కృష్ణ జన్మాష్టమి - కృష్ణా ముకుందా మురారీ, రారా క్రిష్ణయ్య, ఎన్నాళ్ళని కన్నులు, లీలా కృష్ణ నీ లీలలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,515; 104 తత్వాలు (Tatvaalu) and views 225,156.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*కృష్ణ జన్మాష్టమి - కృష్ణా ముకుందా మురారీ, రారా క్రిష్ణయ్య రారా క్రిష్ణయ్య, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ, లీలా కృష్ణ నీ లీలలు*

కృష్ణ జన్మాష్టమి ని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. జన్మాష్టమి శుభాకాంక్షలు.

ప్రపంచములో ఉన్న కష్టాలు, అన్ని మనకే ఉన్నట్లుగా, ఉద్యోగం ఉండి, ఆస్తులు ఉండి, అన్ని ఉన్నవారు కూడా, మానసిక అశాంతితో, ఎంతో మంది జీవితాంతము బాధపడుతుంటారు.

ఎందుకంటే, వీరు సద్ గుణములను వదిలేసి, అరిషడ్వర్గాల బానిసలుగా, ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు.

వారికి కూడా ముక్తిని ఇచ్చి, మనసును అదుపులో పెట్టుకోవడానికే, మనకు ఋషులు తేలికగా, రామాయణ భాగవత భారతాలను, ఇచ్చారు. కానీ మనకు తీరిక లేదు, అటు చూసే పుణ్యం కూడా, మరలా ఆదేవుడే ఇవ్వాలి.

మరి మన చిన్ని క్రిష్ణుడు చిన్నప్పటినుంచే అష్టకష్టాలు పడ్డారు. ఎంత తెలివిగా ధైర్య సాహసాలతో ప్రవర్తించాలో, ఎలా చుట్టు పక్కల ప్రజలతో కలసిపోవాలో, ఎలా ఇతరులకు సహాయము చెయ్యాలో, చిన్నప్పుడే చేసి చూపించారు.

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో, జన్మించారు.

పుట్టుకతోనే కష్టాలు మొదలు. తండ్రి వసుదేవుడు, దొంగ చాటుగా తీసుకుని వెళ్ళి, వ్రేపల్లెలో యశోదా ఇంట, క్షేమముగా వదలి వస్తారు. కంసుడు తర్వాత ఈ విషయం తెలిసి, ఆ ఊరిలో పిల్లలను చంపమని రాక్షసులను పంపుతారు.

రాక్షసి పూతన వచ్చి పాలు తాపబోగా, చిన్ని క్రిష్ణుడు, తన కపట నాటకాన్ని కనిపెట్టి, ఆమె ప్రాణాలను కూడా హరించారు.

శకటాసురుడు అనే రాక్షసుడు కూడా, బండి/ చక్రముతో, చిన్ని క్రిష్ణుని చంపబోతే, అతనికి మోక్షము కలిగించారు.

కాళీయుని మర్దించి, అక్కడనుంచి వెడలగొట్టి, మంచి నీటి సరస్సును ప్రజలకు ఉపయోగములోకి తెచ్చి, జనాల దాహార్తిని తీర్చారు.

వెన్న దొంగ గా, స్నేహితులతో కలసి అన్ని ఇళ్ళు తిరుగుతూ, గొడవ చేస్తున్నారని, అందరూ వచ్చి చెపితే, తల్లి రోటికి కట్టివేస్తే, చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి, ఆ గంధర్వులకు శాప విమోచనము కల్గిస్తారు.

ఇంద్రుడు కోపముతో ఆ ఊరికి కీడు చేయబోతే, చిటికెన వేలుతో గోవర్ధన గిరిని ఎత్తి, ఆవులు ప్రజలను, కొన్ని రోజుల పాటు కాపాడారు, ఇంద్రుని గర్వం అణిచారు.

మేనమామ కంసుని దురాగతాలను ఆపటానికై, అన్న బలరాముని తో కలసి వెళ్ళి, అతనిని అంతమొందిస్తాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో లీలలు వినోదాలు, బాల క్రిష్ణునిగా.

మరి మనము క్రిష్ణ భక్తులు గా, ఎవరి సేవ చేస్తున్నాము, సమాజములో ఏమి సమస్యలు తీరుస్తున్నాము? కనీసం ప్రజలలో అజ్ఞానాన్ని పోగొట్టి, ఆధ్యాత్మిక మానసిక బలం వైపు అయినా, నడిపించ గలమా? కనీసం పిల్లలకు భాగవతము, భగవద్గీత ఎలా చదవాలో నేర్పగలమా, వారి మానసిక బలం పెంపుదలకు?

క్రిష్ణుని మనసారా కొన్ని పాటలలో తలచుకుందాము. ఆరోగ్యానికి కొన్ని పాటలు పాడదాము.

1) హే కృష్ణా... ముకుందా... మురారీ...
జయ కృష్ణా, ముకుందా, మురారి 2
జయ గోవింద, బృందా విహారీ...
కృష్ణా... ముకుందా... మురారి; జయ గోవింద, బృందావిహా..రీ..; కృష్ణా... ముకుందా... మురారి

దేవకి పంట... వసుదేవు వెం.ట....2
యమునను నడిరేయి, దాటితి వంటా.. ఆ..ఆ
వెలసితివంటా..., నందుని ఇంటా 2
వ్రేపల్లె ఇల్లాయే నం..టా...ఆ..
కృష్ణా... ముకుందా... మురారి; జయ గోవింద, బృందావిహా..రీ..; కృష్ణా... ముకుందా... మురారి

నీ పలుగా..కి, పనులకు గోపెమ్మ...2
కోపించి, నిను రోట, బంధించె నంటా..ఆ..ఆ..
ఊపునబోయీ, మాకుల కూలిచి....2
శాపాలు, బాపితివంటా....ఆ...
కృష్ణా... ముకుందా... మురారి; జయ గోవింద, బృందావిహా..రీ..; కృష్ణా... ముకుందా... మురారి

అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ...
చూడమ్మా, అని రామన్న తెలుపగా..
అన్నా.. అని, చెవి నులిమి, యశోద..
ఏదన్నా, నీ నోరు చూపుమనగా...ఆ...
చూపితివట నీ నోటను... బాపురే, పదునాల్గు, భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు...
తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..

జయ కృష్ణా... ముకుందా... మురారి, జయ గోవింద బృందావిహారీ... ఈ..., కృష్ణా... ముకుందా... మురారి

కాళీయ, ఫణిఫణ, జాలాన, ఝణఝణ...2
కేళీ ఘటించిన, గోపకిశోరా..ఆ..ఆ
కంసాది దానవ, గర్వాపహారా...2
హింసా విదూరా.., పాప విదారా...

కృష్ణా... ముకుందా... మురారి,జయ గోవింద బృందావిహారీ... ఈ.., కృష్ణా... ముకుందా... మురారి

కస్తూరి తిలకం... లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్... కరే కంకణమ్
సర్వాంగే హరి చందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...
విజయతే... గోపాల చూడామణీ...2

లలిత లలిత, మురళీ స్వరాళీ...2
పులకిత వనపాళి... గోపాళీ..
పులకిత వనపాళి...ఈ...
విరళీకృత నవ, రాసకేళి...2
వనమాలీ, శిఖి పింఛమౌళీ ..2

కృష్ణా... ముకుందా... మురారి... , జయ గోవింద.. బృందావిహారీ...,

కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి..
జయ కృష్ణా... ముకుందా... మురారి..

హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ..

Song Name :Jaya Krishna Mukunda Murari, Movie: Panduranga Mahatyam, Singers: Ghantasala Venkateswara rao Garu, Lyricist: Samudrala Garu, Composer: T.V Raju Garu, Director: Kamalakara Kameshwararao Garu, NTR

చిత్రం: పాండురంగ మహత్యం, గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, గీత రచయిత: సముద్రాల గారు, స్వరకర్త: T.V రాజు గారు, దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు గారు, NTR

2) రారా క్రిష్ణయ్య రారా క్రిష్ణయ్య NTR Song

దీనుల కాపాడుటకు దేవుడే.., ఉన్నాడు
దేవుని నమ్మినవాడు, ఎన్నడు చెడిపో.డు
ఆకలికి అన్నము, వేదనకు ఔషధ౦..
పరమాత్ముని సన్నిధికి రావే..ఓ. మనసా!

రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, దీనులను కాపాడ, రా రా కృష్ణయ్యా - 2
రారా కృష్ణయ్యా..., రా. రా..!

మా పాలిటి, ఇలవేలుపు, నీవేనయ్యా
ఎదురుచూచు, కన్నులలో, కదిలేవయ్యా...
పేదల, మొరలాలి౦చే, విభుడవు నీవే
కోరిన, వరములనొసగే, వరదుడవీవే - 2
అజ్ఞానపు చీకటికి, దీపము నీవే..
అన్యాయము నెదిరి౦చే, ధర్మము నీవే
నీవే కృష్ణా.., నీవే కృష్ణా.., నీవే కృష్ణా! ||రారా కృష్ణయ్యా||

కు౦టివాన్ని, నడిపి౦చే, బృ౦దా.వన౦.
గుడ్డివాడు, చూడగలుగు, బృ౦దా.వన౦.
మూఢునికి, జ్ఞాన మొసగు, బృ౦దా.వన౦
మూగవాని, పలికి౦చే., బృ౦దా.వన౦.-2
అ౦దరిని, ఆదరి౦చు, సన్నిధాన౦.
అభయమిచ్చి, దీవి౦చే, సన్నిధాన౦.
సన్నిధాన౦, దేవుని సన్నిధాన౦, సన్నిధాన౦..||రారా కృష్ణయ్యా||

కృష్ణా.. కృష్ణా.. కృష్ణా..
కరుణి౦చే, చూపులతో, కా౦చవయ్యా.
శరణొసగే, కరములతో, కావవయ్యా.
మూగవాని, పలికి౦చి, బ్రోవవయ్యా..
కన్నతల్లి, స్వర్గములో, మురిసేనయ్యా..
నిన్ను చూసి, బాధలన్ని, మరచేనయ్యా...
అధారము, నీవేరా, రారా, కృష్ణా!
కృష్ణా.., కృష్ణా.., రా రా.., కృష్ణా!||రారా కృష్ణయ్యా||

చిత్రం : Ramu Telugu Movie - NTR,Jamuna (1968), సంగీతం : ఆర్. గోవర్ధన్, గీతరచయిత : దాశరథి, నేపధ్య గానం : ఘంటసాల
రాము తెలుగు సినిమా - ఎన్టీఆర్, జమున (1968)

3) గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ..

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ,
ఎదురు చూతురా.., గోపాలా..
ఎంత పిలచినా... ఎంత వేడినా..ఈ నాటికి దయరాదేలా.. 2
గోపాలా.. నంద గోపాలా..2

వీనుల విందుగ వే.ణుగా.నము, విని తరింపగా వేచితిరా..ఆ.. ఆ.. 2
వేచి వేచి, యీ వెన్నముద్దవలె, కరగిపోయెరా..,నా బ్రతుకు
కరగిపోయెరా.. నా బ్రతుకు ||ఎన్నాళ్ళని నా||

వెన్న మీగడలు, జున్ను పాలకు, eaమి కొరతరా.. మన యింట..ఆ.. ఆ.. 2
పాలను ముచ్చలి పరుల చేతిలో, దెబ్బలు తినకురా.. కన్నయ్యా 2
యీ తల్లి హృదయము ఓర్వలేదయా

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల||ఎన్నాళ్ళని నా||

Film: Sri vEnkaTESwara mahatyam (1960), Music: penDyaala, Lyrics aatrEya, playback: P Saanta kumaari, NTR
చిత్రం: శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960), సంగీతం: పెన్‌ద్యాల, సాహిత్యం ఆత్రేయ, ప్లేబ్యాక్: పి శాంత కుమారి, NTR

4) లీలా కృష్ణ, నీ లీలలు, నే. లీలగనైనా, తెలియనుగా...
తెలిసి తెలియని, బేలల కడ నీ, జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ
లీలా కృష్ణ, నీ లీలలు, నే. లీలగనైనా, తెలియనుగా...

వేణు గా.నమున, తే.రగ పిలిచి, మౌనము పూనగ ఏ.లనో.. 2
అలకయేమొయని, దరి రాకుండిన, జాలిగ చూచే, వేలనో...
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

నీ చిరునవ్వుల, వెన్నెలలో, మైమరువగ, చేయగ, ఏలనో 2
మైమరచిన చెలి, మాటే లేదని....ఆ ..ఆ..ఆ
మైమరచిన చెలి, మాటే లేదని.. ఓరగ చూచే వేలనో...

లీలా కృష్ణ, నీ లీలలు, నే. లీలగనైనా, తెలియనుగా...
తెలిసి తెలియని, బేలల కడ నీ, జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ
లీలా కృష్ణ, నీ లీలలు, నే. లీలగనైనా, తెలియనుగా...

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.

Mahamantri Timmarusu Songs | Leela Krishna | NTR | Varalakshmi
మహామంత్రి తిమ్మరుసు పాటలు | లీలా కృష్ణ | ఎన్టీఆర్ | వరలక్ష్మి

krishnajanmashtami krishna mukunda murari rara krishnayya ennallani na kannulu kayaga lila krishna ni lilalu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,515; 104 తత్వాలు (Tatvaalu) and views 225,156
Dt : 17-Aug-2022, Upd Dt : 17-Aug-2022, Category : Songs
Views : 539 ( + More Social Media views ), Id : 1497 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : krishna , janmashtami , mukunda , murari , -krishnayya , ennallani , kannulu , kayaga , lila , krishna , lilalu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content