Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఎమ్మెల్యే అంటే, ఏసీ గదుల్లో ఉంటూ, కారుల్లో తిరుగుతూ, అధికారులతో మాట్లాడుతూ, ఎన్నికల సమయములో లేదా మధ్య మధ్యలో కన్నీళ్ళు తుడవటానికి మాత్రమే, సామాన్య జనము దగ్గరకు, మంది మార్భలము తో వచ్చి, వారితో కలసినట్టు నాలుగు ఫొటోలు దిగి, ఓ నాలుగు పంచి, అరగంటలో చెమట తుడుచుకొని, వెళ్ళడము కాదు.
పల్లె పల్లె వెతుక్కుంటూ, నడి ఎండలలో, అడవులు వాగులు దాటుతూ, అదొక యజ్ఞము లా, నా బంధువులు, నా జనము, నా వాళ్ళు అని, కిలో మీటర్లు నడుస్తూ, జనముతో మమేక మై, ఇల్లు ఇల్లు వీధి వీధి పేట పేట తిరిగే వారు, 34 రోజులు గా, ఈ కరోనా కష్ట సమయములో, ఇంకెవరైనా ఉన్నారా?
భూతద్దములో పెట్టి వెతికినా, కనపడతారా? ఒకనాడు తుపాకీ పట్టి పోరాడి, జన జీవన స్రవంతిలో కలసిన, అడవి బిడ్డ ధనసరి సీతక్క, ములుగు నియొజకవర్గ (వరంగల్), కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాత్రమే అలా చేయగలరు. అందరికీ ఆదర్శమైన ఎమ్మెల్యే అన్నా, తప్పు లేదు కదా.
కలకాలం సాగాలి సంపూర్ణ ఆరోగ్యము తో మీ పయనం, ఆదర్శం కావాలి మా అందరికీ మీ జీవనం, దేవుని అండ మీ పై చల్లగా ఉండగ - అక్కా మా సీతక్కా మా అడవి ముద్దు బిడ్డవి అక్కా, అంటారు జనము, అందులో అతియోశక్తి ఏమీ లేదు.
అందుకే కుల మత బెధాలు లేకుండా, మనలో ఉండి, మనతో తిరిగి, మన కష్టము పంచుకునే వారిని, ఎన్నుకుంటే, వారు ఎప్పుడూ మనకు చేదోడు వాదోడు గా ఉంటారు.
ఇది, పొగడ్త కాదు, ప్రతి రోజు ఫేస్బుక్ లో పెట్టే ఫొటోలు వీడియోలు, చూడండి. అక్క డైరీ నుంచి, ప్రతి రోజూ పెట్టే, కొన్ని ఫోటోలు, వీడియోలు మీకోసము ఇక్కడ.
34 వ రోజు - ఈ రోజు నా కార్యక్రమంలో కనీసం 2500 కుటుంబాలకు, మా తోటి కాంగ్రెస్ కార్యకర్తలు సహాయం తో కరోనా సహాయం. దాంట్లో సుమారు 1000 కుటుంబాలు, ఈ లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు, బెల్ట్ పరిశ్రమ కార్మికులు, గుత్తి కోయ గ్రామాల్లో నివసించే ప్రజలు, ఒరిస్సా కాలనీ వాళ్లు, చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన కూలీలు ఉన్నారు. వాళ్ళ కష్టాలు చూసి బియ్యం, కూరగాయలు, మరియు నిత్యవసర సరుకులు. మిగతా వాళ్ళందరికీ సరిపడే కూరగాయలు సహాయం. ఇది ఇలాగే లాక్ డౌన్ అయిపోయే దాకా కొనసాగుతుంది.
ప్రస్తుతం నా ముందు ఉన్న చాలెంజ్ పేద ప్రజలను పట్టి పీడిస్తున్న ఆకలిని తరమడం, అందుకే గో హంగర్ గో చాలెంజ్ మొదలుపెట్టాము, అందరు దీంట్లో భాగం పంచుకుని పేద ప్రజల ఆకలి బాధలనుండి కాపాడండి. ఈ ఛాలెంజ్ ని, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారికి, నా సోదరులు MP రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, మరియు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి చాలెంజ్ చేస్తున్నాను.
33 వ రోజు - ఈ రోజు 5 గ్రామాలు తిరిగాము
అడవి ప్రాంతం లోని ప్రజలకి ప్రభుత్వ సహాయం 1500, మరియు వాళ్లకి రేషన్ కూడా అందలేదు. ఎందుకంటే వాళ్లకి రేషన్ కార్డు కూడా లేవు. మేము ఇక్కడికి రావడం ఇది రెండోసారి. లాక్ డౌన్ పొడిగింపు ద్వారా వీళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము మొదటి సారి ఇచ్చిన బియ్యం ఇంకా నిత్యావసర సరుకులు అయిపోయినాయి. తిరిగి మళ్ళీ వాళ్లకు సహాయం చేస్తానని, దాతల సహాయం ద్వారా వచ్చాము.
32 వ రోజు - 1000 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. మేము చేసే కార్యక్రమాలు చూసి, డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మరియు మా నియోజవర్గానికి చెందిన రాజు నాయక్ గార్లు, పెద్ద మనసు చేసుకొని మాకు సహాయపడటానికి పేద ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళ వంతు సహాయం వాళ్లు చేశారు. మాతో కలిసి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది.
Dansari Anasuya commonly known as Seethakka is an Indian politician, elected to Andhra Pradesh Legislative Assembly in 2009 and Telangana Legislative Assembly in 2018, from Mulug (WARANGAL) assembly constituency.
She was appointed general secretary of All India Mahila Congress in June 2018 and in August 2019 became state in-charge of Chhattisgarh Mahila Congress.
34th Day of Corona help, #coronaheroes, As of now completed 305 villages.
33rd Day of Corona help, Today covered 5 villages in forest
#GoHungerGo - I want to see happiness in the face of the poor.
6 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1795 General Articles and views 1,386,754; 93 తత్వాలు (Tatvaalu) and views 184,204 కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments