APLatestNews.com top Banner

Social Media links
మాతృ దినోత్సవం - మనకు లేని కృతజ్ఞతలు సంస్కారాలు, మన తర్వాత తరాలకు రావు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మాతృ దినోత్సవం, మరువద్దు. గతంలో తల్లి దగ్గర ఉండే పరిస్థితి కాబట్టి, మనకు ఆ రోజు తో అవసరం లేదు. కానీ ఈ రోజుల లో, దూరంగా , ఎక్కడో ఉంచుతున్నారు. వాళ్ళ మాటలను ఆయుధం గా వాడుకుని, వారినే కష్టాలు పడమంటున్నారు.

అందరితో నిస్సిగ్గుగా నవ్వుతూ చెప్పుకుంటున్నారు - మా తల్లి దండ్రులు, నన్ను మా ఆవిడ ను నమ్మరు, మాతో పడలేరు కాబట్టి, అమ్మా వాళ్ళ కు దూరంగా నే ఉండటం ఇష్టం అంట అని అక్కడే వదిలేసాము. సరే వీరికీ, రాబోయే రోజులలో, కర్మ ఫలితం తప్పదు.

పేరెంట్స్ ఉండి దూరంగా ఉంటే, వాట్సప్ లో చూస్తూ మాట్లాడండి. దగ్గర ఉంటే, వారిని కలవండి. వారు లేకపోతే, పశ్చాత్తాపం పడుతూ, పిన్ని లేదా ఇతర దగ్గర పెద్దలు తో అయినా మాట్లాడండి.

వారు చేసిన సేవలను పడిన కష్టాలు ను, గొప్పగా గా చెప్పండి. కనీసం మాటలతో అయినా సంతోషం ఇవ్వ ప్రయత్నం చేయాలి కదా.

దేవుని కి కూడా పెద్దలు అంటే నే ఇష్టం, బాధ్యత, అందుకే వినాయకునితో శివ పార్వతుల చుట్టూ తిప్పించి, బాధ్యత చెప్పారు మనకు. ఎందుకంటే, పిల్లల కు ఇమ్మూనిటీ మరియు శక్తి ఉంటుంది, 60 దాటిన పెద్దలు కు అది తగ్గుతుంది.

భార్య తో కొట్టించుకోవడం కన్నా, తల్లి తో కొట్టించుకోవడం ఉత్తమం అన్నారు వెనకటి పెద్దలు.

నేడే మాతృ దినోత్సవం. ప్రపంచంలో మనం కళ్ళు తెరిచాక చూసేది, దేవుడు మనకు ఇచ్చిన ఒకే ఒక మొదటి, ఉచిత నిస్వార్ధ గురువు నే, ఆమే నవ మాసాలు మోసిన మన కన్నతల్లి.

ఆమె చెపితేనే మనకు తెలిసే రెండో గురువు, నాన్న. ఆ గురువులు, తమ చివరి దాకా మన కోసం ఆరాట పడతారు పోరాడతారు, మనం అవసరం తీరాక వారిని కాలదన్నినా.

అదే పడవ, మనమూ ఎక్కాలి, ఇంకొన్ని రోజులు తర్వాత, మరువకు. కృతజ్ఞతలు చూపించి, తర్వాత తరాలకు నేర్పు. మనకు లేని కృతజ్ఞతలు సంస్కారాలు, మన తర్వాత తరాలకు రావు.

అవి నేర్పడానికి, మరలా కరోనా 1 , కరోనా 2 , . . ., కరోనా 2090 రావాల్సి ఉంటుంది. అవసరమా? మనం నేర్చుకుందాం నేర్పుకుందాం. కరోనా చిట్టి తల్లి కి , వైద్యులు కు , పోలీసులు కు , ప్రభుత్వం కు పని తగ్గిద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 572 General Articles, 46 Tatvaalu
Dt : 10-May-2020, Upd Dt : 10-May-2020, Category : General
Views : 74 ( + More Social Media views ), Id : 541 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : mothers day , thank respect parents , next-generations learn it
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content