6 నెలల వీసా, 4 మెతుకులు పెట్టడానికి లేదు, ఏవో సాకులు, వంతులు - అమ్మా నాన్న లు దూరంగా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,132; 104 తత్వాలు (Tatvaalu) and views 225,892.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనల్ని, అమ్మా నాన్న లు కనీసం 20 ఏళ్ళు దగ్గర ఉంచుకుని, అన్ని సమకూర్చి చదివించి, ప్రపంచంలో కి హాయిగా బతకమని వదులుతూ ఉన్నారు, స్వేచ్ఛ గా ఆనందముగా ఎగరమని.

పుట్టిన మొదటి పదేళ్లు ఎంత ముఖ్యమైనవో, మనల్ని కంటికి రెప్పలా కాపాడకపోతే, ఏ రోడ్డు న చేయి చాచి అడుక్కుతింటూ గాలికి తిరుగుతూ ఉండేవారమో, మనిషి జన్మ ఎత్తి కృతజ్ఞతలు విశ్వసనీయత మనసు ఉన్న, మనిషి కి పుట్టిన ప్రతి అన్నము తింటున్న మనిషి కి తెలుసు.

నిర్లక్ష్యము బాధ్యతారాహిత్యముతో, ఏ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు నాయనమ్మ అమ్మమ్మ ల దగ్గర, అనాధలుగా దిక్కు లేని వారిగా జీవశ్చవాలుగా వదలకుండా, మన అమ్మా నాన్న లే మనల్ని దగ్గర ఉంచుకుని, గంజో నీళ్ళో పోసి, తమ కున్నదే పెట్టి, తమతో పాటే తిరుపతి, వరంగల్, హైదరాబాద్, సినిమా, షికార్లు, దేవాలయాలు తిప్పారు. ఎక్కడ కూడా, తేడా విచక్షణ లు చూపలేదు, దూరంగా ఉంచలేదు. తమ సుఖ సంతోషాలు మాత్రమే చూసుకోలేదు, ఎన్నడూ స్వార్థ పరులు లాగా ఉండలేదు.

కృతఘ్నుల ము అయిన మనము, వారికి 60 వచ్చిన తర్వాత లేదా తూలి పడే వయసులో, ప్రపంచంలో కి ఒంటరిగా అనాధలుగా వదిలేస్తున్నాము. వారు దగ్గర ఉంచుకుని చూపించిన ప్రేమలో, కనీసం కొంత కూడా, దగ్గర ఒక సంవత్సరం పెట్టుకుని చూపించడం లేదు, మన సౌకర్యాలు సుఖాలు వారికి కూడా కల్పిస్తూ.

ఎందుకంటే మనకు స్వార్థం. ఇంత చేసిన తల్లి దండ్రులు నే, ఎవరో దగ్గర అది బయట వారైనా లేదా బంధువులు అయినా సరే, దూరంగా తర్వాత వదిలేస్తున్నాము. నీతి లేని మనము, ఇక మనం సమాజానికి చేసే సేవ, చెప్పే మంచి ఏముంది?

వయస్సు 60 కి ముందు పిల్లల ను పెంచడానికి, మన పనికి, అవసరాలకు వాడుకున్నాము. ఇదేనా విశ్వసనీయత, కృతజ్ఞత, జాలి, దయ, మాతృ పితృ దేవోభవ అంటే ఆచరణలో? మరలా ఇలాంటి వారే, ప్రపంచంలో పాపం ఎక్కువ అయిందండీ, అని ఊకదంపుడు ఉపన్యాసాలు, కదూ?

పోనీ మన తల్లి దండ్రులు తప్పుడు వారు, మనలాంటి పనికిరాని వారిని కన్నారు అని, శిక్షలు వేసి, దూరంగా వదిలేశాము బంధువులు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు తో లేదా అనాధాశ్రమంలో అనుకుంటే, మరి వారికంటే పాపిష్టి వారమైన మన బ్రతుకులు ఏమిటి, వచ్చే భవిష్యత్తు ముదుసలి తనంలో?

కాలూ చేయి కదలనప్పుడూ, మన కోట్లు పేరు ప్రఖ్యాతులు పదవులు అధికారం, మనకు కూడు పెట్టవని, మన పెంపక సంస్కారం మాత్రమే, మనకు అండగా ఉంటుంది అని, మన లాంటి మూర్ఖులు కి, చివరలో అనాధాశ్రమంలో అనాధలుగా అయినా, ఎక్కుతుందా మనసు బుద్ధి కి? ఇంక మనకు మోక్షం వస్తుందా? దైవ పూజ ఫలితం ఉంటుందా?

కోట్లు ఉన్న ఐయేఎస్ ఆఫీసర్లు, నాయకులు అనాధలుగా అనాధాశ్రమంలో ఉన్నారు మొన్న వీడియోలో చూసాము కదా, తమ ధన మోహ నిర్లక్ష్య బాధ్యత లేని పెంపకాన్ని, తమ పేరెంట్స్ కి తాము చేసిన అన్యాయాన్ని, ఒప్పకోలేకపోతున్నారు, 70 ఏళ్ల కు కూడా.

మనం పది తప్పులు చేస్తే , మన పిల్లలు వంద తప్పులు చేస్తారు. ఇది కలియుగం, పాపం పెంచుతుంది మనమే. శిక్షలు మనకే. ఓం కరోనా గురవేనమః.

ఇంకా విచిత్రం ఏమిటి అంటే, ముందు చూపు లేకుండా అవకాశవాదముతో, ధనం అందం ఉద్యోగం కోసం చేసుకున్న జీవిత భాగస్వామి కోసం, 60 దాటిన వారిని, కనీసం 6 నెలలు కూడా ఆ ముదుసలి వారిని, తమతో బెంగుళూరు, హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీలో ఉంచడానికి ఇష్టపడటం లేదు. ధనం అధికారం అవకాశం ఉన్న వారే ఇలా కృతఘ్నులు గా ఉంటున్నారు, సమాజం వారినే గౌరవిస్తూ ఉంది.

ఇక 6 నెలల విదేశీ వీసాకు కూడా ఒప్పుకోవడం లేదు, తమకు అంతస్థు అవకాశం ఉన్నా, తెచ్చి తమతో పెట్టుకోవడానికి 4 మెతుకులు పెట్టడానికి. ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఒకవేళ తోబుట్టువులు సోదరులు విదేశాల్లో ఉంటే, వంతులు వేసుకుంటున్నారు, మీరే చేయించాలి వీసాలు మరియు గ్రీన్ కార్డులు అని.

ఒకవేళ ఇంకొకరు వీసా గ్రీన్ కార్డ్ చేయిస్తే, ఆ బరువు బాధ్యత అంతా వారి నెత్తిన పడుతుంది లే, మనకు ఎందుకు వచ్చిన తలనొప్పి అని అందరి భయం. ఇక్కడ కు వచ్చిన తర్వాత, మనం ఓ పది రోజులు నటనా కాలక్షేపం చేయవచ్చు, వండకుండా వారి చేత చేపించవచ్చు లేదా హోటల్ తిండి పెట్టవచ్చు లేదా ఇంట్లో వండుకు చావమని మనం బయట తినవచ్చు, లేకపోతే తెచ్చిన వారి ఇంటికి తరమవచ్చు అన్న, నిర్లక్ష్య స్వార్థ భావనతో గమ్ముగా ఉంటున్నారు.

కావలని పేరెంట్స్ ని భారతం నుంచి తెచ్చుకొని, వారిని సరిగ్గ చూడలేక, ఒద్దికతో సర్దుకోలేక, గొడవలు పడి, దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేక, వేరే బంధువుల ఇంటికి పంపి కూడా, మళ్లీ తప్పు వాళ్లదే అని, అందరికి ప్రచారం చేసే మహానుభావులు ఉన్నారు.

ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు బండలు గా గమ్ముగా ఉండి, ఇంకొంతమంది కరోనా తర్వాత, పేరెంట్స్ బతికి ఉంటే, ఓ 6 నెలలు అలా తెచ్చి అలా, మమ అనిపిద్దాములే అని ప్లాన్ చేస్తున్నారు. అంటే, అది ఎప్పుడు జరుగుతుందో లేదో కూడా వారికి తెలీదు.

ఇలాంటి కధలు ఎన్నో. మన ఊళ్ళో నూ, ఈ విచిత్రాలు కోకొల్లలు.

మన కొమ్మలు అంటే పుట్టిన పిల్లలను మనమే సంస్కారహీనులు గా పాడు చేస్తూ, మన మహా వృక్షాలను అంటే మనల్ని కన్నవారిని మనమే అవమానిస్తూ, కరుడుగట్టిన మనసనే గొడ్డలితో నరికేస్తున్నాము. పున్నామ నరకము తప్పించడము ఏమో గాని, బతికుండగానే నరకయాతన చూపిస్తున్నాము, ఒంటరి అనాధలు గా చేసి, దూరముగా విడిచి.

అలాంటి పిల్లల ను కంటే ఎంత కనకపోతే ఎంత? చివరలో పోయేటప్పుడు వచ్చి, సమాజం ఎదురు నటిస్తూ, వీరు తలకొరివి నిప్పు పెట్టితే ఎంత, పెట్టకపోతే ఎంత? మనం పక్కన లేకుండా మన సౌకర్యాలు అనుభవించకుండా మన చేయి పట్టి ప్రేమ అభిమానం ఆప్యాయత అందకుండా, వారు దిక్కుమాలిన చావు చచ్చాక ఒంటరిగా అనాధలుగా? పాపం తప్ప, పుణ్యం వస్తుందా?

ఆలోచన చేయండి మనసు తో. ఎందుకంటే, తర్వాత వరుసలో, మనమే ఆ ఇబ్బందులు పడాలి. ఇదేనా, వంశోద్ధారణ అంటే?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,132; 104 తత్వాలు (Tatvaalu) and views 225,892
Dt : 21-Jan-2021, Upd Dt : 21-Jan-2021, Category : General
Views : 833 ( + More Social Media views ), Id : 934 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : no , 6 months visa , 4 metukulu , food , some excuses , divisions , away , old parents , mom , dad
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content