Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *స్పందన ప్రశ్న* - ఏవండీ, కధ లో పాత్రలను వారి అరిషడ్వర్గాల అష్టవ్యసనాల స్వభావాన్ని ఆలోచనలను, అంత తీవ్రతగా చెప్పాలి. ప్రతి లక్షణాన్ని గతాన్ని కూడా తవ్వి తీయాలి, అప్పుడే మనకు ఫలితం, పూర్వ జన్మ కర్మ లేదా ఈనాటి ఖర్మ దా తెలిసేది.
జీవితం లో అన్ని పోగొట్టుకుని, బంధాలను తెంపుకుని, తినడానికి ధనం ఆస్తి ఉన్నా కూడా, సొంత ఇల్లు వదిలి, అద్దె/ ఆశ్రమం కు పోయి ఒంటరిగా, ముదుసలి వయస్సులో, ఇంతమంది ఉండి అనాధగా జీవించడం అంటే, ఇంక పెళ్ళి పిల్లలు సంసారం బంధం కు అర్ధం లేకుండా పోతుంది. అది ముందు 30 ఏళ్ళు అర్ధము కాదు, చెప్పినా ఎక్కించుకోరు.
ఇక్కడ అత్త కోడలు అనే కధన విషయము కన్నా, దిగజారిపోయిన మన ఆలోచనలు వ్యవస్థ పతనము కనపడుతున్నది. ఇది మన ప్రతి ఇంటి భాగోతమే 80 శాతం, కానీ ఎవరూ మారరు. ఇతరులు మాత్రమే మారాలి అంటారు.
ఇలాంటి కుటుంబ విలువలు ఉన్నవారు, సమాజాన్ని ఎలా ఉద్దరిస్తారు, మంచి నాయకులను ఎలా ఎన్నుకుంటారు? దేశ ప్రగతికి ఎలా తోడ్పడతారు? దేవుడు ని, ఎన్ని జన్మలు ఎత్తైనా తెలుసుకోగలరా? ఇలాంటి మనకోసం, దేవుడు ఇంకో అవతారము ఎత్తాలా?
ముందు సరిచేసిన కధనం కోసం ఇక్కడ చదవగలరు -
link
*జవాబు* - ధన్యవాదాలు, ఈ స్పందనే అందరి దగ్గరనుంచి కోరుకునేది. పైకి అత్త కోడలు కధనము లా కనిపించినా, మన అందరి మనస్తత్వాల ప్రతిబింబం ఆ కధనం.
మల్లెపువ్వు ఎక్కడైనా వాసనే, కపటం నటన ఉండదు. మన ఇంట్లో విలువలు సంస్కారం ఉంటే, ఏ విషయములో అయినా ఈ స్పందన ఉంటుంది. 30 దాటిన లేదా పెళ్ళి అయిన ప్రతి వ్యక్తికి హ్రుదయ స్పందన ఉండాలి, లేదంటే, వారి మనసులో/ ఇంట్లో నిత్య నరకమే తాండవిస్తుంది అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వంలో.
అది మన ఇంట్లో/ వంట్లో లేనప్పుడు, స్పందన ఎలా ఉంటుంది, అందరూ ఎప్పుడులా మౌనమే. లేదా బ్లాక్ చేసుకుని పారిపోవడం ఛీ ఛీ విలువల గురించి, మనకు తలనొప్పి ఎందుకు, ధనం/ అధికారం/ పదవి గురించి మాత్రమే మనకు కావాలి అని.
ఈ స్పందన వలన మాకు ఉపయోగం ఏమో అనుకుంటారు కొందరు. కానే కాదు ఇది మీకు, మీ కుటుంబానికి, మన సమాజానికి, దైవానికి, మన సాధనకు మాత్రమే ఉపయోగం.
ఎందుకంటే, మీ స్పందన/ సాధన నుంచి, మీ ముదుసలి తల్లి దండ్రుల/ అత్త మామలను అలాగే సంతానాన్ని ఎంత బాధ్యతగా, సంస్కారము నేర్పుతూ, చూసుకుంటున్నారో, అందరికీ అర్ధం అవుతుంది.
మీకు ఆచరణ ఆధ్యాత్మిక దైవ భక్తి ఉంటేనే, ఇలా సంస్కారముగా వివరముగా, స్పందించగలరు, ఆలోచనల జవాబు రాయగలరు.
అందుకే అంటారు, వయస్సు 60 వస్తే పెద్ద మనుషులు కారు. జీవిత అనుభవం నుంచి, మంచి స్పందించే హ్రుదయము, మనసు, సంస్కారం, పెరిగితేనే వారు పెద్దమనిషి. 30 ఏళ్ళ నీతి నిజాయితి క్రుతజ్ఞత విశ్వసనీయత ఉన్న సంస్కారే పెద్దవాడు జీవితములో అనుభవములో, మన శ్రేయోభిలాషి కూడా, ఎవరికీ ఉపయోగం లేని సంస్కారం లేని 40 ఏళ్ళ పైన మనసులేని బండరాయిల కన్నా.
లేదంటే, అదిగో మన కధలో, అత్త/ కోడలు/ కొడుకు లా వ్యర్ధముగా వ్రుధాగా, ఎవరికీ ఉపయోగం లేకుండా, జాలి దయ ప్రేమ క్రుతజ్ఞత విశ్వసనీయత లేకుండా, చివరకు తమ వారికే అవసరం లేకుండా, భూమికి భారముగా దూరంగా మిగిలిపోతారు.
ఆత్మాహుతి పరమ పాపం, కర్మ అనుభవించాల్సిందే, మరు జన్మకు బదిలీ చేసిన వడ్డీ కూడా పెరుగుతుంది సుమీ.
కధలో మామ గతించారు కాబట్టి తప్పించుకున్నారు ప్రస్తుత జన్మకు, లేకపోతే పెళ్ళి అప్పుడు, బ్రమల పాపంలో ఆయన కూడా ఉన్నట్లే కదా? మరు జన్మలో యాతన తప్పదు.
కానీ ఇది కధ కాదు, ఈ సంవత్సరములో జరిగిన వాస్తవం, వ్యధతో పశ్చాత్తాపం తో వారు చెప్పిన కధ, కాస్తైనా శిక్షణ తగ్గుతుంది అని.
అత్త కు శిక్షణ ఇప్పుడు మొదలు అయ్యింది 30 ఏళ్ళ తర్వాత, ఆ తర్వాత 30 ఏళ్ళకు కొడుకుల/ కూతురుల కు, కోడళ్ళ/ అల్లుళ్ళ కు కూడా దైవ శిక్షణ ఎటూ తప్పదు. ఎవరూ తప్పించుకోలేరు సుమీ.
ఇప్పుడు అత్త ఒంటరిగా అనాధగా బయటకు వెళితే, నీతి గల మన సమాజం బంధువులు స్నేహితులు ఇరుగుపొరుగు కొడుకులు కూతుళ్ళు అందరూ మౌనమే, ఎందుకంటే అందరూ దొంగలే కపట నటన అవసర అవకాశవాదులే, ఆ తాను ముక్కలే.
ఇన్నాళ్ళు మనతో కలసి తిరిగినవారే, మనం ఒంటరి అయితే, వారి కేమి నష్టం? ఇన్నాళ్ళు మనము కూడా ఇతరుల బాధలు పంచుకోలేదు కదా? ఎవరైనా, ఇది అన్యాయం అన్నారా, ఆపారా? కనీసం చెప్పారా? వారికి దూరంగా ఉన్నారా?
అబ్బే లేదు, రాముడు క్రిష్ణుడు అంటే చెడుకు దూరంగా ఉంటారు కానీ, కపట మనుషులం మేము అందరితో అవసరం కోసం కలసి ఉంటామండి అంటాము, అంతేనా?
ఎందుకంటే, మనవి స్పందన లేని, బండ హ్రుదయాలు. మనకెందుకు ఆ ఇల్లు తగల బడితే, వారు వింటారా? రేపు మన ఇల్లు తగల బడుతుందని కూడా, మనకు తెలియదా?
ఆఖరుకు అత్త కూడా అంతే కదా? ఎవరు తమ కొడుకుని ఎక్కువకు కొంటారో అని మాత్రమే వెతికింది కదా?
కోడలు అంతే గదా, మన ధనం వీసా ఆస్తి పదవి అధికారం కు, ఏ బకరా పెంపుడు జంతువులా, తలవంచి కాళ్ళపై పడతాడు అని వెతికింది?
కొడుకు అంతే కదా, ఎక్కడ తలవంచుకుని, సంపాదన భోగ భాగ్యాలతో శారీరక సుఖం తో, పబ్బం గడుపుకుందాము అనే కదా చూసింది?
వీరి ముగ్గురు లో లేదా మన ఇంట్లో ఎవరైనా, పెళ్ళి అప్పుడు లేదా ఇతర కార్యక్రమాలు/ ఎన్నికలు/ తగవులు అప్పుడు, ఇతరులలో దైవ గుణం మంచి లక్షణాలు ఎవరికైనా ఉందా లేదా అని, ఎవరైనా ఆలోచన చేసారా? చేయరు.
తన తప్పు తాను అర్థం చేసుకుంటే, ఎవరూ ఎవరినీ మార్చుకో అవసరం లేదు, చెప్పనవసరం లేదు. మరలా ఇతరులు, సమాజం బాగుపడదు అండి అని వాళ్ళే అంటారు కదా?
దొంగ, తన తప్పు ఒప్పు కోకుండా, నా కన్నా పెద్ద దొంగలు వెన్నుపోటు దారులు లేరా, లోకమంతా ఇంతే, ఇదే ఫ్యాషన్, నేటి పోకడ, ఇంత చిన్న ది దొంగ తనమా అంటే? లేదు ఇది తప్పు నే కాదు, ఇతరులు నాకు ఎందుకు బుద్ధి చెప్పాలి? అసలు వారెవరు, నాకేమైనా ఇచ్చారా, మంచి చేసారా? వాళ్ళ ఇంట్లో లేవా దొంగతనాలు అంటే? మా పిల్లలు కు ఈ బుద్ధి నేర్పితే తప్పా అంటే? మా అహంకారం ధనం మా పతనం మా ఇష్టం అంటే? ఇగో అంటే, వేలు పెట్టడం అంటే?
జై శనీశ్వరా, అందుకే పంచభూతాల మరియు నవగ్రహాల పని, అవి భూకంపాలు సునామి వరదలు అగ్నిప్రమాదాలు గా పలురకాలుగా సరి చేస్తున్నాయి.
ఇలాంటి కుటుంబ విలువలు ఉన్నవారు, సమాజాన్ని ఉద్దరించరు, ఎందుకంటే తమను తామే ఉద్దరించుకోలేరు కాబట్టి. పిల్లల బంగారు భవిష్యత్ ను అమ్ముకునే వారు, ఓట్లను కూడా అమ్ముతారు, తమ భవిష్యత్ ను అమ్ముతారు, కాబట్టి మంచి నాయకులను ఎలా ఎన్నుకుంటారు? దేశ ప్రగతికి ఎలా తోడ్పడతారు? చిత్రంగా, వాట్సాప్ లో తెలుగు లో రాయరు, ఇంట్లో చదువుకున్న వారిచే రాపించలేరు.
తమను తామే తెలుసుకోలేని వారు, తమ తప్పులు ఎరుగని వారు, దేవుడు ని ఎన్ని జన్మలు ఎత్తైనా తెలుసుకోగలరా? తెలుసుకోలేరు. ఇలాంటి మనకోసం, దేవుడు ఇంకో అవతారము ఎత్తాలా? ప్రళయం చాలు కదా. అంతే, మన వెన్నంటి ఉండే ప్రమాదాలు ప్రళయాలు చాలు, ఇంకా కొత్త అవతారాలతో పని లేదు, దేవునికి శ్రమ లేదు.
More than aunt daughter-in-law matter, our degraded thinking system is showing collapse
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,678,704; 102 తత్వాలు (Tatvaalu) and views 207,755 Dt : 18-Jan-2023, Upd Dt : 18-Jan-2023, Category : General
Views : 406
( + More Social Media views ), Id : 1696 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
aunt ,
daughter ,
inlaw ,
degraded ,
thinking ,
system ,
collapse ,
atta ,
kodalu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments