నిరంతర ప్రజా సేవ చేసే ఎంపీ ఎమ్మెల్యే ఊళ్ళో ఉండరు, ఫించన్లు ఉంటే, మరి జీతం ఏ మాత్రం? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,347; 104 తత్వాలు (Tatvaalu) and views 224,957.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఎమ్మెల్యే ఎంపీ ఊళ్ళో ఉండరు స్ధానిక వ్యక్తి కాదు, ఉచితంగా ప్రజా సేవ చేస్తున్నట్లు కదా, ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు అనుకున్నా, ఫించన్లు ఉంటే, మరి జీతం ఏ మాత్రం ఉంటుంది?

జవాబు, ఉచితం గా ప్రపంచంలో ఎక్కడా ఎవరూ పని, సేవ చేయరు. ప్రతి ఉచితం లేదా సేవ వెనుక ఓ పరమార్ధం ఉంటుంది. మనలాంటి సామాన్య జనం కు అది అర్థం అవ్వడం అంటే, ఓ డిగ్రీ చేయాలి. ఓ 10 శాతం మంచి వారు విడిగా ఉన్నా, మన ఉత్తమ శుద్ద రాజకీయాల లో, అసలు అలా ఉండరు కదా. ఉంటారు అనుకుంటే, మన భ్రమలు అమాయకత్వం.

వీలైతే మనల్ని లేదా మన లేదా ప్రభుత్వ భూములను అమ్మి తాకట్టు పెట్టి అయినా, వారు ఖరీదైన ఉచిత ప్రజా సేవ చేస్తారు అని పెద్దలు అంటుంటారు. ప్రజా పనుల కమీషన్ లు, బినామీ లు, ఇతర రాష్ట్రాల మరియు దేశాలలో పెట్టుబడులు, పవర్ ప్రాజెక్టులు, గనులు, గ్రానైట్ లు, స్థలాలు, వారి నల్ల ధనం సేవ కు, అంతులేదు అంటారు మరి కొందరు.

అందుకే ప్రధాని మోదీ గారు, ఒక్కొక్కటిగా వాటిని తెంపుతూ వస్తున్నారు. నేరుగా, ధనం పేదలకు బాంకు ఎకౌంటు లో వేస్తున్నారు. అలాంటి నాయకులు ను, మనం తెలుగు రాష్ట్రాలలో రానీయం గెలవనీయం. మనకు మనవాళ్ళే కరెక్టు, పతనం వైపు పరుగులు కు.

మీరు బహుశా పేపరు టీవీ చూడరు అనుకుంటా, అమాయకంగా అడిగారు. అందుకే లోక జ్ఞానం ఉండాలి, లేకపోతే మన ఇంట్లో కూడా విలువ ఉండదు .

గత ప్రభుత్వం లో షుమారు 2016 దగ్గర లో, బీద ఎమ్మెల్యేలు కు, కుటుంబ ఇంటి ఖర్చులు కు సరిపోవడం లేదని, రాబోయే కరోనా బాధలు భరించలేరని, 95 వేల నుంచి, ఒక లక్ష 25 వేలకు జీతాన్ని ఉదారంగా పెంచారు. అధికార ప్రతిపక్ష నాయకులు, అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆర్థిక మంత్రి యనమల గారు బిల్లు ప్రవేశ పెట్టి, ఎవరూ దీని గురించి ఆందోళన వ్యతిరేకత లేకుండా, స్వాగతించాలని ఆస్వాదించాలి అని అన్నారు. అలవెన్సులు సౌకర్యాలు ఎగష్టా సుమా.

రాష్ట్ర విభజన తర్వాత చితికి పోయిన ఆర్థిక వ్యవస్థ కు, ఇంకొంత భారం వేశారు. ధన తెలంగాణ ఎమ్మెల్యే లు కన్నా, మన జీతాలు తక్కువ నే గదా అనుకుంటూ, ఆనందంగా.

కానీ ఒకే ఒక్క మొనగాడు, నెల్లూరు నుంచి కోటంరెడ్డి గారు మాత్రం దీనిని వ్యతిరేకించారు, ఈ పరిస్థితుల లో ఇలా చేయడం తప్పు అన్నారు అని సమాచారం.

అర్థం అయిందా మరి, మన స్ధానిక ప్రజలకు చెందిన నాయకులకు, నెలకు లక్ష పైన జీతం మరియు ఇతర అలవెన్సులు సౌకర్యాలు తీసుకుంటూ, హోదా అనుభవించడం చాతకాదు కాబట్టే, మన నెత్తిన వేరే వారిని, తెచ్చి పెడతారు పెద్ద నాయకులు. ఈ లక్షల ప్రజాధనం తీసుకుంటూ కూడా, పక్క సంపాదనతో పాటుగా, మనతో మన ఊళ్ళో ఉండటానికి అందుబాటులో ఇష్టపడరు.

2018 లో గౌరవ ఎంపీలు జీతాలు ఒక లక్షకు పెంచారు, ఎలవెన్సులు సౌకర్యాలు హోదాలు ఎగష్టా.

పెద్దలు ఈ ఎమ్మెల్యే ఎంపీ జీత సమాచారం లో మార్పులు ఉంటే, చెప్పగలరు.

కాబట్టి, నెలకు ప్రజాధనం లక్ష పైన వైట్ మనీ తో, సౌకర్యాలు పొందుతూ, అసెంబ్లీ పార్లమెంటు లో సరిగ్గా హాజరు కాకుండా, ప్రశ్నలు అడగకుండా, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడకుండా, కాలక్షేపం చేసే నాయకులును, మన నియోజకవర్గాలలో తరచుగా చూడవచ్చు.

అంటే మన స్ధానిక ప్రజల బుద్ధి కి, మహోన్నత ప్రతిరూపాలు వారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,347; 104 తత్వాలు (Tatvaalu) and views 224,957
Dt : 20-Oct-2020, Upd Dt : 20-Oct-2020, Category : Politics
Views : 752 ( + More Social Media views ), Id : 767 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mp , mla , public service , town , pensions , salary
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content