Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమహా, ఓం నమో కరోనా గురవే నమహా. రోజూ వాట్సాప్ స్టేటస్ చూడటం మరువద్దు.
వాట్సాప్ లో నీతి గా ఉండటము గురించి కధనము పంపాము, తస్మాత్ జాగ్రత్త, ఇతరుల మాయలో పడవద్దు, తమ గురించి వారం వారం వాట్సాప్ స్టేటస్ లో సమాచారం చెప్పకపోతే అందరి ఎదురుగా.
నూతన సంవత్సర శుభాకాంక్షలు, గురువు లందరికీ ఎంతో బాగా ఆనందముగా ఈ రోజు గడిచింది అని భావిస్తున్నాము. ఫోటోలు తో మాటలుతో శుభాకాంక్షలు పంపిన, గురువుల మంచి మనసుకు సంస్కారానికి, ప్రణామాలు. పండితులు పామరులు అదికారులు నాయకులు ఉన్నారు, అందరికీ శిరస్సు వంచి నమస్కారములు.
కొత్త సంవత్సరములో, ఎన్నో మంచి పనులు మంచి మనసుతో సాధించడానికి, మొదలు పెట్టే ఉంటారు.
ఖచ్చితముగా అవి ధనము నకు చెందినవైతే, దాని కన్నా విలువైనది, మనశ్శాంతి మరియు ఆరోగ్యం. కరోనా రోగము వచ్చిన తర్వాత, వారి ముందు మన ఆస్తి, హోదా, అంతస్థు, ఏదీ పనికి రాలేదు, ఎంతమంది రాలిపోయారో చూసాము కదా?
మన బుద్దుల క్షణ క్షణ పరివర్తన తెలుసు కాబట్టే పెద్దలు, నవ గ్రహాల రూపములో మనకు, అరిషడ్వర్గాల మాయను జయించడం నేర్పారు. మనము దేవుని పేరు చెప్పుకుంటూ పైకి, మనల్ని మనమే మోసము చేసుకుంటూ, ప్రతి మాట బాట చేష్టలో, కామ క్రోధ మద మోహ మాత్సర్యాలకు, లోను అవుతున్నాము బానిసలు గా.
మనలో ఉన్న చెడుని శుభ్రము చేసుకోకుండా, ఏమిటో పాడు లోకం ఇలా అయిపోతుంది, అని అనుకుంటాము. కాని మన కర్మలు మన పిల్లలు బంధువులు స్నేహితులు ద్వారా, మనకు బుద్ది చెబుతాయి. మన తప్పులు పాపాల ఫలితాలు, మనతో పాటుగా మన పిల్లలు తరాలు కూడా పడాలి. ఎవరమూ తప్పించుకోలేము.
అఖండ బాలయ్య సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగా నచ్చాయి, విలన్ తో మీరు మేము ఒకటి కాదు అని అఘోరా పాత్ర పలుకుతుంది - 1. మీరు మీ ఆలోచనలు మీ స్వార్ధ కుటుంబానికే పరిమితం, కానీ మాకు, అన్ని కుటుంబాలు మావే, మాది జగమంత కుటుంబం 2. చేతిలో ఐస్ ముక్క భరించలేరు వణికిపోతారు మీరు, కానీ మేము హిమాలయాలలో ఒంటి మీద ఏమీ లేకుండా ధర్యముగా భక్తితో పూజలు చేస్తాము.
కొంచెం అటూ ఇటూగా అదే అర్ధము వచ్చే విధముగా ఉంటుంది. అంతమంది విలన్లను చంపినా కూడా, ఒక చిన్న చీమ వెళుతుంటే దానికి కీడు చేయకుండా, అది వెళ్ళిన తర్వాత, అఘోరా వెళతారు. తప్పక చూడాలి, హైందవత్వాన్ని మంచిగా చూపారు, కాస్త మసాలా తన్నులాటలు ఇతరుల కోసము ఉన్నా కూడా.
ఇక్కడ ఐస్ చలి వణుకు దగ్గర మనకు కావల్సినది ఉంది, మన ప్రదక్షిణాలకు. నూతన సంవత్సరము అయినా కూడా, మనకు శని వారము రావడము వలన, మన యధావిధి కార్యక్రమాలు, ఉదయ 4.30 కి లెగిచి, యోగా మరియు ధ్యానము, చెంబు నీరు, వేప పొడి, కాకార వెల్లుల్లి అల్లం రసము, కషాయము, తర్వాత, స్నానము, 30 నిమిషాల ఇంట్లో పూజ, తల్లి పాదాలు కడిగి పూజ, ఆ తర్వాత గుడికి ప్రయాణము.
మన 116 వ వారం 108 ప్రదక్షిణాల కోసం, 2019 నుంచి సాగుతుంది అని మీకు తెలుసు. గుడి లో శని శివ దీపాలు 8 ఏళ్ళు గా 2014 నుంచి సుమా.
మనకు ఏలినాటి శని వదిలినా కూడా, మనము అవి ఆపము. ఎందుకంటే మనము, భయము అవకాశవాదం అవసరము తో, అవి చేయడము లేదు. కేవలము భక్తి తో మనస్పుర్తిగా చేసేటప్పుడు, ఎన్ని వారాలు ఎన్ని ఏళ్ళు అయితే, వచ్చిన నష్టము ఏముంది?
గత నెల రోజులు గా విపరీత చలి, నేల బండ మీద ఉత్త పాదముతో నడవాలి అంటే, మంటలు వణుకు బాధ, చాలా కష్టము గా ఉంది, 1 గంటా 15 నిమిషాలు అలాగే తిరగడము.
కానీ, జీవిత సమస్యలు అవమానాలు మానసికవేదన అంతకన్నా భయంకరము. కాబట్టి, ఈ మాత్రం చలి వణుకు మంట బాధ భరించాలి, ఎందుకంటే మనకన్నా ఎక్కువ సాధన చేసే యోగులు నిండు చలిలో ఉన్నారు.
ఉపవాసం 47 వ వారం. ఉత్త అరటి యాపిల్ పాలు ఖర్జూరం, ఇంత మనిషికి అవి ఆనవు. ఆకలి విలువ తెలుస్తుంది, పేగులు కేకలు పెడుతూ అల్లాడుతూ.
గురువారం హారతులు 25 వ వారం నడుస్తుంది పూజారి లాగా. 21 వ నెల, ప్రతి నెలా వెంకన్న మొక్కు గుండు నడుస్తుంది.
ఆలాగే నేల నిద్ర, శాఖాహారం, నుదుట బొట్టు, మెడలో తులసి దండ, ఇంట్లో ఉదయం సాయంత్రం తులసి దీపం.
76 యేళ్ళ తల్లి (నా ముద్దుల కూతురు) అంటే సజీవ గురువు దైవం కి, రోజు చేతి కర్రలాగా తోడుగా ఉండి సేవ చేసుకునే భాగ్యం.
ఇతరుల సాత్విక బాధలు విని, తగిన సలహా సహాయము అందించడం.
ఇంకేమి కావాలి అరిషడ్వర్గాల సాధనకు, మోహనికి బంధాలకు సుఖ దుఖాలకు దూరముగా, సమతా స్థితికి? సన్యాసులతో కలవాలా అడివికి వెళ్ళాలా?
దైవము మీద నమ్మకము తో చేసిన ఏ పని కూడా వ్రుధా పోదు, మానసిక బలాన్ని ఇస్తుంది, మన మరియు మనతో మాట్లాడే వారి, అందరి జీవిత సమస్యలకు పరిష్కారలను అంతరంగము లో చూపిస్తుంది, మనల్ని ముందుకు నడుపుతుంది, మనకు తెలీని అతీంద్రియ శక్తి.
దానికి ఆగ్రహము వచ్చిన రోజున, జరిగే ప్రళయాన్ని ఎవరమూ ఆపలేము. కరోనా గురువు, ఒక చిన్న హెచ్చరిక మాత్రమే సుమా.
నమ్మిన వారు మనతో ఉన్నారు, మన దోవలో నడుస్తున్నారు. నమ్మని వారు దూరముగా వెళుతున్నారు, జరిగేది జరగాలి కాబట్టి.
మీరూ ప్రపంచ మాయకు దూరముగా ఉండి, జరిగేది నిర్లిప్తముగా గమనిస్తూ, దైవధ్యానములో ఉంటారు కదూ?
ఎవరినో మనము మోసము చేయడము లేదు, కేవలము మనము మనల్నే మోసము చేసుకుంటూ, బంధాలు సమస్యల సుడిగుండములో పతనము అవుతున్నాము సుమా.
ధ్యానముతో కఠిన సాధనే దీనికి విరుగుడు, మన అందరి చేతిలోనే ఉంది మన భవిష్యత్తు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,571,913; 97 తత్వాలు (Tatvaalu) and views 198,415 Dt : 01-Jan-2022, Upd Dt : 01-Jan-2022, Category : General
Views : 439
( + More Social Media views ), Id : 1285 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
cold ,
shiver ,
pradakshina ,
yogis ,
practice Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments