భార్యా పిల్లల దగ్గర రాని పబ్లిసిటీ మాట, ఏం పాపం, తల్లి దండ్రుల పాద సేవ ఫోటోలు దగ్గర వచ్చిందా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1544 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1579 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అమ్మ రోజూ మైలు నడక ఫోటో అది. ఓ బస్సు అంత పొడవునా ఉన్న, సన్నటి ఎత్తు పై అమ్మ జాగ్రత్తగా నడవాలి, ఇటు నా చెయ్యి అటు కర్ర సాయంతో. కాలు బలం పెరగడానికి, బాలన్స్ నిలవడానికి, తూలుతూ ఉంటుంది అని తెలుసు కదా. సైక్లింగ్ చెయ్యమంటే వద్దు అంటారు. అందుకే ఇది. అదుపు తప్పితే కష్టం. చిన్న ఎత్తు కాబట్టి, ఆపవచ్చు.

సరే గానీ అల్లుడు, ఎలా ఉన్నావు, పిల్లలు బాగున్నారా? ఏదీ అమ్మ నాన్న కు, కాళ్ళు కడిగినట్లు ఫోటోలు రాలేదు ఫేస్బుక్ వాట్సాప్ ల లో, పది రోజుల నుంచి, కనీసం ఫోన్ చేసి అన్నా మాట్లాడావా ఈ వారము?

లేదు మామయ్య, నాకు పెద్దగా పబ్లిసిటీ ఇచ్చుకోవడం, అంటే నచ్చదు, మనది అంతా సింపుల్.

అంటే అమ్మ వాళ్ళ తో మాట్లాడ లేను ఇప్పుడు అవసరం లేదు కాబట్టి అనా అర్థం లేక ఇప్పుడు అమ్మ కాళ్ళు పట్టుకునే సమయం తీరిక లేదు, జీవిత భాగస్వామి సేవ లోనే, సరిపోతుంది అనా అర్థం, వివరముగా చెప్పు అల్లుడు. భార్య వచ్చాక, తల్లి అల్లము అంటారు లే సామెత ఉంది.

నాకు అలా సేవ చేసాను అని, పదిమంది కి చూపించుకోవడం ఇష్టం ఉండదు అని చెప్పాగదా మామయ్యా నవ్వుతూ.

ఇందాక చెప్పినదీ అదే, పబ్లిసిటీ అన్నా, పదిమంది కి చూపించుకోవడం అన్నా ఒకటే, అసలు విషయం దాచి, పక్క విషయం చెపుతున్నావు. పబ్లిసిటీ రాజకీయ నాయకులు మరియు సినిమా వాళ్ళకు కావాలి, ఓట్లు లేదా ధనం వస్తుంది కదా.

మరి మేము అమ్మా నాన్న ల కు, కాళ్ళు కడిగిన ఫోటోలు, ఆరేళ్ళ గా అందరికీ పంపి, పబ్లిసిటీ ఇస్తే, జనం మా మాయలో పడి, 6 కోట్లు ఇచ్చారు, టీవీ పేపర్లో విపరీతంగా రాశారు, చూడలేదా? నీకు తెలీదా? నీకు వద్దా మరి ఆ 6 కోట్లు, ఆ టీవీ పేపరు పొగడ్తలు అల్లుడూ? అందులో, సాయంత్రము వచ్చి, ఒక కోటి తీసుకెళ్ళు.

ఊరుకో మామయ్య, మీ జోకులు, మరీ పిచ్చి వాడిని చేసి చెపుతున్నారు. ఏ పనికి మాలిన వాడైనా, ఇతరుల తల్లి దండ్రుల పాద సేవ చేసిన ఫోటో చూసి, కోట్లు డబ్బు ఇస్తారా? టీవీ పేపర్లో వేస్తారా? వాళ్ళ తల్లి దండ్రుల సేవ వారి ఇష్టం, అందులో గొప్ప ఏముంది? మామూలు విషయమే గదా.

అమ్మయ్య, ఇప్పుడు సరైన దోవలో, సరిగ్గా వాస్తవం చెప్పావు. నీలాంటి వారు మన చుట్టూ, చాలా మంది ఉన్నారు. తమకో న్యాయం ఇతరులోకో న్యాయం చెపుతారు.

ఇతరుల తల్లి దండ్రుల సేవల ఫోటో లో గొప్పతనం ఏముంది అన్నావు. కరెక్ట్. అంటే అందులో పబ్లిసిటీ లేదనే కదా. నీ తల్లి దండ్రుల పాద పూజ ఫోటో దగ్గర, నువ్వే పబ్లిసిటీ అన్నావు మరి ఇందాక. దీనినే రజో గుణ, అవ లక్షణం అంటారు.

అంటే తమ తల్లి దండ్రుల సేవ తాము ఎటూ చేయరు, వారిని మనస్పూర్తిగా గౌరవించరు. ఇతరులు, ఆదర్శంగా చేసి చూపిస్తున్న, గేళి చేస్తారు. తమ తల్లి దండ్రుల కు లేనిది, తాము చేయలేనిది, ఇంకొకరు చేయకూడదు అని వీరి భావన.

ఇక పబ్లిసిటీ అన్నావు, మొన్న మీ కుటుంబం మొత్తం, ఏదో నగరం చూడడానికి వెళ్లి, ఫోటోలు ఫేస్బుక్ వాట్సాప్ ల లో నింపేసావు. అలాగే మీ పిల్లల పుట్టినరోజు ఫోటోలు, దేవుని పూజ ఫోటోలు వీడియో ల తో, జనాన్ని చంపేసావు అదరగొట్టావు. మరి ఈ పది మంది పబ్లిసిటి వలన, ఏమైనా వచ్చిందా లాభము నీకు?

మరి వీటన్నింటి దగ్గర, వీరి దగ్గర రాని పబ్లిసిటీ మాట, ఏం పాపం చేసారని, నీ కన్న తల్లి దండ్రుల పాద సేవ దగ్గర మరియు ఫోటోలు దగ్గర వచ్చిందా?

అక్కడ విషయము పబ్లిసిటీ కాదు, నీ తల్లి తండ్రులు అంటే నీకున్న అగౌరవం కృతఘ్నతలు చిన్నతనం, నీ చేత అలా మాట్లాడిస్తున్నాయి, నీ తప్పు ఒప్పకోనీయక.

తల్లి తండ్రులు సేవ మన బాధ్యత, కర్తవ్యం. దానికి, బయట వారి పొగడ్తలు కోట్లు కాదు కావలసింది, ఎవరూ ఎటూ ఇవ్వరు, సమర్దించరు వారి గుణం ను బట్టి.

అది కేవలము మనలో ఉండే నిబద్ధత మాత్రమే. ఇంకొక సాత్వికులు కు ఆనందం, స్పూర్తి ని ఇవ్వాలి, అన్న చిన్న ఉడుత ప్రయత్నం. అది చూసి ఇంకొంతమంది మొదలు పెట్టి చేస్తుంటే, వారి తల్లిదండ్రులు కూడా సంతోషం చెందాలి.

రామానుజులు వారు గోపురం ఎక్కి నారాయణ మంత్రం పెద్దగా చదివారు, అది ఊరంతా బాగుండాలి అని మాత్రమే. ఆ ప్రయత్నము పబ్లిసిటీ కోసం కాదు. కానీ ఇప్పుడు అదే అంటారు నీ లాంటి వాళ్ళు.

నీ తల్లి దండ్రుల మీద నీకు బాధ్యత, ప్రేమ లేకపోతే అదే ధైర్యంగా చెప్పు, నాకు చేయడం ఇష్టం లేదు, ఇంకొకరి కి ఎలా పంపను ఫోటో తీసి అని. మా ఆవిడకు నచ్చదు కాబట్టి చేయను అని. అది మీ ఇష్టం, మీ పెద్దలు నేర్పిన సంస్కారం. ఈ చాతగాని మాటలు కట్టిపెట్టు.

నిజమే మామయ్య, నేను ఫేస్బుక్ వాట్సాప్ ల లో, నా కుటుంబం లేదా పిల్లల పుట్టినరోజులు టూర్లు పూజల పబ్లిసిటీ అన్నా మానాలి. లేదా నా తల్లి దండ్రుల సేవ కూడా తప్పనిసరిగా పెట్టాలి.

నన్ను పెంచి చదివించి పెద్ద చేసిన వారిని, అవసరము తీరాక, నేనే తక్కువ చేసి, చిన్న చూపు చూడకుండా, ఉండాలి. రేపు నా పిల్లలు, అలాగే నన్ను అవమానిస్తారు. కరోనా టైంలో కూడా మాలాంటి వారికి, బుద్ధి రాకపోతే ఇంక ఎప్పటికీ రాదు. మరలా ఇంకో కరోనా అన్న వస్తే తప్ప.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1579 General Articles, 54 Tatvaalu
Dt : 11-May-2020, Upd Dt : 11-May-2020, Category : General
Views : 838 ( + More Social Media views ), Id : 540 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : no publicity word , wife kids photos sharing , but for parents foot service
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content