ఆదాయం లేకపోతే, ఎవరన్నా సహాయము చేసారా? నిస్వార్ధ, ఆధ్యాత్మిక వాదుల సంభాషణ, ధన సహాయం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,291; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోతే, ఎవరన్నా సహాయము చేసారా? నిస్వార్ధ, ఆధ్యాత్మిక వాదుల సంభాషణ, ధన సహాయం ఎలా ఉంటుందో అందరికీ చెప్పండి, నేర్చుకుంటాము?*

జవాబు - దేవుని పట్టుకుని ఉన్నవాడికి, ఇతరులను చెయ్యి చాచకుండానే, కనీసం పచ్చడి మెతుకులు, గంజి నీరు, చాప నిద్ర ఎటూ దొరుకుతుంది. ఆధ్యాత్మిక మనశ్శాంతి మెండుగా ఉంటుంది. దేవుడు పక్కనే ఉంటాడు, మన కష్టాలకు తోడుగా. అవి మనము 20 ఏళ్ళు పై గా చేస్తున్న పనే. అందరమూ తప్పులు చేస్తాము, కానీ మరలా అదే తప్పు 2 వ సారి చేయని వాడే బాధ్యత గల మనిషి, అని గోపీ రాముతో ఇలా చెప్పసాగాడు.

ఇది వెనకటి పాత కాలము కాదు, ఎవరో మనసున్న ధనవంతులు వచ్చి, మా పాప ప్రక్షాళనకైనా, మీకు ఉండటానికి మా 3 ఇళ్ళు లో ఓ ఇల్లు, ఇతర సౌకర్యాలు ఇచ్చి, మీ మంచి పనులు యధాతధముగా కొనసాగించాలి, ధనము కోసం వెతుక్కోకుండా అని అనలేరు.

కాబట్టి ఆదాయం ఉందా లేదా అన్నది, మనలాంటి వారిని కదిలించదు, మన ధర్మ పనులు ఆపకూడదు. అందరికీ తెలియచెప్పాలి ప్రతి వారం. ఎందుకంటే, ఎన్ని ఉన్నా, అందరికన్నా అతి తక్కువ పరిమితి సౌకర్యాలలో, శివయ్య లాగా నివసిస్తాము. అదే శివోపాసన. అదే తెలుగు గురువులు, మన బ్రహ్మం, వేమన, రాఘవేంద్ర చెప్పినది.

అతి శక్తి వంతుడైన, శివయ్యకు ఏముంది, మంచు పర్వతాల కైలాసములో? లేదా మన అంతిమ శ్మసాన వాటికలో? ఒంటి మీద భస్మ, 4 పాములు తప్ప. అదే చిన్మయానందం. శివుడు కష్టాలలో ఉంటే, విష్ణువు లాంటి దేవతలు వస్తారు అని నమ్మకం. అలాగే మనకు వచ్చారు వివిధ రూపాలలో వివిధ మాటలలో.

రాక్షస అంశాలతో భావాలతో వచ్చిన వారికి, వారి ఇంటి బాధ్యతలు గుర్తు చేసి, ఇది వ్యాపార సహాయము కాదు, అని సున్నితముగా తిరస్కరించాము. మన కష్టాలు మనమే ఎదుర్కుంటాము, పర్లేదు అని చెప్పాము. చేత గాకపోతే, ఇంట్లో ఉండి పచ్చడి తిని ఉంటాము అని చెప్పాము.

ఇంకొకరు, మనస్పూర్తిగా నిజాయితీగా, ప్రయత్నము చేసి, సంవత్సరము పాటుగా, ఓడి గెలిచారు. పెద్ద కంపెనీల ఫోన్ లు వచ్చాయి. వారు ఓడినా, ఇప్పుడు మనము చేస్తున్న అన్ని మంచి పనుల ఫలితాలు లో, వారికి అలాగే గతములో సహాయము చేసిన వారికి, దైవ భాగం తనంతట తానే వెళుతుంది. వారికి వెంటనే ప్రమోషన్, జీతం పెంపు. వారితో పాటు ఇంకొకరుకు కూడా.

మంచి మనసుతో మనము ప్రయత్నము చేస్తే, ఫలితము కూడా ఉంటుంది కదా, నేడో రేపో?

ఇంకొంతమంది వారే, స్వయముగా నోరు తెరిచి అడిగారు. వారిని, జీవితాంతము గుర్తు పెట్టుకుంటాము.

* వారిలో ఒకరు ఇలా అడిగారు, లక్షకు పైగా, ఇస్తాము చేదోడు వాదోడు గా, ప్రస్తుత పరిస్తితి గట్టెక్కినదాకా అని.

** నవ్వి, ఇతరుల ముందు తలవంచి, చేయి చాచి తీసుకోవడం తప్పు కదా అన్నాము.

* తిరుపతి దేవునికి ఇవ్వడము, ఆయనకు మహలక్ష్మి లేకనా అన్నారు. ఆయనకు చిన్నతనమా, అది చేయి చాచడం అవుతుందా అన్నారు.

** మరి ఇంత ఖర్చుకు, అలాగే వైద్యం కు, అది ఏ మూలకైనా, సరిపోతుందా అన్నాము.

* చంద్రునికో నూలు పోగు, మా లాంటి వారు 4 గురు, తోడు వస్తారు అన్నారు.

** సరే రేపు తిరిగి ఇవ్వకపోతే, మేము మోసము చేస్తే, ఏమి చేస్తావు అన్నాము.

* అది ఇంకా మంచిది, దేవుని హుండీ లో వేసాము అని అనుకుంటాము, అది ఇంకా పుణ్యము అన్నారు. అసలు వెనక్కి ఇవ్వద్దు అన్నారు. మీరు తీసుకోరని, చేబదులు అని చెప్పాను.

** చాలా సంతోషము. కష్టజీవివి, మీ మనసు పనులు తెలుసు. ధన్యవాదములు, మీలో చాలా మార్పు వచ్చింది, ఇన్నాళ్ళ మన కలయిక మాటలలో, ఆ మార్పే మనకు, ఆ శివయ్యకు కావలసింది - కేవలము స్వచ్చమైన త్యాగ మనసు, మానసిక సమర్పణ, తనకు తానే సమర్పించుకోవడం, అదే మానసిక నైవేద్యం. ఈనాడు మాకు అవసరము లేదు, ఎలాగో నెట్టుకు వస్తాము. భవిష్యత్ లో నిజముగా అంత కష్టం వస్తే ముందు మీకే చెపుతాను అని చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పినాము.

ఇలాంటి వారికి, మనము ఎంతో రుణ పడి ఉన్నాము. వారికి ఎన్న కష్టములు వచ్చినా, అవి అరిషడ్వర్గాల బానిసత్వ కష్టాలు కాకుంటే, తప్పక మనము సహాయము చేద్దాము.

అదే భగవద్గీత చెప్పినది, నువ్వు నీళ్ళు పూలు ఆకు కాయ ఇవ్వు చాలు, కానీ త్రికరణ శుద్ది గా ఇవ్వు. అంతే గానీ ఆడంబరాలతో కపటాలతో నటనలతో మోసముతో ఎంత ఇచ్చినా, దాని విలువ ఫలితము శూన్యము.

If no income for more than 3 years, anyone helped? tell how conversation of selfless, spiritual advocates, financial aid  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,291; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877
Dt : 22-Aug-2022, Upd Dt : 22-Aug-2022, Category : General
Views : 479 ( + More Social Media views ), Id : 1503 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : income , helped , conversation , selfless , spiritual , advocates , financial , aid
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content