నాట్స్ నూతన అధ్యక్షులు ఉపాధ్యక్షులు 2022 - కొత్త మార్పులు, పోటీతత్వం, తెలుగు, ప్రజాస్వామ్య విలువలు? - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*వ్యవహారికం - భవిష్యత్ ఆశ*

గౌరవ నాట్స్ నూతన అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి, మరియు ఉపాధ్యక్షులు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల, హరినాథ్ బుంగతావుల, మదన్ పాములపాటి, రమేశ్ బెల్లంలు గార్లకు, మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు, హ్రుదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు.

మీ కొత్త టీం తో అయినా, సరి కొత్త జీవం తో మార్పులు వచ్చి, నిబద్దత జవాబుదారీతనం పారదర్శకం, పోటీతత్వం పెరిగి, తెలుగు వాడకం వ్యక్తిగతము గా అలాగే వ్యవహారికముగా పెంచి, అమెరికా తెలుగు పౌరుల మరియు పచ్చ కార్డు దారుల పాత్ర పెంచి, సభ్యులు ఓటు హక్కు ను ప్రతి ఎన్నికలలో తప్పనిసరిగా వినియోగించుకుని, ఉత్తములను ఎన్నుకునే ప్రజాస్వామ్య ఎన్నికల విలువలు కాపాడుతారని ఆకాంక్షిస్తున్నాము.

*వాస్తవం - బానిసత్వ ముఠాల తో, పోటీతత్వం కోల్పోయిన చేవ పౌరుషం లేని నాయకులు, ఓటు హక్కు కోల్పోయిన విలువ లేని/ తెలియని సభ్యులు*

చట్టపరముగా మనము చేసింది కరెక్టే కావచ్చు. మనసులో మంచితనం వాసన కోల్పోయిన చదువుకున్న ఆధునిక యంత్ర జీవులు, అవకాశ అవసర చేతకాని తనం తో, నోరు ఎత్తకపోవచ్చును. ఈ రోజు మనదే పై చేయి కావచ్చును, కానీ ప్రజాస్వామ్యాన్ని నీతి నిజాయితీని నిబద్దతను అపహాస్యం చేసాము.

ఏ సంస్థ అయినా మంచిదే దాని లక్ష్యాలు మంచివే, కానీ పాత మరియు కొత్త నాయకుల పట్టు బంధం లాలూచి మంచిది కాదు. బానిసత్వం కు తలవంచని పోటీ తత్వం తో, కొత్త నీరు రావాలి, కొత్త ఆలోచనలు రావాలి.

ముందు జాగ్రత్త గా, ఆలోచనా సరళి మారడానికి 20 ప్రశ్నలు పంపాము, జవాబు రాలేదు. మా అవగాహన తప్పు ఉంటే, మీరు వివరణలు ఇవ్వవచ్చు, మమ్మల్ని ఎడ్యుకేట్ చేయవచ్చు. link

తానా తెలుగు సంఘము లో 3 టీం లు పోరాడారు, స్వేచ్చగా లోపాలను ఎండగట్టారు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. గెలుపు ఓటములు దైవాధీనం.

తప్పుడు వారి నైనా, సభ్యులు ఓట్లు వేసి గెలిపిస్తే, వారంతా కూడా, ఆ పాపం లో భాగం పంచుకుంటారు. మొత్తం పాపాన్ని, కొద్దిమంది బోర్డ్ సభ్యులే లేదా పై నాయకులే, మోయడం ఎందుకు మిత్రమా?

మనం కూడా, కనీసం ఉత్తుత్తి డమ్మీ నాయకుల పోటీ అయినా పెట్టి, 4 ఉత్తుత్తి ముఖా ముఖి వాదనలు పెట్టి, సభ్యులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చి ఉంటే, కనీసం అమాయకపు పిల్లలు అయినా మంచి గా జరిగింది అని, పెద్దలు కూడా నాటకం రక్తి కట్టించారు, అని అనుకునేవారు.

కొత్త వారైనా, బానిసత్వ నాయక వారసత్వ ముఠా లను పక్కకు నెట్టి, విదేశం లో అమెరికాలో ట్రంప్ అలాగే తెలుగు నేలపై ఎంటీయార్ లాంటి వారు, మొదటి ఎన్నికల్లో గెలిచి, తమ శక్తిని నిరూపించారు. పవన్ లాంటి వారు, ప్రయత్నం చేస్తున్నారు.

ఒక ఇంట్లోనే ఏకాభిప్రాయం లేదు, ఒక సంస్థ లో అసలు ఏకాభిప్రాయం ఉండదు. బోర్డ్ లో మెజారిటీ పెత్తనం తో, గెలిచిన స్వార్ధ గెలుపు, ఒక గెలుపు కాదు. అవకాశవాదులు ఒప్పుకోవచ్చు, కానీ దేవుడు ఒప్పుకోడు. వ్యక్తి జీవితం లో చివరలో అయినా, జవాబు చెప్పాలి, తన తప్పిదాలకు.

కానీ మన ఆత్మ అంతరాత్మ ఫలితాలను మార్చలేము. తెలుగు నేల పై, రామన్న మరియు రాజన్న కూడా, తమ జీవిత చరమాంకములో, మహా కాలుని, కాల బలం ముందు తలవంచక తప్పలేదు. ఇప్పుడు చంద్రన్న మరియు జగనన్న లను చూస్తున్నాము, ఇంకా జరగబోయే విచిత్రాలను చూస్తాము.

గతములోనే మేము స్పష్టము గా రాశాము, రాజకీయ వాసనలు తక్కువ గా ఉన్న తెలుగు సంఘము మనదే అని, మిగతా అన్ని సంఘముల లో. కానీ గాడ ఫాదర్ ముఠాతత్వం బానిసత్వం సంకెళ్ళు తెంపుకుని స్వేచ్చగా బయటకు రావాలి.

మాత్రు సంస్థ లో ఉన్న, ఆధిపత్యం ఆపలేక కుళ్ళు కడగలేక బయటకు వచ్చి, మరలా మనము ఇక్కడ మన ముఠాతో పాతుకుని, అదే తప్పు స్వయం గా మనము చేస్తే, రేపు ఇంకో సంఘము పుట్టుకు వస్తుంది ఇదే కారణము తో.

అంటే, మనకు దక్కనంత వరకు లేదా చేయిజారినప్పుడు, ప్రజాస్వామ్య రక్షణ అని అరవడం, ఒకసారి మనకు అధికారం దొరికితే, ప్రజాస్వామ్య భక్షణ చేస్తూ, మన వారితో అధికార మోహం లో మునగడం. దేవుడు నవ్వుకుంటూ ఉంటారు, మన అశాస్వత కుప్పిగంతులు చూసి.

అందుకే పెద్దలు చెప్పింది, చదువు వేరు సంస్కారం వేరు అని. విదేశాలకు పోయినా, మన కుల వర్గ ముఠా పిచ్చి పట్టు పతనం తగ్గలేదు.

ఇప్పటి దాకా కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు, అందరమూ తప్పు చేస్తాము. కానీ మన తప్పులు భవిష్యత్ తరాలకు, మరిన్ని అవినీతి అక్రమ దోవలకు బాటలు పాఠాలు కారాదు. వారు మనల్ని క్షమించరు. మన తప్పులు సరిచేసుకుని, తర్వాత నాయకులు తప్పు చేయకుండా బైలాలు సరి చేయాలి.

లేదా ఇదే తప్పుల పరంపరలో ఇంకా విలువలు అధోగతికి చేరి పతనము కూడా కావచ్చు. కానీ మనము కారణము కారాదు, ఆ పాపపు వడ్డీ మన ఆత్మలతో పైలోకాలకు వెంట పడకూడదు.

ఇది ప్రతి పార్టీ మరియు ప్రతి సంఘము ఇప్పుడు అయినా కనువిప్పు తో, వాస్తవ ప్రపంచము లోకి వచ్చి, పంచభూతాల క్రమశిక్షణా చర్యలకు దూరంగా ఉండి, చల్ల గా ఉంటారని, మన తర్వాత తరాలకు ఆదర్శము గా ఉంటారని ఆశిస్తున్నాము.

NATS - New President Vice Presidents 2022 - New Changes, Competitiveness, Telugu, Democratic Values  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 01-Jun-2022, Upd Dt : 01-Jun-2022, Category : America
Views : 385 ( + More Social Media views ), Id : 1411 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nats , usa , america , president , vice , 2022 , changes , competitiveness , telugu , democratic , values

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content