కె.విశ్వనాథ్ చెల్లెలి కాపురం - చరణ కింకిణులు, కనుల ముందు, పిల్లగాలి ఊదింది పిల్లన గ్రోవి కవితలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1731 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1766 General Articles and views 1,285,691; 90 తత్వాలు (Tatvaalu) and views 176,088.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇలాంటి అద్భుత కధ అలాగే సాహిత్యం విలువలు ఉన్న సినిమా తీయాలి అంటే, అది కేవలం ఆధ్యాత్మిక దర్శకేంద్రుడు విశ్వనాధ్ గారికే సుసాధ్యం.

చెల్లెలి కాపురం అంటే అంతా చెల్లెలు గురించి ఉంటుంది అనుకుంటాము, కానీ అన్న పడే కష్టం గురించి ఉంటుంది.

తన రూపం బాగొలేదని అందరూ ఎగతాళి చేస్తూ, తన రచనలను కూడా పట్టించుకోకుండా వెళ్ళ గొడుతుంటే, చెల్లి పెళ్ళి ధనం కోసం పట్నము లో, అన్న పడ్డ కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అన్ని చూసి, జీవితములో ఒడిదుడుకులు ధైర్యముగా ఎలా తట్టుకోవాలో ఎలా సర్దుకోవాలో మనకు తెలిసివస్తుంది.

అబద్దాలతో బతికే స్నేహితుడే, తనకు ఓ మార్గం చూపించి, ఆదాయం సంపాదించి పెడుతూ, తప్పని పరిస్తితిలో తన పేరు వాడుతూ, అసలు రచయిత అయిన తన పేరు మరుగున ఉంటుంది. తర్వాత ఎలా చెల్లెలు పెళ్ళి చేసాడు, తనకు బాహ్యప్రపంచములో ఎప్పుడు ఎలా గుర్తింపు వచ్చింది అన్నది మీరు సినిమాలో చూడాలి.

మనందరికీ తెలిసిన, చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన అన్న పాటలో రాధ క్రిష్ణుల గురించి వివరిస్తూ, నాట్యానికి తగ్గ గొంతుతో పాడే పాట మీరూ ప్రయత్నం చేయాలి. పదాలు మనకు తొందరగా పలకవు సుమీ.

కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా అన్న పాటలో, ఎంత సాహిత్యాన్ని చరిత్రను ఎంత బాగా రాసారో పలికించారో మీరూ పాడి చూడండి.

ఇక కవితలు, ఇలాంటి మధురు కవితలు పాటలు ఉన్నాయి అంటే, ఖచ్చితముగా అది విశ్వనాధ్ గారి చిత్రమే, సందేహము లేదు. సినిమా మొదట కవిత తోనే మొదలవుతుంది. మీరూ ఆలపించండి, ఆస్వాదించండి.

1) సాహిత్యం : సినారె, గానం : బాలు

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన, కర కంకణములు గలగల లాడగ
అడుగులందు కలహంసలాడగా, నడుములో తరంగమ్ము లూగగా
వినీల గజభర.. విలాస బంధుర.. , తనూలతిక చంచలించి పోగ

ఆడవే మయూరీ.. నటన మాడవే మయూరీ.., నీ. కులుకును గని నా పలుకు విరియ
నీ నటనను గని నవ కవిత వెలయగ, ఆడవే మయూరీ. నటన మాడవే మయూరీ..

అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వే.దిక, అట సాగెను విరహిణి రా.ధిక

అది రాధ మనసులో మాధవుడూ.దిన, రసమయ మురళీ. గీ.తిక

ఆడవే మయూరీ.., నటనమాడవే మయూరీ..,
నా పలుకుల కెనెయగు కులుకు చూపి, నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆ.డవే మయూరీ.., నటన మాడవే మయూరీ..

ఫాల నేత్ర సంప్ర భవత్ జ్వాలలు, ప్రసవ శరుని దహియించగా

పతిని కోలు పడి రతీదేవి, దుఖిఃత మతియై రోదించగా

హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా

ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా

ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్ భటుల..
జలిత దిక్ తటుల.. జహిత దిక్కరుల.. వికృత
ఘీంకృతుల.. సహస్ర ఫణ సంచలిత భూత్క్రుతుల

కనులలోన.. కనుబొమలలోన.. , అధరమ్ములోన.. వదనమ్ములోన 2
గళసీమలోన.. కటిసీమలోన.. , కరయుగములోన.. పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన.. అనంత విధముల అభినయించి
ఇక ఆడవే.. ఆడవే .. ఆడవే..

2) Lyrics Writer : C.Narayana Reddy/ సి.నారాయణ రెడ్డి ,
Singer : P.Suseela/ పి. సుశీల, Sp balu/ యస్ పి బాలు

పరిమళించు వెన్నెల నీ.వే., పలకరించు మల్లిక నీ.వే.
నా. జీ.వన బృందావనిలో.., నడయాడే రాధిక నీవే

కనుల ముందు నీవుంటే., కవిత పొంగి పా.రదా.
తొలి చిగురుల చూ.డగా.నే, కల కో.కిల కూ.య.దా ||కనుల ముందు||

అలనా.టి జనకుని కొలువులో.., తొలి సిగ్గుల మే.లి ముసుగులో 2
ఆ.. రాముని చూసిన జానకివై - అభిరా.ముని వలపుల కానుకవై
వాల్మీకి కావ్య వాటిక వెలసిన, వసంత మూర్తివి నీవే.. ||కనుల ముందు||

అలనా.టి సుందర వనములో.., వనములో, ఎల ప్రాయము పొంగిన క్షణములో..,
అలనాటి సుందరవనములో, ఎల ప్రాయము పొంగిన క్షణములో
ఆ.. రాజును గనిన శకుంతలవై - రతి రాజు భ్రమించిన చంచలవై
కాళిదాసు కల్పనలో మెరిసిన, కమనీయమూర్తి నీవే... ||కనుల ముందు||

అజంతా.. చిత్ర సుందరివై, ఎల్లోరా.. శిల్ప మంజరివై 2
రా.మప్ప గుడి మోమున విరిసిన, రాగిణివై నాగినివై
అమరశిల్పులకు ఊపిరులూదిన, అమృతమూర్తివి నీవే.. ||కనుల ముందు||

3) పిల్లగాలి ఊదింది పిల్లన గ్రోవి.., పల్లవించి ఊగింది గున్నమావి....
మా పల్లె మారింది రే.ప.ల్లె.గా., మనసేమో పొం.గిం.ది పాలవెల్లి గా....

చెలువ పంపిన పూలరేకులు, చిలిపి బాసల మూగ లేఖలు
మరల మరలా. చదువు కొందును, మనసు నిండా.. పొదుగు కుందును
చిలిపి బా..సల మూగ లే.ఖలు, చెలువ పం.పిన పూలరే.కులు

పరిమళా.లే. పల్లవులుగా., ప్రణయ గీ.తము లల్లుకుం.దును
ప్రణయ గీ.తము లల్లుకుం.దును, బ్రతుకు పా.టగా. పా.డుకుందును
చిలిపి బా..సల మూగ లే.ఖలు, చెలువ పం.పిన పూ.లరే.కులు

ఎవరి కోసం రాధ ఏ తెంచెనో.., ఎదురు పడగా లేక ఎట పొంచెనో..
తలుపు చాటున దాగి తిలకించెనో., తిలకించి లోలోన పులకించెనో.
చిలిపి క్రిష్ణుడు అంత చెంగు చేపట్టగా.. , నిలువెల్ల ఉలికిపడి తలవాల్చెనో ..


చిత్రం : చెల్లెలి కాపురం (1971), సంగీతం : కె.వి. మహదేవన్
Movie Director : K.Vishwanath / కె.విశ్వనాథ్
Shobhan babu, Vanisri, nagabhushanam

kVishwanath chelleli kapuram charana kimkinulu kanula mundu pillagali udindi pillana grovi kavitalu

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,285,691; 90 తత్వాలు (Tatvaalu) and views 176,088
Dt : 02-Jul-2022, Upd Dt : 02-Jul-2022, Category : Songs
Views : 559 ( + More Social Media views ), Id : 1450 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vishwanath , chelleli , kapuram , charana , kimkinulu , kanula , mundu , pillagali , udindi , pillana , grovi , kavitalu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content