Mahalayapaksha Pitrustuti మహాలయ పితృ పక్షాలు - బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,409; 104 తత్వాలు (Tatvaalu) and views 225,147.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

*Pitru stuti (for departed souls) పితృస్తుతి (గతించిన పెద్దల ఆత్మల కోసం) पितृ स्तुति (दिवंगत आत्माओं के लिए)*

Mahalayapaksha days, Pitru Paksha 2022 began on Sat, Sept 10 and ends on Sun, Sept 25. మహాలయ పక్షాలు, పితృ పక్ష 2022 సెప్టెంబర్ 10 న శని ప్రారంభించి, సెప్టెంబర్ 25 న ఆది తో ముగుస్తుంది.

Pitru Paksha is a 16-day ritual observed in Hinduism to pay obeisance to the souls of those who have departed for their heavenly abode.

Pitru Paksha is a mourning period that is marked by many pujas, rituals, and daan (charity) activities. It's said that paying homage to the departed soul during Pitru Paksha helps them attain liberation or moksha.

మహాలయ పితృ పక్షాలు, 21 వ తేదీ నుంచి వచ్చిన విషయం మీకు తెలుసు. గతించిన పెద్దల కు కృతజ్ఞతలు తెలిపే సమయం. కొంత మంది కి, పెద్దల మరణ సమయం తేదీ తిధి గుర్తు ఉన్నా లేకపోయినా కూడా, ఈ పక్షంలో పిండాలు పెట్టవచ్చు తర్పణాలు వదలవచ్చు.

ఆదివారం ప్రదోష వేళ మంచిది అంటారు. అమావాస్య రోజు ఇంకా మంచిది. అలాగని చివరి దాకా ఆగి, ఏదో ఇబ్బందులు వచ్చింది అని మరువద్దు.

అందుకే ముందు ఆదివారాలు పెట్టుకుంటే, అమావాస్య రోజు కూడా పెట్టవచ్చు. ఓపిక ఉంటే ప్రతి రోజూ కూడా, ఏదో ఒక నైవేద్యం దీపం పెట్టవచ్చు ఈ 15 రోజులు కూడా.

మన శాస్త్రం పురాతన మైనది. భూమి గుండ్రంగా ఉందని వరాహ పురాణం లో చెప్పారు. నవ గ్రహ పూజలు ఎప్పుడు నుంచో ఉన్నాయి. పెద్దల కు పిండాలు అందడం లో కూడా నిగూఢార్ధం ఉంటుంది.

మనం చేసే పూజ వారికి బలం, వారి ఆశీస్సులు అండ, మనకు బలం. శక్తి కొలది దాన ధర్మాలు మరువద్దు. ఈ క్రింద ఇచ్చిన తేలిక మంత్రాలను చదివే ప్రయత్నం చేయగలరు, భక్తి శ్రద్ధలతో.

మన పెద్దల భిక్ష వలనే, మనకు ఈ జీవితం, ఈ జ్ఞానం, ఈ ఐశ్వర్యం, కృతజ్ఞతలు చూపాలి సుమా. లేకపోతే, రేపు మన పిల్లలు కూడా మన కన్నా ఘోరం నిర్లక్ష్యం లో.

బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి, తేలిక మంత్రాలను అర్థం తో సహా చదివే ప్రయత్నం చేయగలరు.

This is from Brahmadpuraanam, where Brahma recited this stuti.

ఈ స్తోత్రాన్ని మహాలయ పక్షాలు శ్రాద్ధ దినములందే కాక, ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు.

In Mahalayapaksha days, reciting this in as many days as possible or atleast once and pray to parents and elders, their sins will be destroyed and you will be blessed. It can be recited, every day also.

ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే, పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే, ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు, చదివిన వారిని అనుగ్రహిస్తారు.

If any one has done any thing wrong towards our elders, reading this stotra will absolve them from that sin and will get blessings.

దీనిని ఎవరైతే వారి పుట్టినరోజునాడు, పెద్దలకు నమస్కరించి, వారివద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.

if we read it on our birthday, we receive blessings of parents/ elders.

బ్రహ్మ ఉవాచ:

1. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
Namo pitre janma daatre sarva devamayaaya cha!
sukhadaaya prasannaya supreetaya mahaatmane

ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

2. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
sarva yajna swaroopaya swargaaya parameshtine!
sarwa teerdhaava lokaya karunaasaagaaraaya cha

సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు.

3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
Namo sadaa Asuthoshaya Sivaroopaaya the namah.! sadaapraadhaskhamine sukhaya sukhadaaya cha

సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

4. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
Durlabham maanushamidam yenalabdam maayaa vapuh!!
sambhaavaneeyam dharmaardhe tasmai pitre namonamah!

ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

5. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
teerdia snana tapo home japadeen easy darsanam!
mama guroscha grave tasmai pier namonamah!

ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.

6. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
Yasya praNaamasthvnaath kotiSah pitrutarpanam!
Asvamedha Sataih tulyam tasmai pitre namonamah!

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము.

ఫలశ్రుతి:
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్

పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!

ప్రార్ధన -

గతించిన పెద్దలను చిన్నలను, మన వారిని అందరినీ తలుస్తూ, ఇలా చెప్పుకోవాలి.

మా అమ్మ తరుపున తాత అమ్మమ్మ లకు, అలాగే మా నాన్న తరుపున తాత నాయనమ్మలకు, ఇరువైపులా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకు,

మా నాన్న కు, ఒకవేళ అమ్మ గతించి ఉంటే అమ్మకు, మా మామయ్యకు, మా మేనల్లుడు కోడలు కు,

అమ్మ వైపు - మా తమ్ముడుకు, చిన్న అమ్మమ్మకు, పెద్దమ్మకు,

నాన్న వైపు - చిన్న నానమ్మ బాబాయికి, సొంత బాబాయికి,

మా ఇతర దివికేగిన బంధువులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు, పెద్దలు మరియు చిన్నలు అందరికీ,

వినమ్రపూర్వకముగా శిరస్సువంచి నమస్కరిస్తూ, ఈ రోజు పిండ తర్పణాలు, ఆ దేవుని దయవలన సమర్పించే అవకాశం కలిగింది

వారి దయ క్రుప చల్లని చూపు ఆశీర్వాదం భిక్ష వలనే, మనకు ఈ రోజు ఉన్న స్థితి పరిస్థితి మానసిక స్థితి. వారు ఎల్ల వేళలా, మన అందరికీ అండాగా ఉంటూ, సన్మార్గములో మనల్ని నడిపిస్తూ, దేవుని చేరే దోవ చూపుతారని ఆశిస్తున్నాము.

అలాగే, ఆ దివికేగిన మహాత్ములందరికీ, మనశ్శాంతి ఆత్మ సంత్రుప్తి తో, దేవుని సన్నిధి లభించాలని, ఒకవేళ మరుజన్మలు ఉంటే ఉత్తమ జన్మలు లభించాలని, ఆ భగవంతుని కోరుతూ

అని మన వారిని అందరినీ తలుస్తూ, ఇలా ప్రార్ధన చేసుకోవాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,409; 104 తత్వాలు (Tatvaalu) and views 225,147
Dt : 25-Sep-2021, Upd Dt : 17-Sep-2022, Category : General
Views : 1027 ( + More Social Media views ), Id : 1254 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mahalaya , pitru , pakshas , pitrustuti , hymn , brahma , brihadharmapurana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content