ప్రధానమంత్రి మోడీ గారి కోరిక మేరకు, ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 కి, ఇంటి ముందు దీపం - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,646; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మా కార్తీక తులసి దీపం, ఏళ్లుగా, ఉదయం సాయంత్రం, ఆదాయం ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, 74 ఏళ్ల అమ్మ , రోజూ రెండు పూటలా ప్రదక్షిణలు చేసే దీపం ఇది.

మరి రేపు అయినా, కనీసం ఒక్క సారి, ప్రధానమంత్రి మోడీ గారి కోరిక మేరకు, ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 కి 9 నిమిషాల సేపు, ఇంటి ముందు దీపం వెలిగించుదాం, భరత మాత ముద్దు బిడ్డ గా, ఈ పోరాటములో మేమూ ఉన్నాము అని, మన సంఘీభావం తెలుపుదాం.

గ్రహాల శక్తి లేదా లోక కళ్యాణం లేదా భారతీయుల మంతా ఒకటే మరియు ఐక్యం గా కరోనా ను తగ్గిద్దాం, అనే సందేశం ఏది అయినా కానీయండి, పెద్దలు మాట వెనక వంద అర్ధాలు ఉంటాయి, ఎదురు ప్రశ్నలు, ప్రయోజనం గురించి చర్చలు అనవసరము.

నెయ్యి లేదా నువ్వుల దీపం ఉత్తమం, ఆరోగ్యం మన ఇంటికి కుటుంబానికి. కుదరకపోతే కొవ్వొత్తి, టార్చి లైటు వాడుదాం.

ఇంట్లో గుమ్మం దగ్గరే ఉండి, ఎదురింటి లేదా పక్కన ఇంటి వారికి ధైర్యం చెప్పండి. ఈ కష్ట రోజుల లో పలకరించండి ఒంటరి వాళ్ళను. దురదృష్టవశాత్తు జరగరానిది జరిగితే, మనమూ ఒంటరే.

ప్రపంచం అంతా చూస్తుంది, ఈ జనవరి కి మార్చి కి తేడా. డిసెంబర్ లో అనుకున్నాం, షష్ట గ్రహ కూటమి ఫలితాలు, ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అని.

పోలీసులు, ప్రభుత్వ అధికారులు, బయట మనందరి కోసం ఊళ్ళో తిరుగుతూ ఉంటే, కనీసం మన ఇంటి పక్కన వారిని దూరంగా ఉండి పలకరించలేమా? సహాయం అడిగి చేయలేమా? ఆ పుణ్య మే, మన వెంట వచ్చేది, ఇప్పుడు అయినా లేదా ఇంకోనాడైనా.

మాకు మే 3 దాకా పొడిగించారు, విద్యార్థులు కు ఆన్లైన్ క్లాసులు ఖాయం చేస్తున్నారు. ఇంట్లో నే ఉందాం, ఆరోగ్యం కాపాడుకుందాం. యోగా, ధ్యానం, వ్యాయామం తప్పనిసరి. షవర్ కన్నా బక్కెట్ మిన్న. నిమ్మరసం తో కషాయం మంచిది.

జరుగుతున్న ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది, మరువద్దు. ఎవరినీ నిందించవద్దు, కరోనా కోవిడ్ని కూడా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,646; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975
Dt : 04-Apr-2020, Upd Dt : 04-Apr-2020, Category : News
Views : 869 ( + More Social Media views ), Id : 471 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : april 5 sunday light , prime minister modi

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content