కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ - సోషల్ మీడియా సమాచారము మరియు అధికారుల ఫోన్ నంబర్లు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,937,503; 104 తత్వాలు (Tatvaalu) and views 230,577.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ గారి, గొప్పతనము గురించి కూడా మనము అనుకోవాలి. మోడీ గారి డిజిటల్ ఇండియా ను సమర్ధన చేస్తూ, సోషల్ మీడియా సమాచారము మరియు అందరు అధికారుల ఫోన్ నంబర్లు ధైర్యముగా నిబద్ధతతో, పారదర్శకముగా ప్రజలముందు ఉంచిన వీరులు, మన ఏ. ఎం. డి. ఇంతియాజ్ గారు. Link.

మీ జిల్లా అధికారులను కూడా, ప్రభుత్వ మరియు ప్రజల రుణం తీర్చుకోమని అడుగుతారు కదూ? అనంతపురం మరియు కృష్ణా జిల్లా ల, ఆదర్శ జిల్లా వెబ్సైట్ మరియు సోషల్ మీడియా లాగా, ప్రతి జిల్లా టెక్నాలజీ లో ముందు ఉండాలి.

టాప్ 2 జిల్లాలలో, వీరు కూడా ఉన్నారు. జగనన్న పధకాలను రోజూ, ప్రజల అరచేతిలో కి, చేరడానికి ఆయన చేస్తున్న క్రుషి, అమోఘము. పోస్ట్ లు పబ్లిక్ రిలేషన్ లేదా గుమస్తా పెట్టినా, అది కలెక్టర్ కిందకే వస్తుంది కదా. ఫేస్బుక్, ట్విట్టర్ కూడా వాడుతూ, రోజూ సమాచారము ప్రజలకు ఇస్తున్నారు, సంక్షిప్త సందేశాలతో. నిన్న ఒక్క రోజే దాదాపు 10 పైన పోస్టులు వివరాలు మరియు ఫోటోలతో పెట్టారు.

ఎంత వినయముగా ఉంటారో, ఫోటోలలో చూడండి. చాలా మంది, ఉద్యోగం రాక గ్రూప్ 1 కోసము ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడి కూడ, ఒక్కసారి ఉద్యోగము వచ్చాక, గతము మరచి పోతారు, ఇతర జిల్లా స్ధాయి అధికారులను మరియు ప్రజలను పట్టించుకోరు. కానీ ఇంతియాజ్ గారు లాంటి మంచి వారు, ఎంత ఎదిగినా ఒదిగి, అందరినీ కలుపుకు పోతూ, ప్రజలకు తలలో నాలుకులా ఉంటారు. మా మాటలు నమ్మవద్దు, వారి ఫేస్బుకు ట్విట్టర్ లో ఉన్న ఫోటోలతో, మీరే పోల్చుకోండి.

చూడండి గత 24 గంటలలో వారి పనులు కొన్ని, వారి ప్రియ జిల్లా ప్రజల కోసము సమాచారం,

1. అగ్రికల్చర్ అడ్వైజరీ చైర్మన్ రాఘవరావు గారిని జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి గారు శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో గౌరవ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి గారు, జాయింట్ కలెక్టర్ మాధవీలతగారు, గౌరవ శాసనసభ్యులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

2. బుధవారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలోని రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాయ సలహ మండలి సమావేశం కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగింది.

3. గన్నవరం విమానాశ్రయములో గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని గౌరవ రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ గారు మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఇలా చాలా ఉన్నాయి, మీరే చూడండి వారి ఫేస్బుక్ లో, లైక్ చేయండి. పక్క జిల్లా ల ను చూసైనా, మన అధికారుల పనులు ఏమిటో, అవి మన జిల్లా కు ఎందుకు జరగడము లేదో, తెలుసుకోండి అడగండి, మీ నాయకులు మరియు అధికారులు ను.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,937,503; 104 తత్వాలు (Tatvaalu) and views 230,577
Dt : 07-Oct-2020, Upd Dt : 07-Oct-2020, Category : General
Views : 753 ( + More Social Media views ), Id : 741 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : krishna , district , collector , imtiaz , social media , phone numbers , officers
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content