ఒకే కుటుంబం- నవ్వలేక ఏడ్చాను, ఏడ్వలేక నవ్వాను, నవ్వు ఏడుపు, రెండిటి నడుమ - NTR - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,222; 104 తత్వాలు (Tatvaalu) and views 225,134.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

10 మంది మనుషులు ఉన్నవారు కూడా, కష్టాలు వచ్చినప్పుడు, తమకు తాము ఒంటరివారే అవుతారు. ఒక్కోసారి పరిస్తితులు ఏడ్వాలో నవ్వాలో కూడా తెలియని మాయ స్తితి లో ఉంటాయి. ఎవరు మనవారో, ఎవరు పగవారో అర్ధం కాదు.

అది మన తప్పిదము వలన కాకపోతే, మనకు ఇబ్బంది లేదు, మనకు పాపము అంటదు, మబ్బులు తొలిగినట్లు పక్కకు పోతాయి త్వరలో. కానీ అది మన అరిషడ్వర్గాల బానిసత్వముతో అయితే మాత్రం, ఆ పరిస్తితులలో మనము తప్పు దోవ పడతాము.

అందుకే, రోజూ దైవ పూజ చేస్తూ, మంత్ర ఉచ్చరణతో, మనసు బుద్దిని అదుపులో ఉంచుకోవాలి.

ఈ చిత్రములో, దైవ సంకల్పము చే విడిపోయిన, కొడుకు అమ్మను చూడడానికి వెళ్ళి, తానే తన కొడుకు నని చెప్పలేక కుమిలిపోయే బాధను వినండి. మనకు ఎన్నో అర్ధం కాని అయోమయ పరిస్తితులు ఇలాగే వచ్చి ఉండవచ్చు. దైవం అండతో, వాటిని నిర్భయముగా దాటుదాము.

బాధలలోనే పయనించి స్వర్గధామం చేరాను
స్వర్గములోనే నరకయాతనపడే మాత్రుదేవతను చూచాను

నవ్వలేక ఏడ్చాను- ఏడ్వలేక నవ్వాను
నవ్వు ఏడుపు, రెండిటి నడుమ, నాలో నేనే నలిగాను
నాలో నేనే నలిగాను, నాలో నేనే నలిగాను

అమ్మవని తెలుసుకొని ఆనందముతో ఏడ్చాను
కొడుకుననీ అనలేక ఆవేదనతో నవ్వాను
విధికి ఎందుకు ఈ కక్షా, నాకే ఎందుకు ఈ శిక్ష
||నవ్వ||

నా ఇల్లూ, నా వాళ్ళు ఉన్నా ఒంటరి నయ్యాను
తనయునికై, తపియించే తల్లికి రుణపడి పోయాను
కాలం మారకపోదులే, మనమంతా కలియక పోయాములే ||నవ్వ||

Cast: NTR, Lakshmi, Kantha Rao, Music: S P Kodandapani, Lyrics: Dasari, Director: A Bhimsingh, 1970, Ghantasala

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

navvaleka edchanu edvaleka navvanu navvu edupu renditi naduma oke kutumbam ntr  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,222; 104 తత్వాలు (Tatvaalu) and views 225,134
Dt : 06-Oct-2022, Upd Dt : 06-Oct-2022, Category : Songs
Views : 445 ( + More Social Media views ), Id : 1568 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : navvaleka , edchanu , edvaleka , navvanu , navvu , edupu , okekutumbam , ntr , lakshmi , kantharao , rajashree , anjali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content