత్తాప పడరు, ప్రాయశ్చిత్తం చేసుకోరు. ఈ రెండూ లేని పూజలు, యాత్రలు జన్మలు, నిష్ప్రయోజనం.

పల్లె, పట్టణం, నగరం, మెట్రో, విదేశం, అంతరిక్షం, ఎక్కడైనా సరే ముఖ్యముగా 2 మహిళలకు (అలాగే పురుషులకు కూడా) అరిషడ్వర్గాలలో భాగమైన, ఈర్షా ద్వేషాలతో కుదరదు.

3 వ ప్రపంచ యుద్దం కన్నా, ఇది కనపడని, పెద్ద కుటుంబ యుద్దము, ప్రతి పెళ్ళి అయిన ఇంట్లో.

ప్రతి 10 ఇళ్ళలో కనీసం 6 ఇళ్ళు పైగా, ఏదో ఒక వైపు, ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతుంటారు, జీవితాంతము. అసలు సమస్య తెలుసుకోరు, ఒప్పుకోరు, సర్దుకోరు, ఇరువైపులా. ఈ విషయములో కుల మత బీద గొప్ప బేధాలు లేవు, అంతా ఆ తాను ముక్కలే, మా స్వార్ధం, అంతే.

సరే మగవారు అంటే ముందే అరిషడ్వర్గాల బానిసలు అని, ఆదిశక్తి గా సహన శీలిగా త్రిమూర్తులకే పెద్దగా, మహిళలను గౌరవించారు, మన పురాణాల్లో.

ఎందుకంటే, పిల్లలను అంటే తర్వాత తరాన్ని పెంచడం, చాలా పెద్ద బాధ్యత. కానీ అందరూ పిల్లల పెంపకాన్ని పార్ట్ టైం మొక్కుబడి సేవ గా చేసి, ఇతర పనుల్లో బిజీ అయ్యారు.

కానీ కలియుగములో, ఒక మహిళను చూస్తే ఇంకో మహిళకు గిట్టదు, అది అమ్మ అయినా, అత్త అయినా. కన్న తల్లి నే, నువ్వు ఏమి చేసావు మాకు అనే వారు ఉన్నారు. ఎన్ని చేసినా నిర్దయగా దూరంగా ఉంచే వారు ఉన్నారు.

మీ చూట్టూ ఉన్నవారిని గమనించండి అడగండి. ఎంత మంది మహిళలు, తమంతట తాము, మా అన్న దమ్ములు అక్క చెల్లెళ్ళు లో, మాకు ఉన్నత స్థానం ఉంది కాబట్టి, మంచి ఆస్తులు ఉద్యోగం సంపాదన హోదా పదవి ఉంది కాబట్టి, మా ముదుసలి అమ్మ ను మా అత్తను మా ఇంట్లో పెట్టుకుని, దైవ సేవ లాగా చేస్తున్నాము అంటారేమో?

వారు అనక పోగా, మనము అడిగినా, అబ్బో సంఘ సేవకులు బయలు దేరారు. మాకు తెలీదా మా ముదుసలి వారిని, ఏ విధముగా గౌరవించాలో/ హింసించాలో/ దూరంగా ఉంచాలో/ సౌకర్యాలు వైద్యం ఇవ్వాలో అని ఎదురు తగవులు. ఇంకా వీరు సంఘాలను, పార్టీలను, ఉద్యోగాలను, కంపనీలను, సంస్కారం గా ఏలతారా? పిల్లలను సంస్కారం గా పెంచుతారా?

మూలాలు ఆలోచన చెయ్యండి. అమ్మ, కూతురు, అత్త ఎక్కడ సమస్యలు బయలు దేరుతున్నాయో? ఒకరికి 20 ఏళ్ళ క్రితం పెళ్ళి అయ్యింది అనుకోండి.

1. వీరికి తగువు, పెళ్ళికి ముందు ఉందా? అంటే ముందు మాట్లాడుకునేటప్పుడు, లగ్గాలు పెట్టుకునేటప్పుడు? ఇతర పెళ్ళి పనులప్పుడు? లేదు కదా, ఉంటే, అప్పుడే పెళ్ళి ఆగిపోతుంది.

2. పోనీ పెళ్ళి జరిగేటప్పుడు ఉందా? ఆ సంబరాలు, ఫోటోలు, కేరింతలు, సోషల్ మీడియాలో షేరింగ్ లు కేరింగ్ లు. ఇప్పుడు సమస్య ఉందా? లేదు కదా, ఉంటే, అప్పుడే పెళ్ళి ఆగిపోతుంది.

3. పెళ్ళి తర్వాత నుంచి, పోరు ప్రారంభం. అంతేనా? ఎందుకు?

ఎందుకంటే, మొదటి 2 దశలలో, మనము పూర్తిగా మోహము లో ఉన్నాము, వారు ఎన్ని చేసినా, ఎన్ని అన్నా, మనము సర్ధుకుని, ఆ ఆస్తి ఉద్యోగం వీసా ఆనందం అన్ని పొందాలని, బ్రమలలో వ్యామోహములో అంటే అరిషడ్వర్గాల బానిసత్వములో ఉన్నాము. ఎందుకు మనది గుణ పెళ్ళి కాదు? పెళ్ళి తర్వాత, ఆనందం అంచులు చూసాక, అంతా మట్టే అని తెలిసాక, బ్రమలు వీడి, అసలు రంగులు, మనవి కూడా బయట పడుతున్నాయి.

కాబట్టి తప్పు అంతా మనదే, అత్త మామ బుద్ది అలాగే ఉంది పెళ్ళి కి ముందు తర్వాత, అది తప్పు కానీ ఒప్పు కానీ. మన బుద్ది ముందు మోహము ఆశ దురాశ లో ఉంది, ఇప్పుడు మామూలుగా ఉంది. కాబట్టి మొదటి తప్పుడు వారము మనమే, మనము ఎటూ ఒప్పుకోము, అది పక్కన పెడదాము.

1. అత్త మామ బుద్ది తప్పుడు ది అనుకుందాము కాసేపు, ఉదాహరణకు 100 రూపాయలు అనుకుందాము లెక్క కోసం. మరి వారి పిల్లలు అంటే, మన భాగస్వామి బుద్ది కూడా, వారి లో సగం లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, జీన్స్ ప్రకారం.

అంటే మన భాగస్వామి బుద్ది కూడా, 50 నుంచి 150 రూపాయల, తప్పుడు బుద్దే కదా? అంటే వారి తల్లి దండ్రుల కన్న, కాస్త తక్కువ లేదా ఎక్కువ లేదా సమానం తప్పుడు బుద్దే ఉంటుంది.

2. అత్త మామ తో సర్దుకోలేని మనం, వారి బిడ్డ అంటే మన భాగస్వామితో మాత్రం ఎలా సర్ధుకుంటున్నాము? ఎలా కాపురం చేస్తున్నాము? ఎలా పిల్లల్ని కన్నాము? ఎలా వారి మనుమళ్ళను పెంచుతున్నాము? అంటే మనకు సిగ్గు శరం ఆత్మాభిమానం లేవా? స్తిర అభిప్రాయం లేవా? సమానత్వం లేవా?

లేవు, మన బుద్ది మంచిది కాదు. ఎందుకంటే, మనము భాగస్వామితో, ధనం సౌకర్యాలు అవసరం అవకాశం కోసం సర్దుబాటు చేసుకున్నాము, ఆత్మ ద్రోహం చేసుకుంటూ.

ఇంక మనకు అత్త మామ గురించి, తప్పులు పట్టే హక్కు లేదు. ఉంటే, వారి బిడ్డకు అంటే భాగస్వామికి దూరముగా ఉండాలి. వీరితో సర్ధుబాటు చేసుకున్నప్పుడు, వారి తల్లి దండ్రులతోనూ సర్ధుబాటు చేసుకోవాలి, మనము నీతి నిజాయితీ గల దైవ భక్తుల మైతే. 2 నాల్కల వారమైతే మన ఇష్టము.

అంటే, ఈ తగవులు అన్నిటికీ కారణం, మనకు మానసిక బలం లేదు, ఒకే మాట బాట లేదు, దేవునిపై త్రికరణ శుద్ది లేదు. అంటే మన చివరి జీవితము, చాలా దుర్భరముగా ఉంటుంది.

ఎందుకంటే, ఇలాంటి మలినమైన మనసుతో, మనము కుటుంబ సంస్కారాన్ని పిల్లల సంస్కారాన్ని పెంచలేము, ఆ అర్హత మనకు లేదు, రాదు. మనము మన వంశము, అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు బానిసలై, ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని పదవులు అధికారాలు ఆస్తులు ఉన్నా, మన పతనము ఎవరూ కాపాడలేరు. మన స్వస్వరూపము మనము ఒప్పుకోము, మార్చుకోము. ఆత్మ జ్ఞానం మనకు లేదు, రాదు.

ఇప్పుడుకైనా, సరి చేసుకుందాం, తప్పు దిద్దు కుందాం, తప్పులు ఒప్పుకుందాము, పశ్చాత్తపం తో ప్రాయశ్చిత్తం చేసుకుందాము. బతికి ఉన్న పెద్దల సేవ చెద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,585,742; 97 తత్వాలు (Tatvaalu) and views 199,493
Dt : 10-Apr-2023, Upd Dt : 10-Apr-2023, Category : General
Views : 268 ( + More Social Media views ), Id : 1746 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : way , older , parents , seva , home , inlaws , children , samskar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content