Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Medalo cherina chilakamma (Bhakti Parody) - Naapere Bhagawan (1976) - Ramakrishna, Manjula, Prabhakar Reddy, Satyanarayana
*పాటతో పరమార్ధం - మేడలో చేరిన చిలకమ్మ (భక్తి పేరడీ) - నాపేరే భగవాన్ (1976) - రామకృష్ణ, మంజుల, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ*
Raaz Ki Baat Keh Doon To Jane Mehfil Mein Phi - Dharma (1973) Hindi - Pran, Navin Nischol, Rekha, Ajit, Madan Puri, Bindu - Mohammed Rafi, Asha Bhosle
- మన గాత్ర నైవేద్య సేవ. దయచేసి వీడియోలో భక్తి, ఆరోగ్యం, మనస్సు నియంత్రణ, ఆయుర్వేదం, సాఫ్ట్ స్కిల్స్ స్లైడ్‌లను ఒక్కొక్కటిగా చూడటానికి మిస్ అవ్వకండి. Our Gatra Naivedya Seva. Please don't miss to watch devotional, health, mind control, ayurveda, soft skills slides in the video, one by one.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
+ + +
మేడలో చేరిన చిలకమ్మా, వాడనే మరిచిందోయమ్మా అని వీరు అంటే మేడలో వున్న చిలకమ్మా, మేడలో వుంటేనే ముద్దు అని వారు అన్నారు చిత్రం లో. మరి మనము దానిని భగవంతుని సేవలో పాటగా, ఇలా ముద్దు గా పాడుకుందామా. సాధనలో మెరిసే జీవాత్మ, బ్రమలనే మరిచిందోయమ్మా అని వీరు అంటే, సాధనలో మెరిసే జీవాత్మ, ధ్యానంలో వుంటేనే శుద్ది. అక్కడే వుంది మోక్షమ్ము, ఎప్పుడూ వీడిపోవద్దు అని వారి అంటారు మన పేరడీ పాటలో.
రజో తమో గుణాలకు, బ్రమలను దాచాలనుకొంటే, మనసున దాగుతుందా, చేతలలో ఆగుతుందా? ముంచుకొని మోహం వస్తుంటే, జపముతో ఆగుతుందా, తపముతో ఆగుతుందా? అని వారు అన్నారు. మరి వీరి జవాబు? బ్రమలే కాల్చివేస్తున్నా, సాధనతో తట్టుకుంటాము మేము. మోహమె ముంచుకొస్తున్నా, సాధనతో తప్పుకుంటాము మేము.
రజో తమో గుణాలు, ఎంత కపటం తో నటనతో, 2 నాల్కల ధోరణితో జీవితం సాగించినా, తెల్లని పూలు పూస్తున్నా, ఉల్లి సిరిమల్లె అవుతుందా? ఎంతగా వన్నె ఒకటైనా, ఇత్తడి పుత్తడి అవుతుందా? అని వారు అన్నారు. మరి వీరి జవాబు? ద్యానంలో స్మరించినామంటే, సూర్యుడే చల్లబడతారు, సూర్యుడే జ్ఞానమిస్తారు. చేతులే మొక్కినామన్టే, దేవుడే దిగి దిగి వస్తాడు, దేవుడే అండగ ఉంటాడు. మానసిక హీనులకేం తెలుసు, సాధన గొప్ప అని వారు అంటారు. మరి పూర్తి పాట వింటూ, మీరు పాడుతారు కదూ, గుణవంతులుగా.
+ + +
Parody
పల్లవి:
పరుగుల జీవా.. మోహాల దోవా
రజోతమో గుణాల.. వ్యసనాల బొమ్మా
ఒక మాట.. వింటావా ఈ బోధ..
సాధనలో మెరిసే జీవాత్మ.. బ్రమలనే మరిచిందోయమ్మా.. హ హా.. 2
సాధనలో మెరిసే జీవాత్మ.. బ్రమలనే మరిచిందోయమ్మా 2
సాధనలో మెరిసే జీవాత్మ ఆ..ఆ..
సాధనలో మెరిసే జీవాత్మ.. ధ్యానంలో వుంటేనే శుద్ది
అక్కడే వుంది మోక్షమ్ము.. ఎప్పుడూ వీడిపోవద్దు 2
సాధనలో మెరిసే జీవాత్మ.. బ్రమలనే మరిచిందోయమ్మా
చరణం 1:
బ్రమలను దాచాలనుకొంటే.. మనసున దాగుతుందా, హా.. చేతలలో ఆగుతుందా..
ఊఁ.. ముంచుకొని మోహం వస్తుంటే.. జపముతో ఆగుతుందా, హా.. తపముతో ఆగుతుందా
చీకటికి వెల్లవేస్తే.. వెలుతురుగా మారుతుందా
మదిని యే మాట దాగుందో.. ఆచరణ తో చూపమంటవా
ముసుగులో ఏమి జరిగిందో.. అసలు ముడి విప్పమంటావా
సాధనలో మెరిసే జీవాత్మ.. బ్రమలనే మరిచిందోయమ్మా 2
బ్రమలే కాల్చివేస్తున్నా.. తట్టుకుంటాము మేము, సాధనతో తట్టుకుంటాము మేము
మోహమె ముంచుకొస్తున్నా.. తప్పుకుంటాము మేము, సాధనతో తప్పుకుంటాము మేము
మదిలోని ఆ బ్రమ.. జపముతొ దాటిపోలేదా
హా.. ముద్దుగా వున్న ఆశలకు.. మొదటికే మోసం వస్తుంది
నిండుగా వున్న మీ ఆరోగ్యం.. మెండుగా పాలిపోతుంది
అక్కడే వుంది మోక్షమ్ము.. ఎప్పుడూ వీడిపోవద్దు
సాధనలో మెరిసే జీవాత్మ.. ధ్యానంలో వుంటేనే శుద్ది
చరణం 2:
తెల్లని పూలు పూస్తున్నా.. ఉల్లి సిరిమల్లె అవుతుందా, ఉల్లి సిరిమల్లె అవుతుందా..
ఎంతగా వన్నె ఒకటైనా.. ఇత్తడి పుత్తడి అవుతుందా, ఇత్తడి పుత్తడి అవుతుందా..
ఉరిమిపడే ప్రతిమేఘం.. కురిసేనా కురిసేనా
సాధనకు గట్టిగా ఉండే.. ఆత్మను మేమనుకొన్నారా
గాలికే తూలిపడిపోయే.. బలహీనం మేమనుకోలేరా
సాధనలో మెరిసే జీవాత్మ.. బ్రమలనే మరిచిందోయమ్మా
సాధనలో మెరిసే జీవాత్మ.. బ్రమలనే ..బ్రమలనే మరిచిందోయమ్మా
ద్యానంలో స్మరించినామంటే.. సూర్యుడే చల్లబడతారు, సూర్యుడే జ్ఞానమిస్తారు..
చేతులే మొక్కినామన్టే.. దేవుడే దిగి దిగి వస్తాడు, హా.. దేవుడే అండగ ఉంటాడు..
మానసికహీనులకేం తెలుసు.. అహా.. సాధన గొప్ప
హేయ్.. ఛెళ్ళుమని కర్మఫలితంతొ.. కళ్ళలో కైపు దిగుతుంది
నెత్తిలో వున్న జేజమ్మ.. చిత్తుగా వీగిపోతుంది
అక్కడే వుంది మోక్షమ్ము.. ఎప్పుడూ వీడిపోవద్దు
సాధనలో మెరిసే జీవాత్మ.. ధ్యానంలో వుంటేనే శుద్ది
చరణం 3:
నాగునై వెంటపడతా.. శివయ్యతొ మీ పని పడతాం..
చల్లని పిడుగై వస్తా.. పరమాత్మతో పిండి చేస్తాం..
పొగరు చూపిస్తున్నావా.. అయ్యో.. బ్రమలు కలిగిస్తున్నావా
ముదిరెనా నీ వ్యవహారం..చూసుకో దైవ శక్తి లీల..
అరే దీవానా సైతాన్.. ఖబర్ధార్ మెమె భగవాన్
హ భగవాన్.. హా భగవాన్.. హా భగవాన్.. హా హా హా..
ఓ.. భగవాన్.. ఆ..ఆ..
సాధనలో మెరిసే జీవాత్మ.. ధ్యానంలో వుంటేనే శుద్ది
అక్కడే వుంది మోక్షమ్ము.. ఎప్పుడూ.. హాహా..ఎప్పుడూ.. హై.. ఎప్పుడూ.. వీడిపోవద్దు
Original
చిత్రం: నా పేరే భగవాన్ (1976); సంగీతం: చక్రవర్తి; గీతరచయిత: సినారె; నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
పరువాలరెమ్మా.. మురిపాల గుమ్మా
పరువున్న ఇంటిలోని.. పగడాల బొమ్మా
ఒక మాట.. వింటావా ఈ పాట..
మేడలో చేరిన చిలకమ్మా.. వాడనే మరిచిందోయమ్మా.. హ హా.. 2
మేడలో చేరిన చిలకమ్మా.. వాడనే మరిచిందోయమ్మా 2
మేడలో వున్న చిలకమ్మా ఆ..ఆ..
మేడలో వున్న చిలకమ్మా.. మేడలో వుంటేనే ముద్దు
అక్కడే వుంది నీహద్దు.. ఎప్పుడూ దాటిపోవద్దు 2
మేడలో చేరిన చిలకమ్మా.. వాడనే మరిచిందోయమ్మా
చరణం 1:
నిప్పును దాచాలనుకొంటే.. గుప్పిట దాగుతుందా, హా.. గుప్పిట దాగుతుందా..
ఊఁ.. ముంచుకొని వెల్లువ వస్తుంటే.. కంచెతో ఆగుతుందా, హా.. కంచెతో ఆగుతుందా
చీకటికి వెల్లవేస్తే.. వెలుతురుగా మారుతుందా
మదిని యే మాట దాగుందో.. పెదవితో చూపమంటవా
ముసుగులో ఏమి జరిగిందో.. అసలుముడి విప్పమంటావా
మేడలో చేరిన చిలకమ్మా.. వాడనే మరిచిందోయమ్మా 2
నిప్పులే కాల్చివేస్తున్నా.. పట్టుకుంటాను నేను, హా.. పట్టుకుంటాను నేను
వెల్లువే ముంచుకొస్తున్నా.. తట్టుకుంటాను నేను, ఊఁ.. తట్టుకుంటాను నేను
మదిలోని ఆ మాట.. పెదవి దాటిపోయిందా
హా.. ముద్దుగా వున్న పెదవులకు.. మొదటికే మోసం వస్తుంది
నిండుగా వున్న నీ మేను.. రెండుగా చీలిపోతుంది
అక్కడే వుంది నీ హద్దు.. ఎప్పుడూ దాటిపోవద్దు
మేడలో వున్న చిలకమ్మా.. మేడలో వుంటేనే ముద్దు
చరణం 2:
తెల్లని పూలు పూస్తున్నా.. ఉల్లి సిరిమల్లె అవుతుందా, ఉల్లి సిరిమల్లె అవుతుందా..
ఎంతగా వన్నె ఒకటైనా.. ఇత్తడి పుత్తడి అవుతుందా, ఇత్తడి పుత్తడి అవుతుందా..
ఉరిమిపడే ప్రతిమేఘం.. కురిసేనా కురిసేనా
రంకెలకు తుళ్ళి పడిపోయే.. జింకను నేననుకొన్నావా
గాలికే తూలిపడిపోయే.. బేలను నేననుకొన్నావా
మేడలో చేరిన చిలకమ్మా.. వాడనే మరిచిందోయమ్మా
మేడలో చేరిన చిలకమ్మా.. వాడనే..వాడనే మరిచిందోయమ్మా
సూటిగా చూసినానంటే.. సూర్యుడే చల్లబడతాడు, సూర్యుడే చల్లబడతాడు..
చేతులే చాచినానంటే.. దేవుడే దిగి దిగి వస్తాడు, హా.. దేవుడే దిగి దిగి వస్తాడు..
పిల్లకాకికేమ్ తెలుసు.. అహా.. ఉండేలు దెబ్బా
హేయ్.. ఛెళ్ళుమని చెంప సవరిస్తే.. కళ్ళలో కైపు దిగుతుంది
నెత్తిలో వున్న జేజమ్మ.. చిత్తుగా వీగిపోతుంది
అక్కడేవుంది నీహద్దు.. ఎప్పుడూ దాటిపోవద్దు
మేడలో వున్న చిలకమ్మా.. మేడలో వుంటేనే ముద్దు
చరణం 3:
నాగునై వెంటపడతా.. డేగనై నీ పని పడతా..
చల్లని పిడుగై వస్తా.. పిడుగునే పిండి చేస్తా..
పొగరు చూపిస్తున్నావా.. అయ్యో.. వగలు ఒలికిస్తున్నావా
ముదిరెనా నీ వ్యవహారం..చూసుకో నా అవతారం..
అరే దీవానా సైతాన్.. ఖబర్ధార్ నే నే భగవాన్
హ భగవాన్.. హా భగవాన్.. హా భగవాన్.. హా హా హా..
ఓ.. భగవాన్.. ఆ..ఆ..
మేడలో వున్న చిలకమ్మా.. మేడలో వుంటేనే ముద్దు
అక్కడే వుంది నీ హద్దు.. ఎప్పుడూ.. హాహా..ఎప్పుడూ.. హై.. ఎప్పుడూ.. దాటిపోవద్దు
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2303 General Articles and views 3,486,697; 104 తత్వాలు (Tatvaalu) and views 395,877
Dt : 05-May-2025, Upd Dt : 05-May-2025, Category : Songs
Views : 381
( + More Social Media views ), Id : 2256
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Medalo cherina chilakamma ,
Parody ,
Naapere Bhagawan ,
Naapere Bhagavan ,
Ramakrishna ,
Manjula ,
Prabhakar Reddy ,
Satyanarayana ,
Raaz Ki Baat Keh Doon ,
Dharma
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments