గత ఎన్నికల గాలిలో, ఈడ్చితన్ని ఓడించినా, చీరాల నాయకులు అభివ్రుద్దితో, ఓటర్లు ను గౌరవించరా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,338; 104 తత్వాలు (Tatvaalu) and views 224,957.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

జగనన్న చెప్పిన మాట ప్రకారం, సహజంగా పార్లమెంటు స్ధానాల విభజన, జరుగుతుంది. బాపట్ల లో జిల్లా అయేందుకు కావాల్సిన, ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎందుకంటే చీరాల అభివృద్ధి తెచ్చే సమస్యలు చెప్పే, విశ్వాసపాత్రులు కృతజ్ఞులు లేరు కాబట్టి.

బాపట్ల పార్లమెంటు స్ధాన పరిధికి, బాపట్ల ఒక పక్కన ఉందని, చీరాల మధ్యలో ఉందని, అద్దంకి సంతనూతలపాడు కు చీరాల దగ్గర అనైనా, మన స్వార్థ స్థానిక నాయకులు, వైసీపీ పార్టీ పెద్దలు కు చెప్పగలరా? అసలు ఆ విషయం అయినా తెలుసా, అవగాహన ఉందా? రాష్ట్రానికి 3 రాజధానుల సిద్దాంతము జిల్లాలలో అమలు చేస్తారా?

అమరావతి మధ్యలో ఉందని గొడవ చేసే, చంద్రన్న మరియు తెదేపా నాయకులు కూడా, ఇక్కడ గమ్ముగా ఉన్నారు మరి. చీరాల టీడీపీ బిజెపి జనసేన శాఖలు నిద్ర మత్తులో నుంచి, ఇక పైకి లేవవా? అని ప్రజలు ఆశ్చర్యం గా గమనిస్తూ ఉన్నారు.

చీరాల జిల్లా తెచ్చే, పరిజ్ఞానం సత్తా పలుకుబడి విలువ దమ్ము లేకపోయినా, కనీసం అదే పార్లమెంటు విభజనలో అన్నా, చీరాల జిల్లా పేరు అనమని, జిల్లా కార్యాలయాలు చీరాలలో పెట్టమని, ఈవిధంగా అన్నా న్యాయం చేయమని, పార్టీ పెద్దలు ను, అడిగే దమ్మున్న నాయకులు, చీరాలలో జిల్లా లో రాష్ట్రం లో ఉన్నారా?

కేవలం పార్టీ ఇంఛార్జి పదవి తప్ప, చీరాల అభివృద్ధి గొడవ పట్టదా? అవి ఇవ్వకపోతే, హార్బర్ చేనేత పార్క్ తీసుకుని రారా? బాలినేని గారి పలుకుబడి ఇక్కడ దీనికి కూడా పనికి రాదా? చీరాల బాగు కోరే ఒక్క రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు లేరా? కనీసం ఉపసభాపతి కోన గారైనా హమీ తో అండగా ఉంటారా? అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు.

అభివృద్ధి పధంలో బాపట్ల నాయకులు ఉంటే, మన స్ధానిక స్వార్థ నాయక శిఖామణులు, పార్టీ పెద్దలు చెప్పారు అని, వారిని ప్రసన్నం చేసుకోవాలని ఇంఛార్జి పదవి నిలుపుకోవాలని తెచ్చుకోవాలని, ఓ 500 మందిని వెంట వేసుకుని నడక యాత్ర చేపట్టారు, ఒకే పార్టీ లో 2 ముఠాలు గా! వర్షం లో, తమ స్వార్ధ పదవి కోసం తడిచామని, ఫోటోలు ఫ్లెక్సీలు పోటీ గా, సంవత్సరం గా సాధించినది శూన్యం అయినా, నిస్సిగ్గుగా తిరుగుతూ ఉన్నారు, అసెంబ్లీ ఓటర్లు ను పిచ్చి వాళ్ళు ను చేసి.

అంటే, పదవులు ఇచ్చే నాయకులు కు, మడుగులు వత్తుతున్నారు గానీ, లక్ష 50 వేల మంది ఓటర్లు, వీళ్ళ కు దద్దమ్మలు గా కనపడుతున్నారు. ఓటర్లు మద్దతు నమ్మకం అవసరం లేదా? ధనం ఇస్తే ఓటు వేస్తారని నమ్మకమా? మొన్న 2019 లో జగనన్న గాలిలో, ఈడ్చితన్ని ఓడించినా, వీరు ఓటర్లు ను లెక్క చేయరా?

5 ఏళ్ళు కేవలం పై నాయకుల పాదసేవ చేసి తరించి, జగనన్న అంటే, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం లో కరివేపాకును చేసిన తర్వాత, రేపు చంద్రన్న లేదా వీరన్న లు, మేం అభివృద్ధి చేసి ఈ పనులు, ఆదరణ కు నోచుకోని చీరాలకు తెస్తాం అంటే, గతంలో ఆమంచి నే ఓడగొట్టిన చీరాల తెలివైన ఓటర్లు కు , వైసీపీ ని ఓడించడం ఓ లెక్క నా? అని వైసీపీ అభిమానులు శ్రేయోభిలాషులు ఆవేదన చెందుతున్నారు.

ఇప్పుడు అయినా పార్టీ పెద్దలు, పరిస్థితి గమనించి కళ్ళు తెరచి వివేకం తో, స్ధానికంగా అభివృద్ధి పనులు లేకుండా, ఓటర్లు అభివృద్ధి క్షేమం పట్టించుకోకుండా, కేవలం పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తే, తమ అవసరానికి పార్టీలు మారే నాటక నాయకుల ను మందలించి, చీరాలకు తగిన న్యాయం చేసి, జగనన్న పరువు నిలబెట్టాలని, వైసీపీ శ్రేయోభిలాషులు విన్నపాలు చేస్తున్నారు.

దయచేసి చీరాలకు జరుగుతున్న అన్యాయం, చోద్యం చూస్తున్న, స్వార్థ స్థానిక నాయకులు గురించి, అసెంబ్లీ ఓటర్లు అందరికీ మరియు నాయకులు కు, ఈ మెసేజ్ పంపి, కనీసం చీరాల చుట్టుపక్కల ప్రజలకు కృతజ్ఞతలు చూపిస్తారు కదూ.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,338; 104 తత్వాలు (Tatvaalu) and views 224,957
Dt : 07-Nov-2020, Upd Dt : 07-Nov-2020, Category : Politics
Views : 844 ( + More Social Media views ), Id : 797 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : last election , jagan hava , chirala , leaders , defeated , no respect , voters , development , amanchi , karanam , bapatla
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content