Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
ఒక జిల్లా ప్రధమ అధికారి, 2019 నుంచి తన కర్తవ్యం ను తాను నిర్వహించని పక్షంలో, జిల్లా లో ఇంత జనాభా కలిగి, ఒకరూ పట్టించుకోకుండా ఉన్నారు. ఎందుకు, మీరు మరియు స్ధానిక అధికారులు చేస్తున్న, సేవలు పనులు గురించి వివరణ, మీ సొంత సోషల్ మీడియా లో ఉంచరు?
సమాచారము ఇస్తూ ఉంటే, ప్రజలు ఇంకా అడుగుతారు, అందులో తప్పులను ఎత్తి చూపుతారు. అలా ప్రజలతో బంధాన్ని పెంచుకోవాలి.
భయమా లేక మీరు చేస్తున్నా పనులలో ప్రజా సంక్షేమం లేదా? చేస్తేనే కదా చెప్పుకోవడానికి అంటారా, ప్రజలను హేళన చేస్తూ? అని అడగరా ప్రజలు అధికారులను? మోడీ, జగన్, డీజీపీ, ఎస్పీ, ఇతర జిల్లా కలెక్టర్ గార్లు, ప్రజలే తమకు ప్రభువులు అనుకుంటున్నారు. మరి వీరు, ప్రజా సేవకులు అనుకోరా?
రాజకీయ నాయకులు గురించి అనుకోవడం అనవసరం. తమ లేదా తమ అనుచరులు పనులు చాలు వారికి, జిల్లా ప్రజల సంక్షేమం అవసరం లేదు. మా జిల్లా మంత్రి మరియు ఎమ్మెల్యేలు గార్లు, ఇప్పుడు కనీసం రెండు సార్లు కలిసారు, ఈ నెలలో జిల్లా ముఖ్య అధికారి ని.
మీరు మరియు స్ధానిక అధికారులు, ఎందుకు ప్రజలకు జవాబు చెప్పరు రోజూ అని, నిలదీయాల్సిన వారే, తలవంచుకు వస్తున్నారు, ఎలక్షన్ అప్పుడు కదా జనం తో మనకు పని అని. ప్రజలు కూడా అలాగే ఉన్నారు, ఎన్నికల పండగ అప్పుడు చూద్దాం లే, మన ఎమ్మెల్యే ఏ ఊళ్ళో ఉంటే, మనకేమి అన్నట్లు గా.
మేము మా వంతుగా, ఆ ప్రయత్నం లో కలెక్టర్ గారి నుంచి జవాబు లేక పోవడముతో మిగతా పై అధికారులకు కూడా, ఈ సమస్యను విన్నవించుకున్నాము. సీయస్, సీఎమ్ , రాష్ట్ర స్పందన , లోకాయుక్త, మానవ హక్కుల కమీషన్ దాకా వెళ్ళాము, ఈమైల్ పంపాము. ఇతర మీడియా మిత్రులు కు పంపాము.
ముందుకు కదులుతుందో లేదో ఆ దేవుని కే తెలియాలి, లేదా మా ప్రయత్నమే తప్పు అంటారేమో? పర్లేదు, పడదాము మన జిల్లా సోదరుల కోసము. ప్రయత్నం చేయడం మన వంతు, ఫలితాలు దేవుని వంతు. లేదంటే, కొత్త అధికారి వచ్చిన దాకా ఎదురు చూద్దాము.
పోనీ జిల్లా లెవల్ నాకు వద్దు లే, మన మండలం లేదా ఊరు లెవల్ లో అన్నా అధికారులు ను అడిగి, మీరూ మీ సిబ్బంది, ఏమైనా జనానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారా?
చేస్తుంటే , మీ సొంత సోషల్ మీడియాలో సాక్ష్యం చూపించండి, అని అడగరు? మన అధికారులు, నాయకులు చేసిన పనులు తెలుసుకోవడానికి, 5 రూపాయలు పెట్టి పేపరు ఎందుకు కొనాలి? 150 రూపాయలు పెట్టి కేబుల్ టీవీ ఎందుకు చూడాలి?
పాత రోజుల లో సోషల్ మీడియా లేదు కాబట్టి, న్యూస్ పేపరు టీవీ చూడాలి, ఇప్పుడు ఎందుకు వాటి పైన ఆధారపడటము?
మేము ధనం పెట్టి ఎందుకు కొనాలి పేపరు టీవీ సేవలను? అధికారుల మంచి పనికి కొలమానం, బయటి మరియు పార్టీలు కు కొమ్ము కాసే న్యూస్ పేపరా/ టీవీ నా లేక మీ సొంత సోషల్ మీడియా నా? ఏది నమ్మదగినది, ఏది బాధ్యత గలిగిన ది? అని మనము ఎవరినీ అడగం.
మనం ఇలా ఒకరినొకరు పట్టించుకోకుండా ఉండ బట్టే, తెల్లవారు వచ్చి పాలించారు. ఇప్పుడు మన నాయకులు అధికారులు కూడా, ప్రజల ధనం తో, సర్వ భోగాలు అనుభవిస్తూ, అదే ప్రజలను చులకనగా చూస్తున్నారు.
ఎందుకంటే, ఎలక్షన్ లో మంచి వారిని, ప్రజల కోసం వారి పక్షాన, పని చేసే వారిని గెలిపించము కాబట్టి. మనం మరియు మన ఇల్లు మారనిదే, మన వ్యవస్థ మారదు. మనకు అడగడం చాతకాక పోయినా, అడిగే వారి మాటలను, పదిమంది కి చేరవేద్దాం.
దయచేసి ఫోటోలు లో చూడండి, కడప మరియు గుంటూరు కలెక్టర్ గార్లు, తమ ప్రజల ఎడ తమ బాధ్యతల ఎడ, ఎంత ప్రేమ అభిమానాలు గౌరవం చూపిస్తున్నారో? మరి మన ప్రకాశం జిల్లా అధికారులు మరియు స్ధానిక అధికారులు?
Please check the social media of Respected Kadapa and Guntur Collectors, how much they love respect their district people and job? They love their people and job. What about our Prakasam District officers and local officers?
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,493,546; 104 తత్వాలు (Tatvaalu) and views 267,407
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments