APLatestNews.com top Banner

Social Media links
జీవితాంతం పారాయణమే, ఆచరణ ఎప్పుడు? మోహం లో స్థానిక గురువు వద్దా, దైవం పురాణాలు వద్దా? - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

కొంతమంది చెపుతారు, మేము ఆ దూరపు గురువు గారి చరిత్ర, ఈ దైవ ఆ దైవ గ్రంధములు, వీరి చరిత్ర పారాయణం 100 సార్లు చేసాము, 8 వారాల బుధవార వ్రతము చేసాము. మరి అవన్నీ మనసు తో నే చేసిన వేనా? మరి, మన లో అంటే మాటలలో చేతలలో, మార్పు ఉందా? లేనప్పుడు ఆ పారాయణాల పూజల ప్రసాదాల, వలన ఉపయోగం ఏముంది?

80 ఏళ్ళ దాకా అంటే, జీవితాంతం చదవడమే సరిపోతుంది. కానీ ఆచరణలో, ఎవరూ మొదలు పెట్టడం లేదు కదా?

మనందరికీ చేయతగినవి, ఎప్పుడూ నేల చాప నిద్ర, శాఖాహారము, ఎప్పుడూ ఒంటి మీద ఖరీదైన ఆభరణాలు లేదా వస్త్రధారణ మోహం లేకుండా, ఒక కూర తో మిత ఇంటి భోజనం మరియు ఫలహారము, చేతనైతే మన అంతహ్ శత్రువులైన, అరిషడ్ వర్గాల ను జయించడం. వీటిలో కనీసం కొన్ని అయినా?

ఎవరన్నా నేను పది సార్లు, గురు దైవ చరిత్ర పుస్తకాలు చదివాను అంటే, సంతోషం, మరి పాటించడం ఎప్పుడు అని అడగాలి? వచ్చే జన్మలో నే, అని చాలా మంది నిఖార్సైన జవాబు, సిగ్గు పడకుండా ప్రసాదము తింటూ చెపుతారు.

మనసు బాగోలేదు, జీవిత మర్మాలు తెలుసుకొవాలి అనుకుంటే, దానికి భగవద్గీత, భాగవతం, రామాయణం, భారతం, ఉపనిషత్లు ఉన్నాయి, ఇవి పెద్దలు పూర్వీకులు చెప్పారు. మనలాంటి ఈ మధ్య మనుషులు రాసినవి కాదు, కల్పించి కధలుగా, నేటి తక్కువ మోహపు బుద్దికి సరిపోయేటట్లు.

వేరే పుస్తకాలు, చదివే వారికి అలాగే చెప్పాలి. ఇవి సనాతన ధర్మం పెద్దలు చెప్పినవి, ఇవి మాత్రమే చదవండి అని. మధ్యలో వచ్చిన వి మధ్యలో నే వెళతాయి. రామాయణం భారతం భగవద్గీత రాసింది వాల్మీకి, వ్యాసుడు, వినాయకుడు, లాంటి స్వచ్చమైన మనసులు గల మన ముత్తాతలు. ఏనాటికి ముత్తాతలకన్న మనము వీరులము కాదు. ఒక చిన్న చేతి బాణం చక్రం, లక్షల మందిని మొహములో పడేసి, మరలా రాముని క్రిష్ణుని వద్దకు చేరడము, మనకు ఇంకో 2000 ఏళ్ళ కైనా అవుతుందా?

మనుషులు మధ్యలో ఏదో రాసింది, పై ఉత్తములు రాసింది ఒకటే అని, మోహము లో ఉన్నవారు అనడం చూస్తున్నాము కదా, ఆ మాయలో పడకూడదు. మనుషులు వే కావాలి అంటే, వేమన సుమతీ భాస్కర శతకం, బ్రహ్మం గారి తత్వం లు ఉన్నాయి.

రేపు మన పిల్లలు, కొత్తగా డేగా బాబా వచ్చారు, ఇప్పుడు అందరూ ఈయననే కొలుస్తారు అంటే, వారి పరిస్తితులు లేదా జీవితభాగస్వామిని బట్టి? మనము ఏమీ చేయలేవు. ఎందుకంటే మన లాగే, వాళ్ళు కొత్త మాయలో ఉన్నారు.

అదే మనం పాత దానికి కట్టుబడి ఉంటే, మన కుటుంబం తరాలు కూడా, అదే కట్టుబడి ఉంటుంది. మన నమ్మకం కాదు ముఖ్యం, సాత్వికులు పెద్దలు అందరూ అంగీకరించాలి.

తెలుగు లో రాసినవి, వంద ఉన్నాయి. సంస్కృతం భాగవతం భారతం గీత, చదవమని ఎవరూ బలవంత పెట్టలేదు. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి.

మనకు ఒకరు మీద గురి ఉండాలి, వారికే పూజలు పునస్కారాలు. అంటే విష్ణు, కృష్ణ, లక్ష్మీ, శివ, లలిత నీ ఇష్టము. ఆ గురి నిరంతరం పెరగాలి, వారంతా పూర్వ దేవతలు అయి ఉండాలి.

50 శాతం ఇటు పెట్టి, 50 శాతం ఇంకో వైపు పెడితే, 2 పడవల మీద కాపురం లాగా ఉంటుంది చివరకు. మనము ఎన్ని అయినా చదువు కోవచ్చు, కానీ వ్రతాలు పూజలు, ఆ పురాణ దేవతలు కే ఉండాలి, వారంతా ఒకటే అన్న భావన ఉండాలి.

పదిమంది అమ్మాయి అబ్బాయి ల తో రోజూ వారి జీవితములో మాట్లాడినా, కానీ భర్త లేదా భార్య ఒకరే ఉండాలి. వారి విలువ స్థానం వారిదే. ఇది అర్థం అయితే, జనం ఎంత మూర్కంగా ఉన్నారో తెలుస్తోంది.

జీవిత చరిత్ర మంచిదే, దాని కన్నా తత్వాలు చాల ఉత్తమం, ఆధ్యాత్మికముగా పెరగాలి అనుకుంటే. భాగవతం శ్రీకృష్ణుని చరిత్ర, కానీ భగవద్గీత ఆయన తత్వం.

ఇన్నేళ్లు వచ్చి మనకే సరిగ్గా తెలీదు, మన పిల్లలు లేదా తర్వాత తరానికి నిగ్రహ శక్తి, బుద్ధి తక్కువ. తరాలు మారేకొద్ది నిష్ట తగ్గుతుంది, ఇలాంటి బలహీన కొత్త ఆలోచన ల వలన.

పురాణములు మరియు ఇప్పుడు మనుషులు రాసిన కధలు ఒకటే అనకూడదు. తరాలు మారే కొద్ది, మనిషి ని బట్టి భావం భక్తి మారుతుంది తగ్గుతుంది. ఎవరికీ వారే, తాము చేసేది మంచి అనుకుంటున్నారు 80 శాతం ఇప్పుడు, కలియుగం కదా. నాయకులు అధికారులు, మన లాంటి గోపీ లు, ఎవరికి వారు, తాము చేసేది మంచే అంటున్నారు, వారితోనే వారి అనుచరులు అవకాశవాదులు.

ఆదిశంకరులు, వేమన, బ్రహ్మం, రామానుజ, రాఘవేంద్ర స్వాములు, వీళ్ళు వద్దు అంట. దూరంగా ఉండే దేగా బాబాలు మాత్రమే కావాలంట, కొత్త వ్యాపారానికి మోజుకి.

గురువు దైవం చూపుతారు. మరి, లోకల్ గురువు ను నమ్మను అంటున్నాము అంటే, మనము నిజమైన భక్తులమేనా? నిబద్దత ఉంటే, నేరుగా దైవాన్ని నమ్ము అప్పుడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 796 General Articles, 46 Tatvaalu
Dt : 09-Oct-2020, Upd Dt : 09-Oct-2020, Category : Devotional
Views : 61 ( + More Social Media views ), Id : 745 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : life long , recitation , reading , practice , fascination , local guru , myths , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content