మా పల్లెలో గోపాలుడు - రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు - అధోగతి పరిస్తితి- అర్జున్, పూర్ణిమ, రాజా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన ఆప్తులను ఓ సంవత్సరం తర్వాత చూస్తే, మన అమ్మను నాన్నను కూతురుని కొడుకును స్నేహితుని బంధువుని లేదా ఎవరినైనా తెలిసినవారిని, అప్పుడుదాకా వారు ఎంతో ఆనందముగా ఉన్నారు ఇన్నాళ్ళు అని మనము అనుకుని, వాస్తవం గా అక్కడ చూసిన, అధోగతి పరిస్తితిని చూస్తే మనకే కన్నీళ్ళు తిరుగుతాయి.

మనము ఊహించినది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒక్కటి. ఇన్నాళ్ళు బాధ్యత మరచి, బ్రమలలో బతికే మనకు, కనువిప్పు కలిగితే, ఇలాంటి పాటే మనందరమూ పాడాలి, పాడతాము.

మేడలు మిద్దెలు లో ఉన్నవారు అందరూ మనశ్శాంతి తో ఉన్నారు అని అనుకోవద్దు, పూరింట్లో అయినా, ఉన్నదానితో సంత్రుప్తి గా నవ్వుతూ, అప్పులు అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలకు బానిస కాకుండా, హయిగా ఉండేవాడే రారాజు.

గుణం చూసి పెళ్ళి చేసుకున్న వారు, హాయిగా ఉన్నారు. ధనం ఆస్తులు వీసా హోదా అధికారం పదవి చూసి పెళ్ళి చేసుకున్న వారు, మింగలేక కక్కలేక, లోలోన మానసికముగా కుంగిపోతూ, తమను అలాగే ఇతరులను నిందించుకుంటూ, బతుకు సాగ దీస్తున్నారు.

అందుకే పెద్దలు అన్నారు, మర్రిచెట్టు కష్టాలు మర్రిచెట్టువే, గడ్డిపరక కష్టాలు గడ్డిపరకవే అని.

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా - 2 సార్లు
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ... - 2 సార్లు
ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా ||రాణీ రాణమ్మా||

రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని - 2 సార్లు మొత్తము
ఎంతగా అనుకున్నాను ...ఏమిటి చూస్తున్నాను? 2
పన్నీటి బతుకులోన... కన్నీటి మంటలేనా ||రాణీ రాణమ్మా||

రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా 2
సహనం స్త్రీకి కవచమనీ.. శాంతం అందుకు సాక్ష్యమని..2
ఉన్నాను మౌనంగా కన్నులుదాటని కన్నీరుగా ||రాణీ రాణమ్మా||

గుండెరగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే
కాళ్ళుబండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే - 2 సార్లు మొత్తము
ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం 2
ఎదురీత ఆగదులే... విధిరాత తప్పదులే ||రాణీ రాణమ్మా||

చిత్రం : మా పల్లెలో గోపాలుడు (1985), సంగీతం : కె.వి.మహదేవన్, రచన : సి.నారాయణరెడ్డి (సినారె), గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
అర్జున్, గొల్లపూడి, పూర్ణిమ, రాజా
Movie : Ma Pallelo Gopaludu (1985), Music : KV Mahadevan, Written by : C. Narayana Reddy (Cinema), Singers : S.P.Bala Subrahmanyam, P.Susheela
Arjun, Gollapudi, Purnima, Raja
. . .

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Ma Pallelo Gopaludu - Rani Ranamma anati navvulu - Arjun, Gollapudi, Purnima, Raja  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 24-Oct-2022, Upd Dt : 24-Oct-2022, Category : Songs
Views : 134 ( + More Social Media views ), Id : 1596 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pallelo , gopaludu , rani , ranamma , anati , navvulu , arjun , gollapudi , purnima , raja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content