నిత్య కల్యాణం పచ్చ తోరణం - ఎవరికి వారే యమునా తీరే - చలం, కృష్ణ కుమారి, రామకృష్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2134 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2169 General Articles and views 2,200,454; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన చుట్టూ ఉండే జీవితాల కధే ఈ పాట - ఎవరికి వారే, యమునా తీరే, ఇక లేనేలేరోయీ, నా అనువారే. అవసరం అవకాశం ఉన్నంతవరకు, హాయి హాయి, ఇంక వద్దు అవసరం ఉపయోగం లేదు అనుకుంటే బాయ్ బాయ్ అంతే.

మంచిపనులు చేయువారు, వంచనపాలు, కష్టాలు కడగళ్ళు. వళ్ళు వంచనట్టి వారికే, కలుగును మేలు, మాటలతో మాయచేసి, అరిషడ్వర్గాల బానిసలను ఆకర్షిస్తారు.

ఈ పెళ్ళి వారి సంబరమూ ఒక వీధి మొగదల, ఒక ఇల్లు శోకమందు మునిగె ఇంకో వీధికవతల. కారులోన పోవునొకడు, సుఖము వాని సొమ్ము, కాలినడక సాగువాని, కన్నులలో దుమ్ము, ఇలాంటివి ఎన్నో రోజూ చూస్తూ ఉంటాము.

నూలుతెగిన గాలిపటం, వాలునెక్కడో, మనకు తెలీదు. అలాగే నీ నొసటి రాత, చెరిగి, నీవు తేలుటెక్కడో, ఇదీ మనకు తెలీదు.

నిత్య కళ్యాణం పచ్చ తోరణం, 1960 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా ద్వారా, రామకృష్ణ నటుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ తన ప్రసాద్ ప్రొడక్షన్స్ బేనర్‌పై అశోక్‌కుమార్, బీనారాయ్, రెహమాన్, తనూజ నటీనటులుగా దాదీమా గా హిందీలో 1966లో నిర్మించాడు.

ఎవరికి వారే.., యమునా తీరే. 2
ఇక లేనే లే.రో.యీ.., నా.. అనువారే 2

మంచిపనులు చేయువారు, వంచనపాలు.
వళ్ళు వంచనట్టి వారికే, కలుగును మేలు
కొంచెమైన నీతిలేని, కూళ గొప్పవాడా?
ప్రపంచమింక దేవుడైన, మార్చగలేడా..? ||ఎవరికి వారే||

కారులోన పోవునొకడు, సుఖము వాని సొమ్ము.. 2
కాలినడక సాగువాని, కన్నులలో దుమ్ము
ఈ పెళ్ళి వారి సంబరమూ, వీధి మొగదల..
ఒక ఇల్లు శోకమందు, మునిగె వీధికవతల..||ఎవరికి వారే||

ఇల్లు లేదు తల్లిలేదు, ఇంపాదే తెలియలేదు
కావలసిన వారిని, కలుపుకునే ఆశలేదు
నూలుతెగిన గాలిపటం, వాలునెక్కడో..2
నీ నొసటి రాత, చెరిగి, నీవు తేలుటెక్కడో ||ఎవరికి వారే||

Nithya Kalyanam Paccha Thoranam - Evariki Vaare Yamuna Teerey - Chalam, Krishna Kumari, Ramakrishna

ఆరుద్ర,పి.బి.శ్రీనివాస్, పెండ్యాల నాగేశ్వర రావు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2169 General Articles and views 2,200,454; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914
Dt : 05-Jan-2023, Upd Dt : 05-Jan-2023, Category : Songs
Views : 748 ( + More Social Media views ), Id : 1689 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nithya , kalyanam , paccha , thoranam , evariki , vaare , yamuna , teerey , chalam , krishna , kumari , ramakrishna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content