Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. *** మోదీ రాజీనామా చేయాల్సిన పని లేదు, చేస్తే, మనకే నష్టం. అక్రమార్కులు ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే, ముందు రాజీనామా చేయాల్సింది, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కరోనా అజాగ్రత్తల ప్రజలు. ఈ వారం లో కూడా, మా వాళ్ళు హాయిగా ఊళ్ళ పర్యటనలు చేస్తున్నారు.
కాంగ్రెస్స్ తో రోజుకి ఒక స్కాం కావాలా? జమ్ము కాశ్మీర్, మరలా వారికి ధారాదత్తం చేద్దామా? ముస్లిం మహిళల తలాక్ భద్రత వదిలేద్దామా? విదేశీయులకు ఓటు హక్కు ఇచ్చి, మన మధ్య మనమే చిచ్చు పెట్టుకుందామా? అలాగే చేద్దాము అంటే, మరలా కాంగ్రెస్స్ లేదా కలగూర గంప ప్రతిపక్షాలు ను ఎన్నుకుందాం, తన్నుకుందాం.
*** తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, అధికార పార్టీ ఏఐడీఎంకేకు ఓడి, ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ, ఊహించినట్టే మెజారిటీ స్థానాల్లో విజయం. కమల్ హాసన్ ఓటమి.
స్థానికం అనే మాటతో, అభివ్రుద్ది లేకపోయినా, మన లాగే, అదే మత్తులో వారూ ఉన్నారు. ఆ రెండు పార్టీలు కుటుంబాలు తప్ప, 3 వ కొత్త వ్యక్తి కి, అవాకాశం ఇవ్వరు, వారి బతుకులు మార్చుకోరు. సేం టు సేం మన తెలుగు ఓటర్లు రాజ్యాంగం లాగా, వారూ కుటుంబ బానిసత్వం నుంచి బయటకు రారు.
*** లోకల్ - నాన్ లోకల్ సెంటిమెంట్ - ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ముచ్చటగా 3 సారి కూడా విజయకేతనం.
నందిగ్రామ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో, మమత ఓడిపోయారు. ఇప్పుడు సీఎం పదవి చేపట్టడానికి, గవర్నర్ అనుమతి తప్పనిసరి. బెంగాల్ లో, శాసన మండలి కూడా లేనందున, మమత సీఎం పదవి చేపడితే, తిరిగి 6 నెలల్లో తప్పకుండా, ఏదో ఒక స్థానం నుంచి గెలవాలి. లేదా అప్పటిదాకా కొత్త ముఖ్యమంత్రిని నియమించాలి అంటున్నారు.
బెంగాల్ రాత అంతే, వారి గీత మారదు. కమ్యూనిస్ట్ ల నుంచి, మమత చేతి లో పడ్డారు. అక్కడనుంచి తప్పించుకో లేక ఉన్నారు. వారినీ ఆ దేవుడే కాపాడాలి. బీజేపీ కి 76 సీట్లు వచ్చాయి అనుకుంటా, పర్లేదు.
*** తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉపఎన్నిక - వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపు.
కంగ్రాట్స్ ఎంపీ గారు. తెదేపా పోరాడి ఓడింది, పర్లేదు.
రాష్ట్ర బీజేపీ, మీకు ఇంకా బుద్ది రాదు, జనసేన వెనకనే మీరు ఉండాలి, స్థానికం మాట మరుస్తున్నారు. బీజేపీ జనసేన, మీ స్థానిక పట్టణ గ్రామ సోషల్ పేజీల బతుకు మారందే, మీరు గెలవరు.
మా బాపట్ల ఎంపీ అంత ఘోరముగా లేకుండా, తిరుపతి అభివ్రుద్ది గురించి, గురుమూర్తి అన్నా కాస్త నోరు ఎత్తుతారేమో చూద్దాం.
ఈ వైకాపా ఎంపీ గెలుపు తో, మిగతా వైకాపా ఎంపీలకు ధైర్యం వచ్చి, ఇక డిల్లీ దద్దరిల్లి పోతుంది, ఢిల్లీ వీధుల్లో ధర్నాలు దీక్షలు చేపట్టి, కేంద్రం మెడలు వంచి, ప్రత్యేక హోదా తెచ్చి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపుతారేమో, ఆక్సిజన్ ప్లాంటు లు కడతారేమో, చూడాలి అంటున్నారు వైసీపీ అభిమానులు ఆనందోత్సాహాలతో.
*** అసెంబ్లీ ఎన్నికల్లో విజయ శంఖారావం మోగించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.
*** నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆరెస్ అభ్యర్థి గెలుపు. ఇక రాజకీయాల్లో పోటీ చేసే అవసరం రాకపోవచ్చు. నాకు 75ఏళ్లు, ఓటమి తర్వాత జానారెడ్డి అంతర్మదనం.
సార్ మీరు ఎప్పుడో రెటైర్ అయ్యి, ప్రజలకు కొత్త నాయకులను ఇవ్వాలి, ప్లీజ్ అంటున్నారు ప్రజలు.
*** కేసీఆర్ సర్కారు సంచలనం: కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్, భూకబ్జా నిజమేన్న నివేదిక. ఇష్టం లేని వారిని, వదిలించుకుంటున్న కేసీయారు.
అవినీతి గురించి మాట్లాడితే, ముందు ప్రభుత్వాన్నే బర్థరఫ్ చేయాలి అంటున్నారు ప్రజలు. ఫాం హౌస్ నుంచి పాలించే ఏకైక సీయెం ఆయనే, మన తెలంగాణా ప్రజల అద్రుష్టానికి, అమావాస్య చంద్రుడు.
*** బ్రిటిష్ పాలన నుంచి అమెరికా విముక్తి పొందినా, కెనడా మాత్రం బ్రిటన్ ఆధీనంలోనే ఉంది. దాంతో కెనడా నుంచి ఎవరూ రాకుండా అమెరికా కోట కట్టింది. కోట, తమ భూభాగంలో కాకుండా, ఈశాన్యాన క్లింటన్ కౌంటీలోని న్యూయార్క్‌కు ఆనుకొని ఉన్న, చాంప్లాన్ సరస్సు వద్ద కట్టడం ప్రారంభించింది.
కోట దాదాపు పూర్తవుతుందనగా, ఆ ప్రదేశం తమ భూభాగంలో లేనట్లు, అమెరికా గుర్తించి నాలుక్కరుచుకుంది. అక్కడ నుంచి సరంజమా తీసుకుని పోయింది. అమెరికా ఇలా అనుకోకుండా, తమ శత్రువుల భూభాగంలోనే కోటను కట్టి, చివరికి దాన్ని వారికే ఇచ్చివేయడంతో ఈ కోటకు ఫోర్ట్ బ్లండర్ అని పేరు పడింది.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,652; 104 తత్వాలు (Tatvaalu) and views 221,538 Dt : 03-May-2021, Upd Dt : 03-May-2021, Category : Politics
Views : 733
( + More Social Media views ), Id : 1151 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
modi ,
resign ,
stalin ,
mamata ,
ycp ,
trs ,
win ,
itala ,
bartaraf ,
fort blunder Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments